నవతరంగం

by admin@ 24fps

యాభై ఏళ్లకు ముందే ప్రఖ్యాత ఫ్రెంచ్ సినిమా దర్శకుడు Jean Cocteau సినిమా గురించి చెప్తూ ఇలా అన్నారు:

An art form that young people cannot practice freely is doomed in advance. It is essential that the camera become a pen that everyone can use to express themselves in this visual medium.కానీ ఆయన మాటలు నిజం కావడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. నానాటికీ పురోగమిస్తున్న డిజిటల్ టెక్నాలజీ ద్వారా సినిమా తీయడం అనేది అధిక పెట్టుబడితో ముడిపడిలేదు. ఎటువంటి వ్యయ ప్రయాసలు లేకుండానే తమ ఆలోచలనలు ఎక్కువమందికి చేరవేయగలిగే సాధనంగా సినిమా అనే ప్రక్రియ ఇప్పుడూ సాధ్యమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి ఎంతో మంది తమ స్వప్నాలను తెరకెక్కిస్తున్నారు. మన దగ్గరా అలాంటి ఒక విప్లవం తవరలోనే వస్తుందని ఆశించవచ్చు.

టెక్నాలజీ అందుబాటులో వున్నంత మాత్రాన ప్రతిఒక్కరూ కెమెరా పట్టుకుని ఏదో తమకి తోచింది రికార్డు చేసినంత మాత్రాన అది సినిమా కారాదు. సినిమా అనే ప్రక్రియ ధ్వని మరియు దృశ్యం మూలస్థంభాలుగా వుండే ఒక భాష. ఆ భాషను ఉపయోగించి దర్శకుడు ఒక రచయితగా మారి ఒక దృశ్య కావ్యం రూపొందించగలిగిన నాడే, టెక్నాలజీ మనకందించిన వరాలని సక్రమంగా వినియోగించుకోనట్ట్టవుతుంది.

అయితే కెమెరా అనే కలాన్ని తన చేతిలోకి తెచ్చుకున్న దర్శకుడు ఆ కలం తో కవిత్వం పాడించాలన్నా, నిజాన్ని నిర్భయంగా తెలియచేయాలన్న, చరిత్రకు సాక్ష్యంగా నిలవాలన్నా ఆ కలం యొక్క పని తనంతో పాటు, ఆ కలంతో సృష్టించబోయే దృశ్యకావ్యాల గురించి లోతైన జ్ఞానం కలిగివుండాలి. అందుకు ప్రపంచంలోని వివిధ దేశాల చలన చిత్రాలను వీక్షించడమే కాకుండా ఆయా చలనచిత్రాల్లో దర్శకులు ఉప్యోగించిన మెలుకువళూ నేర్చుకోవాలి. అయితే సినిమా అనేది ఎవరో కొద్ది మందికి మాత్రమే చెందినదిగా వున్న భావన వల్ల మన ప్రేక్షకుల్లో అధిక శాతం వీక్షకులగానే మిగిలిపోవడం జరుగుతోంది. కానీ నేడు సినిమా అనే ప్రక్రియ లోని వివిధ అంశాలను తెలియచేసే ఎన్నో సమాచార సాధ్నాలు వున్నాయి. కానీ తెలుగులో ఇలాంటి సాహిత్యం లేకపోవడంతో తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారికి సైతం తమ ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెట్టాలో తెలియకపోవడం చాలా సార్లు జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించే ఉద్దేశంతో మొదలుపెట్టిందే నవతరంగం.

సినిమాలపై ఆసక్తి కలిగిన వారికోసమే కాకుండా, ఆసక్తి లేని వారికి సైతం ఆసక్తి కలుగ చేసే ఉద్దేశంతో నేడి నవతరంగం పేరుతో అంతర్జాలంలో పాఠకులచే, పాఠకుల కొరకు, పాఠకుల సొంతం అయిన ఒక సైటు ప్రారంభించబడింది. తెలుగు ప్రేక్షకులకు ప్రపంచ సినిమాలపై పరిజ్ఞానం కలుగచేయడమే కాకుండా, సినిమా అనే ప్రక్రియలోని వివిధ సాంకేతిక అంశాలను తెలియచేస్తూ పది మంది రచయితలు తమ సినీ జ్ఞానాన్ని మీతో పంచుకోబోతున్నారు.

ఈ ప్రయత్నంలో మీరూ భాగం కావాలంటే navatarangam[at]gmail[com] కు మెయిల్ చెయ్యగలరు. ఇన్నాళ్ళూ 24fps లో మీరందించిన ఆదరణే ఈ నవతరంగం పత్రికకూ వుంటుందని ఆశిస్తూ కొత్త సంవత్సరంలో తెలుగు సినిమా కొత్త పంథాన నడవాలని, మీకు ఈ సంవస్త్సరం తలపోటు రాని సినిమాలు, అర్థం పర్థం లేని సినిమాల నుంచి విముక్తి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ …….

నూతన సంవత్సర శుభాకంక్షలు.

www.navatarangam.com