Andre Bazin – ఒక పరిచయం
by admin@ 24fps
ప్రపంచ సినిమా చరిత్రలో సినిమా తీసేవాళ్ళు ఎంతమంది వున్నారో, ఆ సినిమాల గురించి రాసే విశ్లేషకులు అంత కంటే ఎక్కువమందే వున్నారు. అలాంటి విశ్లేషకులే లేకపోతే సినిమా అనే కళకు నిండుతనమూ చేకూరదు, అలాగే నూతనత్వానికీ చోటుండదేమో! సినిమా అనే ప్రక్రియ అభివృధ్ధి చెందడంలో ఈ విశ్లేషకుల పాత్ర వెలకట్టలేనిది. Orson Wells అనే అమెరికన్ దర్శకుడు రూపొందించిన Citizen Kane అనే సినిమా విడుదలయినప్పుడు సాధారణ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించకపోయినప్పటికీ కొంతమంది సినీ విశ్లేషకులు ఆ సినిమాలోని గొప్పదనాన్ని అందరికీ తెలియచేసారు. అందుకే దాదాపు 50 ఏళ్ళతర్వాత కూడా ఆ సినిమా ఇప్పటికీ ప్రపంచంలోని అత్యుత్తమ సినిమాగా పరిగణించబడుతోంది. సినిమా అనే ప్రక్రియలో ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని కలుగచేయడంలో ఈ విమర్శకులు/విశ్లేషకుల పాత్ర ఎంతో వుంది. సినిమా పుట్టుక నుంచీ సినీ విశ్లేషకులు వున్నప్పటికీ, సినిమా విశ్లేషన గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఒక్క పేరు మాత్రం అందరికీ గుర్తొస్తుంది; అదే Andre Bazin.
ఆయన గురించి పొద్దులో నా వ్యాసం చదవండి.