ఓమ్మో ఓం శాంతి ఓం!
by admin@ 24fps
ఓం శాంతి ఓం ట్రైలర్ చూస్తే సినిమా కథంతా చెప్పెయ్యొచ్చు. మరి అలాంటి రెండు లైన్ల కథను మూడు గంటల పాటు కొనసా…..గిస్తే ఏమవుతుందో తెలుసా? చివరిదాకా భరించిన వాళ్ళకి తలనొప్పి.
ఇంతకీ ఆ రెండు లైన్ల కథేంటంటే ఓం అనే కురాడు హీరోఅవ్వలని కలలు కంటూ ఒక ప్రఖ్యాత హీరోయిన్తో ప్రేమలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటాడు.మరో జన్మలో నిజంగానే సినిమా హీరో అయ్యి పూర్వజన్మలో ఆ హీరోయిన్ను తనకు కాకుండా చేసిన హిలన్ని ముప్పుతిప్పలు పెడ్తాడు. అదీ కథ.
మరి ఇలాంటి తలతిక్క కథను ఎలా ప్రేక్షకుల తలకెక్కుతుంది? తుందండీ! ఎందుకంటే కథదేముంది, LKG చదివే మా సాయి గాడు రాత్రుళ్ళు తెగ కథలు చెప్తాడు. ఈ సినిమా దర్శకురాలు ఫరా ఖాన్ వరకూ కథతో పెద్ద సంబంధం లేదు. తన గిమ్మిక్కులతో ఎలా అయినా సినిమా తీయొచ్చని ఆమె నమ్మకం. ఈ సినిమా ప్రేక్షకామోదం పొందడానికి ఆమె వాడిన మొదటి ఆయుధం: కింగ్ ఖాన్. మరి మన దేశం లోనే అత్యుత్తమ నటుడంటారు. వీరుడు, శూరుడు అంటారు, మరి ఆయన మెదడు మోకాట్లో వుందో ఏమో కానీ ఇలాంటి సినిమా ఎలా ఒప్పుకున్నాడో ఏమో? ఒప్పుకున్నాడే అనుకో ఈయన సినిమాలు ఎన్ని ఫ్లాప్ కాలేదు. అంటే కింగ్ ఖాన్ ఒక్కడే చాలడని ఫరామ్మ కు తెలుసనుకుంటా. అందుకే రెండో ఆయిధంగా మన మీదకు వదులుతుంది పాత సినిమా పచ్చడి.
ఆయనెవరో మన్మోహన్ దేశాయ్ అంట. ఆయన కి ట్రిబ్యూట్ అంట. ఎమో ఆ గోళ నాకు అర్థం కాలేదు కానీ, రేపోమాపో మన తెలుగు వాళ్ళు కూడా రాఘవేంద్రరావు కి ట్రిబ్యూట్ అని మొదలెట్టినా ఆశ్చర్యం లేదనిపించింది. ఇక ఆ పాత సినిమాల గురించి వివిధ రకమైన జోకులు హడావుడి గందరగోళం అయ్యాసరికి నేను నా సెల్ ఫోనులో బ్రిక్ గేమ్ పది ఆటలు ఆడనూ అయ్యింది, షారూక్ సావనూ సచ్చాడు. ఇంటర్వెళ్ అవ్వనూ అయ్యింది.
ఇక రెండో సగం మొదలయింది. ఫరామ్మ ఇంకేమి గిమ్మిక్కులు మనమీద గుప్పిస్తుందో అనుకునే లోపల ఏ రైలెక్కి వచ్చారో గానీ బాలీవుడ్ వెధవ సంతంతా దిగారు. అభిషేక్, అక్షయ్ దగ్గర్నుంచి జయేద్ వరకూ, అంటే దాదాపు A-Z of Bollywood అన్నమాట. వీళ్ళంతా కలిసి ఒక అరగంట పాటు సినిమాకు సంబంధం లేకుండా, చిన్నప్పుడు మావూర్లో జాతరకు రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ వాళ్ళు ఆడినట్టు ఆడి ఆడి మన సహనానికి పరీక్ష పెడతారు. ఈ సీను ఎంత ఘోరమంటే అభిషేక్ బచ్చన్ ని ఈ సీన్లో చూస్తే “What am I doing here?” అన్నటుగా వుంటాడు. కానీ పెద్దాయన్ సినిమా కదా అని తప్పక అందులో పాలు పంచుకోవలి అన్నట్టుగా ఆయనుంటాడు. చాలా మంది ఈ రకమైతే సినిమాల్లేని అమీషా పటేల్, దియా మిర్జా లాంటి వాళ్ళు దొరికిందే ఛాన్స్ అని వున్న కొద్దీ క్షణాలు అదరగొట్టేయాలని తెగ ప్రయత్నం చేసారు.
