నవతరంగంలో ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకూ వచ్చిన వ్యాసాలు
by admin@ 24fps
నేను విన్న మన పాటలు
గమనిక: ఈ అభిప్రాయాలు నేను నాకు తెలిసినంతలో గమనించినంతలో కలిగినవి మాత్రమే. వీటిలో పొరపాట్లు కూడా ఉండవచ్చు…బహుశా కాలం గడిచే కొద్దీ (rather, వయసయ్యే కొద్దీ) ఇక్కడన్న అభిప్రాయాలు మారొచ్చు కూడా. కనుక, ఇలా నాలుగు భాగాలు ఎలా చేస్తారు మీరు? నువ్వెవరు చెయ్యడానికి? వంటి ప్రశ్నలేస్తే జవాబులకోసం ఎదురుచూడొద్దని మనవి చేసుకుంటూన్నా. ఇక నా క్లాసిఫికేషన్ కి ప్రాతిపదిక అంటారా – నేను చూసిన సినిమాలలో పాత-కొత్త అని …
కరీంనగర్ చలనచిత్రోత్సవం
రెండవ జాతీయ చలనచిత్రోత్సవం కరీంనగర్ లో రేపట్నుంచి మొదలు కానుంది. అసలు కరీంనగర్ లాంటి నాన్ మెట్రో సిటి లో ఒక ఫిల్మ్ క్లబ్ వుండడం,వాళ్ళు ఒక పూర్తి స్థాయి చలనచిత్రోత్సవం జరపడం చాలా సంతోషంగా వుంది. కరీంనగర్ లో ఇలాంటి ప్రయత్నం జరగడం వెనుక చాలా మంది సినీ ప్రేమికులే వున్నారు. వారిలో ముఖ్యుడు శ్రీ వారాల ఆనంద్. ఈయన కరీంనగర్ ప్రజలకు మేలైన సినిమాలను పరిచయం చేసే ప్రయత్నంలో …
అంతర్జాలంలో బి యెన్ రెడ్డి
ఈ నెల ఫోకస్ విభాగంలో బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి గురించిన సమాచారం అందించాలన్న ప్రయత్నం మొదలుపెట్టాము. ఈ నెలలో సాధ్యమైనంత సమాచారం సమకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాము. ఒక వేళ వీలు కాకపోతే రాబోయే రోజుల్లో కూడా బి యెన్ రెడ్డి సినిమాల గురించి, ఆయన గురించి వ్యాసాలు ప్రచురించే ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే ’కథను గాలికొదిలేసిన తెలుగు సినిమా’ అనే వ్యాసంలో రాజేంద్ర గారు బి యెన్ రెడ్డి గారి …
The cup
సినిమా: The Cup దర్శకత్వం:Khyentse Norbu దేశం:ఇండియా/భూటాన్/టిబెట్ సంవత్సరం:1999 అవార్డులు: — Official Selection Directors Fortnight Cannes Film Festival — Official Selection Hong Kong International Film Festival — Winner FIPRESCI PRIZE Pusan International Film Festival — Official Selection Toronto Film Festival — Official Selection International Buddhist Film Festival కథ: అది 1998 వ సంవత్సరం. ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫీవర్ ప్రపంచమంతా వ్యాపించి వుంటుంది. ఈ ఫుట్ …
The Accused-నిందుతులు
ఈ చిత్రం 1988లొ విడుదల అయ్యింది. జోడి ఫొస్టెర్ కి మొట్టమొదట ఆస్కర్ తెచ్చిపెట్టిన చిత్రం ఇది. ఈ చిత్రం అప్పుడు చాల వివాదాస్పదం అయింది. దానికి కారణం కధావస్తువు. Sarah Tobais ఒక రాత్రి ఒక చవకబారు బార్లొ సాముహిక బలాత్కారానికి గురి అవుతుంది. ఆమే నేరస్తులని గుర్తుపట్టినా వాళ్ళని తొమ్మిది నెలల శిక్షతో వదిలేస్తారు. కారణం ఆమె ఆరొజు గంజాయి తాగిఉండడం, వస్త్రధారణ ఇంకా ప్రవర్తన …
రెండు HIFF లఘు చిత్రాలు
యు ట్యూబ్, మీ ట్యూబ్ లో దేని కోసమో వెతుకుతుంటే ఈ రెండు వీడియోలు దొరికాయి. ఈ రెండు సినిమాలు మొన్న జరిగిన హైదరాబాదు చిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డాయనుకుంటా. మొదటి సినిమా పేరు ’?’(question mark). ఈ సినిమా నాకంతగా నచ్చలేదు. ముందసలు అర్థం కాలేదు. కానీ ఫోటోగ్రఫీ బావుంది కొన్ని చోట్ల. సంగీతమూ బావుంది.ఈ సినిమా భరణి గారి సిరా సినిమా ప్రేరణ అనుకుంటా. ఈ సినిమా గురించి youtube లో ఈ …
గాన గంధర్వుడి గానవర్షం
మూడున్నరదాటి పదినిముషాలైనా బస్సు ఇంకా కదలలేదు. వేడిగానేకాదు ఉక్కగా కూడా ఉంది లోపల. ఫిబ్రవరి వచ్చింది కదా మా ఊరికి వేసవి వచ్చేసింది అనుకున్నాను. ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని ఎఫ్ఫెమ్ రేడియో వినడం మొదలుపెట్టా. “…బాలసుబ్రహ్మణ్యం” అన్నది మాత్రం అర్ధమైంది, ఆ రేడియోజాకీ మాటల్లో. బాలుగారి గాత్రం వినబడడం మొదలైంది. సన్నగా ఏదో రాగాలాపన మొదలైంది. మనస్సులో కాస్త ఉత్సాహం కూడా. పాట మొదలయ్యేప్పటికి బస్సుకూడా కదిలింది. “ఉమండు ఘుమండు ఘన్ …
