కొత్త సంవత్సరం….కొత్త ప్రయత్నం
by admin@ 24fps
పాఠకులకు నా నమస్కారాలు!
తొమ్మిది నెలల క్రితం ఈ బ్లాగు ఆరంభించినప్పుడు ఈ రోజు వస్తుందని నేను అనుకోలేదు. మొదట్లో 24fps సైటు రిజిస్టర్ చేసినప్పుడు తెలుగులో రాయాలన్న ఆలోచనే నాకు లేదు. తెలుగు వాళ్ళు తమకు తెలిసిన మంచి సినిమాల గురించి, కొత్తగా విడుదలయ్యే సినిమాల గురించి నిష్పక్షపాతమైన సమీక్షలు రాసే అభిప్రాయంతో ఈ సైటు మొదలు పెట్టడం జరిగింది. అనుకోకుండా ఒక రోజు అంతర్జాలంలో తెలుగు విజృంభణ కళ్ళారా చూసాక, నేను తెలుగులో రాయడం మొదలు పెట్టాను.
మొదట్లో అప్పుడప్పుడు రాస్తున్న బ్లాగు వ్యాసాలు, మీ ఆదరణతో దాదాపు ప్రతి వారం ఒక వ్యాసం రాసే స్థాయి నుంచి ఒక్కోనెలలో దాదాపు ప్రతి రోజూ బ్లాగిన రోజులు కూడా వున్నాయి.ఈ బ్లాగు తో పాటు కొన్నాళ్ళు తెలుగు బ్లాగ్ ఆఫ్ ది డే అనే బ్లాగులో ప్రతిరోజూ ఒక సరికొత్త బ్లాగుని పరిచయం చేసే కార్యక్రమం మొదలుపెట్టాను. ఆ ప్రయత్నం కాస్త నన్ను దేశీ పండితుడిని చేసేసింది. ఈ మధ్య అక్కడ నా పాండిత్యం పెద్దగా పండటం లేదనేది వేరే సంగతి. కొత్త సంవత్సరంలో ఆ పని సరిగ్గా నిర్వహించాలని నిర్ణయించుకున్నాను. వీలు కాకపోతే నా వారసుడి కోసం శోధించాలి!)
అలాగే మన పొద్దు వాళ్ళు వారి పత్రికలో సినిమా శీర్షిక నిర్వహించమని నాకు మరో బాధ్యతను కట్టబెట్టారు. నెలకో వ్యాసం పొద్దు కోసం వ్రాయాలని ప్రయత్నించాను. 7 నెలల్లో 6 వ్యాసాలు వ్రాసి ఒక వ్యాసం వారికి బాకీ పడ్డాను. 2008 లో ఆ బాకీ వడ్డీ తో సహా తీర్చే ప్రయత్నం చేస్తాను.
ఈ బ్లాగు పుణ్యామా అని ఈ సంవత్సరం లండన్ లో జరిగిన 51 వ చలన చిత్రోత్సవంలో పాల్గొనే అవకాశం దక్కింది. పదిరోజుల్లో 50 కి పైగా అత్యుత్తమ సినిమాలు చూసే అదృష్టం ఈ చిత్రోత్సవంలో నాకు కలిగింది. అలాగే ఈ మధ్యనే జోగధేను స్వరూప్ గారిని ఈ సైటు ద్వారా పరిచయం చేయడం జరిగింది. అంతరించిపోతున్న తెలుగు జానపద కళలను ఆయన ద్వారా తెలుసుకోవడం కూడా ఎంతో ఆనందంగా వుంది.
ఈ బ్లాగు మొదలు పెట్టినప్పుడు ఏం రాయాలో అన్న పెద్ద సంధిగ్దతతో వన్నప్పటికీ రాను రాను, సినిమాల గురించి నాకు తెలిసినదే కాకుండా తెలుసుకొవాలని నేను చేసిన ప్రయత్నంలో వీలైనంతవరకూ ఈ బ్లాగు ద్వారా అందరితో పంచుకుందామని ప్రయత్నించాను. 15 వేలకు పైగా పాఠకులు ఈ సైటులోని 150 వ్యాసాలు, 40000 సార్లు చదివి, 500 వ్యాఖ్యలు చేసి, ఈ సైటు యొక్క గూగుల్ పేజి ర్యాంకుని నాలుగుకి చేర్చడమే కాకుండా తెలుగు లోని అత్యుత్తమ పది బ్లాగులకై జరిపిన సర్వేలో చేర్చి అత్యంత ఆదరణ చూపించారు. ఈ విధంగా నా ప్రయత్నం చాలా వరకూ ఫలించిందనే చెప్పొచ్చు.
ఇంకో వారంలో కొత్త సంవత్సరం లోనికి అడుగు పెట్టబోతున్నాం.అనుకోకుండా తెలుగు బ్లాగు ప్రపంచంలోనికి అడుగు పెట్టిన నాకు ఈ సంవత్సరం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే కాలం అనిపిస్తుంది. సినిమాలపై నాకున్న ఆసక్తి వందింతలు కావడానికి కారణం నా బ్లాగు మరియు ఈ బ్లాగు చదివి, వ్యాఖ్యల ద్వారా సలహాలను, సహకారాన్ని అందచేసిన మీరందరూనూ! నాలో కొత్త ఉత్సాహాన్ని కలుగచేసినీ అందరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు.
కొత్త సంవత్సరంలో నా ప్రయత్నాన్ని రెట్టింపు ఉత్సాహంతో కొత్త ప్రయత్నాలతో కొనసాగిస్తానని తెలియజేస్తూ శెలవు తీసుకుంటున్నాను.
Comments
congratulations venkat,,
all the best for more and more success in next year too..
B O L
నేను మీ బ్లాగు అభిమానిని. సినిమాలపై విశ్లేషణ,మంచి సినిమాలకై నా వెతుకులాట ఎప్పుడూ మీ బ్లాగు సందర్శనంతొ ముగుస్తూంటుంది.
Venkat garu:
I like this site.
I am currently writing in Telugu on Akira Kurusowa movie “Rashomon”.
How can I send it to Poddu?
Regards,
Lakshmanna Vishnubhotla