ఎందుకో గానీ అమితాబ్ గారు ఈ ఉత్సవంలో పాలుపంచుకోలేదు. ఆయన లేని లోటు ఈ సినిమాలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
ఇక పోతే….ఏమో ఆ తర్వాత నాకు తెలియదు. నేను నిద్రపోయా…..
మరి ఇలాంటి సోది కథను మూడూ గంటల పాటు తెరకెక్కించడానికి ఎన్ని రోజులు తమ మెదడు పక్కన పెట్టి ఈ సినిమా యూనిట్ వాళ్ళంతా పని చేసారో గానీ చివరకి ఒక తల తిక్క సినిమా మాత్రం మన మీదకి వదిలారు; అదీ దీపావళి శుభసందర్భాన! సినిమా ఛండాళంగా వుంటుంది అని ఫరా ఖాన్ తన మొదటి సినిమా ద్వారానే దిక్కులు పెక్కటిల్లేలా చెప్పినా పరమ శివుడిలా ఆ గరళం నేను మింగి మిగిలిన ప్రేక్షకులకు శిరోభారం లేకుండా చేయాలనే వుద్దేశంతో చూసా, నన్ను నేను హింసించుకున్నా.
దయచేసి ఈ సినిమా చూసే ధైర్యం చేయకండి. చాలా మంది చెప్తుంటారు; ఇలాంటి సినిమాలకు మన మెదడు ఇంటిలో భధ్రంగా దాచుకుని రావాలని. పోనీ అలానే చేసారనుకోండి. ఆ తర్వాత మీ ఇళ్ళు, వాకిలి గుర్తుండకుండా మిమ్మల్ని మీకే అపరచితులని చేసే సత్తా వుంది ఈ సినిమాకి తస్మాత్ జాగ్రత్త.
ఇలాంటి చెత్త సినిమాను కూడా నా పధ్ధతిలో నేను (చూసినంత వరకూ)ఎంజాయ్ చేయడం జరిగింది.ఒక వేళ మీరు ఈ సినిమా చూడాలనుకున్నట్టయితే సినిమా సెకండ్ హాఫ్ లో కింగ్ ఖాన్ కనిపించిన ప్రతి సారీ ఆయన వెనుక ఒక ముగ్గురమ్మాయిలు వుంటారు. వారినే గమనించండి. మీ టిక్కెట్టు డబ్బులు వసూలు కానట్టయితే నన్ను సంప్రదించండి. వాళ్ళని చూసి నవ్వలేక చచ్చాననుకోండి.కానీ సినిమా మొదటి సగంలో ఇలాంటి ఎంజాయ్ చేయగలిగే సన్నివేశాలు పెద్దగా లేవనే చెప్పాలి.
ఇక మీ ఇష్టం. చూస్తారో, చూసి…..
Finally OSO is just a joke on our sensibilities!
PS:గిరి గారూ నా మాట నమ్మండి. ఈ సినిమా జోలికి పోకండి.
Comments
మీరు ఎంత చెప్పినా, నేను సాధ్యమైనంత వరకూ ఈ సినిమా చూడడాని ప్రయత్నిస్తున్నా. మా మైసూరులో అది చాలా కష్టమనుకోండి…
బలి పశువులు దొరకడం ఇంకా కష్టం.
నేను మైఁ హూఁ నా కి పెద్ద ఫ్యాన్. నేనూ నా మిత్రుడు నవ్వు ఆపుకోలేక చచ్చాం.
ఫరా కావలని చేస్తుందో లేదో తెలియదు గాని, సినిమాని కళ లా కాకుండా ఒక పెద్ద ౧౦౦ కోట్ల జోకులా తీస్తుంది!
WHo is this Farah Khan? Failed heroine of yesteryears?
miru cheppinanta chettaga yemledu … website undani istam vachhinattu raste …mi site chudatam kuda bore kottiddii ..mind it … while writing review …cinema is only for entertainment .