పది నిమిషాలు
మనమెన్నో సినిమాలు చూస్తుంటాం, కానీ అందులో ఎన్ని సినిమాలు మన జీవితకాలం గుర్తుంచుకునేలా చేస్తాయి? నిన్న రాత్రి నేను చూసిన ఈ పది నిమిషాల లఘు చిత్రం మాత్రం నాకు మరో జీవితకాలం గుర్తుంచుకునే అనుభూతిని మిగిల్చింది. మనసున్న ప్రతి మనిషి మనసును కదిలించగలిగే ఈ పది నిమిషాల సినిమా పేరు కూడా పదినిమిషాలే (10 minutes).Bosnia-Herzegovina దేశానికి చెందిన Ahmed Imamovic దర్శకత్వం వహించిన ఈ సినిమా 2002 …
Citizens and Subjects of Telugu Cinema
Political activists, civil liberties groups and academics have pointed out that while in theory every member of the general population is a citizen—with inalienable rights—in practice rights are available only to a small section of the society. We witness a situation in which a majority of the population is unable …
మారుతున్న సినిమా కథనం
సాధారణంగా మన సినిమాల్లో కథలన్నీ ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటాయి. అలాగే కథనం కూడా సరళ రీతిలో ఉంటుంది. ఒక వ్యక్తి తన గమ్యం చేరడానికి లేదా లక్ష్యం నెరవేర్చడానికి పడే ప్రయత్నం, ఆ ప్రయత్నం లో అతనికెదురయ్యే ఆటంకాలు, అవాంతరాలను అధిగమించి చివరకా వ్యక్తి విజయం సాధించడంతో కథ ముగుస్తుంది. కథలో జరిగే సంఘటనలను సరళ రీతిలో చెప్పకుండ, కథలోని కొన్ని భాగాలను flashbackల …
రాజేశ్ టచ్‍రివర్ – “అనామిక” చిత్ర దర్శకుడి పరిచయం
పేరు: రాజేష్ టచ్ రివర్ పుట్టింది పెరిగింది: కేరళ లోని ఒక గ్రామం చదువు: త్రివేండ్రం స్కూల్ ఆఫ్ డ్రామా లో డైరక్షన్/డిజైన్ లో డిగ్రీ, జికా స్కూల్ ఆఫ్ యానిమేషన్ లో డిప్లొమా మొదటి అడుగు: చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఆసక్తి కారణంగా,నా డిగ్రీ అయ్యాక సినీ రంగంలోకి నా మొదటి అడుగు వేసాను. మిత్రుల సహాయంతో ఒక లఘు చిత్రం నిర్మించి, దర్శకత్వం వహించాను. ఆ సినిమా అప్పట్లో కొన్ని …
Travellers and Magicians – భూటాన్
Country:Bhutan Year:2004 Language:Dzonghka Story & Direction: Khyentse Norbu Awards: Deauville Asian Film Festival – Audience award Asian Americal Film Festival – Emrging Director award “మానవుని దు:ఖానికి కారణం ఉంది. కోరిక వలన దు:ఖం పుడుతోంది. దు:ఖం పోవాలంటే కోరిక నశించాలి” అని చెప్పిన బుద్ధుని బోధనలు విశ్వసిస్తున్న దేశాలలో భూటాన్ ఒకటి. దర్శకుడు Khyentse Rinpoche ఒక పేరుపొందిన బౌద్ధ లామా. తన భూటాన్ ప్రజల జీవితాన్ని, …
వేమగిరి – “రాళ్ళు” చిత్ర దర్శకుడి పరిచయం
పేరు:వేమ వెంకట గిరి వర ప్రసాద్ పుట్టింది పెరిగింది:గేటు గట్టు పాళెం, నందనవనం, ప్రకాశం జిల్లా చదువు: ఇంటర్ వరకూ ప్రకాశం జిల్లాలో, డిప్లొమో : పాడేరు, విశాఖ జిల్లా, డిగ్రీ: కావలి సినిమాలపై ఆసక్తి: నాకు చిన్ననాటినుంచీ నాటకాల పై ఆసక్తి. ఊర్లో పెద్దలు ప్రదర్శించే నాటకాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడిని. కొన్నాళ్ళకు వాళ్ళు నాట్కాలు వేయడం మానేసాక స్వంతంగా నాటక రచన చేసి ప్రదర్శించడం మొదలుపెట్టాను.పై చదువుల కోసం ఊరు వదిలి వెళ్ళినా …
Comments
తెలుగు సినిమాల గురించి తిట్లు, పొగడ్తలతోనే కాలక్షేపం చేస్తున్నారు ఎక్కువగా.
1. నవతరంగం లక్ష్యం ఎక్కువమందిని మంచి సినిమాల వైపు ఆకర్షించడం. మొదటిసారి ఈ సైటు చూసినవాళ్లపై మంచి అభిప్రాయం కలిగేటట్లు ఉండాలి.
2. వ్యక్తిగత అభిప్రాయాలకు సొంత బ్లాగులు ఉన్నాయి. మన కసి తీర్చుకోవడానికి వాటిని వాడుకోవచ్చు. నవతరంగం వ్యాసాల్లో పరిణితి కనిపించాలి.
3. విమర్శ తప్పనిసరి. చెప్పే విధానమే మారాలి. కొన్ని వ్యాసాలు మరీ అతిగా ఉంటున్నాయి.