మీది బెంగళూరా? సినిమాలంటే ఇష్టమా?

by admin@ 24fps

అయితే రేపట్నుంచీ జరగనున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొనాలనుకుంటున్నారా?వారం రోజుల పాటు సినిమాలు చూసి, వాటిలో నచ్చిన వాటి గురించి, నచ్చని వాటి గురించి, అక్కడ మీ అనుభావలను నవతరంగం సైటు ద్వారా పంచుకోవాలనుకుంటూన్నారా? అయితే వెంటనే navatarangam[at]gmail[dot]com కు మెయిల్ చేయండి. ఉత్సాహం కనబర్చి, శ్రధ్ధగా సినిమాలు చూడాలనుకునే వారికి వీలయితే నవతరంగం సైట్ ద్వారా ఒక పాస్  ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇదొక్క చలనచిత్రోత్సవానికే కాదు, ప్రపంచంలో ఎక్కడ చలన చిత్రోత్సవం జరుగుతున్నా, అక్కడ మన వాళ్ళుంటే వారికి నవతరంగం ద్వారా ఇలాంటి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తాం.

వెళ్ళాలనుకున్న వారు వెంటనే మెయిల్ చేయగలరు.