వెంకట్, చెప్పి మీ వంతు సహాయం మీరు చేసారు. THANKS! ఇంట్లో వాళ్ళని ఓం శాంతి ఓం నుంచి మరల్చి “ద బీ మూవి” వైపు మళ్ళిద్దామని విశ్వప్రయత్నం చేస్తున్నాను..తొందరలోనే నా తలరాత తేలుతుంది..
కొత్తపాళీ గారు, సరోజ్ ఖాన్ తర్వాత హింది చిత్రాలలో చెప్పుకోదగ్గ పేరున్న నాట్య దర్శకురాలు ఈవిడే..
నాకు ఈ సినిమా బాగా నచ్చింది. ఎందుకంటే ఫరా ఇలానే తీస్తుందని నాకు తెలిసే వెళ్ళాను కాబట్టి. ఈ సినిమా ఒక ఎంటర్ టైనర్ అంతే. మన చచ్చు చిరుత సినిమాల కంటే చాలా నయం. పైసా వసూల్.
మీ రివ్యూ జాగ్రత్తగా చదివితే ఇప్పుడొకటర్ధం అయింది. మీరు చాలా అసహనంగా ఈ సినిమా చూసినట్లున్నారు. నేనైతే ఇలా తీస్తా…ఇలా అస్సలు తియ్యను అనుకుంటూ సినిమా చూసారని నా గట్టి నమ్మకం. అమితాబ్ లేకపోవటం లోటు ఏమిటో అర్ధం కాలేదు. అతను కూడా మీరన్న ఆ సంత మనుషులలో ఒకడైనప్పుడు
సుధాకర్ గారూ, నాకు సినిమా తీయాలని ఎంతో ఆసక్తి వున్నప్పటికీ అన్ని సినిమాలు నేను తీస్తే ఎలా తిస్తానో అనే ఉద్దేశం వుండదు. అదీ OSO లాంటి సినిమాలు తీయాలనే ఆలోచనే లేదు. అందుకే శ్రధ్ధగా సాధారణ ప్రేక్షకుడిలానే చూద్దామనే వెళ్ళాను. కానీ నిజంగా చాలా చిత్రహింసకు గురయ్యాను. అదే సావరియా అయితే నేను తీస్తే ఎలా తీస్తానో అనే ఆలోచన తో చూసిన మాట వాస్తవం.
చెత్త కామెడీ.నటీ నటుల ఓవర్ ఏక్షన్ చూడలేక చచ్చాము.రెండో సగం లో కొంత సేపు ఇంట్రెస్టిం గా అనిపించినా మళ్ళా ఎందుకో బాగా బోరు కొట్టింది.పాపం అభిషేక్.కానీ తారలందరినీ అలా ఒక్క చోట చూస్తే బాగుందనిపించింది.
కొత్తపాళీ గారు,
వికి చెంత ఉండగా మనకు సమాచారానికేమైనా కొదవా? http://en.wikipedia.org/wiki/Farah_Khan
farah khan
asalu eecinema maa voorlo ( amsterdam ) lo vesaru….sare ani velithe maa eurolu gaaliki kottukuni poyayi…. Vaddura babu ee himsa ika nenu naa jeevitham lo chudanu hindi cinemalanu…. alredy LLLLLLLLLLLLLAAAAAAAAAAAGA CHUNARI Chusi kooda eee cinemaku velladam naa thappe
I request you to publish regarding telugu films also.
neti cinimaalu alage vuntayi baaabu
meeku nachetattu teeyalante hollywood nundi directorlani ettukuraavali
eemadhya vachhina cinimalalo edaina bagunnada ?
migata vatito polchi choooste om santi om chaalavaraku ok
ok
meeru cheppinattu amitab vunte choose vallu kooda choodadaniki istapadaru
SRK cinemani SRK cinimalane choodandi
mee dristi lo baagunna cinima edo cheppandi
danilo bokkalento nenu chebutaaa
రాజ్ గారు,
నా దృష్టిలో బాగున్న సినిమాలు చాలానే వున్నాయి. ఈ మధ్య వచ్చిన వాటిలో మనోరమా సిక్స్ ఫీట్ అండర్, జానీ గదర్, డోంబ్లీ విలీ ఫాస్ట్, నో స్మోకింగ్, హజారో క్వాయిషే ఐసీ ఇంకా చాలానే. అలాగని అందులో బొక్కలు వెతకమని అనటం లేదు. వాటిలో బొక్కలేంటో నాకూ తెలుసు. కానీ OSO లాంటి సినిమాల్లో మొత్తం బొక్కే, కంటెంట్ సున్నా. నేను పైన చెప్పిన సినిమాల్లో కొద్దొ గొప్పో బుర్రున్న వాళ్ళు తీసినట్టనిపిస్తుంది.
