ఇప్పటివరకూ….
by admin@ 24fps
నవతరంగం మొదలుపెట్టి ఇప్పటికి వారం అయింది. ఇవ్వాల్టికి నవతరంగం లో 20 వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అలాగే ఫోకస్ శీర్షికలో నెలకో దర్శకున్ని పరిచయం, ఈనెల సినిమా శీర్షికన నెలకో మంచి సినిమా పరిచయం చేస్తున్నాం. ఇంకా కొత్త శీర్షికల ద్వారా మరిన్ని వ్యాసాలు ప్రచురించాలని కూడా ప్లాన్ వుంది. నవతరంగం ద్వారా మీరేంకోరుకుంటూన్నారో మీ సలహాలు తెలుపగలరు.
ఇప్పటివరకూ ప్రచురించబడ్డ వ్యాసాలు:
- నవతరంగం
- HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-2
- HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-1
- తొలి తెలుగు భారతీయ సినిమా పత్రిక – చిత్ర
- చంద్రహారం (1954)
- బెంగళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
- రెండవ హైదరాబాదు అంతర్జతీయ చలన చిత్రోత్సవం
- నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు?
- నేను చూసిన సావిత్రి
- ముంబాయ్ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన సిరా
- 12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవం -విజేతలు
- బాక్స్ మ్యాన్ -ఒక లఘు చిత్రం
- 5వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
- హైదరాబాదు ఫిల్మ్ క్లబ్
- 12వ కేరళ చలనచిత్రోత్సవం
ఈ నెల సినిమా
ప్రపంచంలో అన్ని మూలల నుండి ఎన్నో మంచి సినిమాలు వస్తూనే వున్నాయి. వాటన్నింటి గురించీ కాకపోయినా నెలకో సారి పెద్దగా ప్రచారానికి నోచుకని మంచి సినిమాలను పరిచయం చేయడమే ఈ శీర్షిక ముఖ్యోద్దేశం.
జనవరి నెల సినిమా: I For India
ఫోకస్:జనవరి, 2008
నవతరంగం ద్వారా తెలుగు వారికి ప్రపంచ సినిమా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి నెలా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులను, వారి సినిమాలను పరిచయం చేయడమే ఈ ఫోకస్ శీర్షిక ముఖ్య ఉద్దేశం. జనవరి నెలకు గానూ ఈ శీర్షికలో జపాను కు చెందిన ప్రఖ్యాత దర్శకుడు కెంజి మిజోగుచి గురించి పరిచయం చేసుకుందాం.
పై వ్యాసాలు చదివి మీ అభిప్రాయం తెలుపగలరు.
వెంకట్