స్వరూప్ కృష్ణ మూర్తి: రచయిత పరిచయం

by admin@ 24fps

పాఠకులకు నమస్కారం.
గత ఆరునెలలుగా ఈ సైటులో నేనొక్కడినే వ్యాసాలు, సమీక్షలు, రాస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే కొన్ని రోజుల్లో మరింత మంది రచయితలచే 24fps ద్వారా కళా సంబంధమైన అంశాలను ప్రచురింపచేయాలనే ఆలోచన వుంది. అందులో భాగం గానే ఇప్పుడు స్వరూప్ కృష్ణమూర్తి గారిని మీకు పరిచయం చేస్తున్నాను.

నానాటికీ కనుమరుగైపోతూన్న మన జానపద కళాసంపద గురించి ఎంతో పరిశోధన చేసివున్న జోగధేను స్వరూప్ కృష్ణ మూర్తి గారు ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రి కళాశాలలో తెలుగు రీడర్ గా పనిచేస్తున్నారు. తెలుగు వారి జానపద కళా సంపద గురించి స్వరూప్ గారు ఇక నుంచి వ్యాసాలు రాస్తుంటారు. నాకు మీరందిమ్చిన ప్ర్రోత్సాహం లాగే మీ వ్యాఖ్యల ద్వారా వారికీ, వారి వ్యాసాలకూ ప్రోత్సాహం కలుగచేస్తారని ఆశిస్తున్నాను.

వెంకట్