రాజ్, నేను అమితాబ్ గురించి రాసింది సీరియస్ గా తీసుకున్నట్టునారు. నేను satirical గా అన్నాను. అన్ని సినిమాల్లో ఎలాగోలా ఆయన్ని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది కదా అందుకు. మరో మాట! ఆ హాలీవుడ్ దర్శకులేమైనా కొమ్ములతో పుట్టారా. మంచి సినిమాలు తీయాలంటే టాలెంట్ కావాలి ఏ వుడ్లో అయినా!
Miru poddu lo rase cinema page naku chala istam.. kani OSO gurinchi mi abhiprayam chadivaka ascharyam vesindi. OSO lo SRK tana mida tane joke cheskunnadu. Bollywood lo eppudu jarige Tamasha ni bayata pettadu. Tamasha ni Tamasha laga chustene miru enjoy cheyyochu. Ippudu telugu lo vastunna cinemala kanna OSO chala nayam sumandi. OSO oka cheeni kum laga koncham spices takkuvunna cinema. However, thank you very much for the review.
Hello sir, I have gone through your review abt OSO. I feel u haven’t seen the full movie(cell phone games & sleeping). And y r u not taking it as a movie. I feel u had something in your brain before u went to movie. So, when ur expections didn’t meet OSO, u made this review. So, try to keep ur mind free from expectations, else u cant enjoy any of the movies made on this Earth(is it needed to make somewhere else for u?).
Kishore garu,
I enjoy almost 10 movies a week and none of the movies are made else where, they are all made on the earth, but might not be in India sometimes.
Here are the list of 10 films I loved watching in past one week
1)Todo Sobre mi madre
2)Solas
3)Symapthy for Mr Vengeance
4)25 Watts
5)Wages of Fear
6)Johnny gadar
7)Manorama 6 feet under
8)Dombivili Fast
9)No smoking
10)American Gangster
వెంకట్ గారూ, నేనూ ఈ మధ్య ఓం.శా.ఓం. చూశాను. కాలక్షేపం బఠానీ అంటారే అలా ఉంది. మరీ బోరైతే కొట్టలేదు. కాకపోతే భారతీయ సినిమా గురించి, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల గురించి నా రెండు ముక్కలు. సినిమా ఓ కళ కంటే ముందు చాలా మందికి ఓ కాలక్షేపం! శారీరక శ్రమ చేసిన శ్రమజీవికి, ఆఫీసు పనులతో నిరంతరం ఒత్తిడికి గురయ్యే మధ్య తరగతి వర్గానికి(మగవారు+మహిళలు), ఇంట్లో పనితో విసుగెత్తిన గృహలక్ష్ములకు, మరీ ముఖ్యంగా ఒంట్లో హార్మోన్లు ఉరకలెత్తే యువతరానికి, ఆబాలగోపాలానికీ సినిమా ఓ మత్తుమందు. ఆ మూడు గంటలు తమది కాని మరో ప్రపంచంలోకెళ్లి విహరించాలి. ఆ ఊహాలోకానికీ కొన్ని పరిమితులుంటాయి. వారి వారి అభిరుచులకు తగిన విధంగా ఉంటేనే ఏ సినిమానైనా ఆదరిస్తారు. ఇక్కడ కళ అన్నదానికి రెండో స్థానమే దక్కుతుంది. అదీ కాక విమర్శకులంతా మేధావి వర్గానికి చెందిన వారు. ఆ దృష్టితోనే చూస్తారు. కానీ నేలక్లాసులో కూర్చొని కాసుల వర్షం కురిపించే వారికి వారి అభిప్రాయాల్ని తెలియపరిచే వేదికేది? సినీ సమీక్షల్లో కనిపించే ఈ పక్షపాతాన్ని (Bias) నివారించేదెలాగ? అందుకే వారు సినిమా హిట్టా? ఫట్టా? అన్న దాంతో వారి సమీక్ష మనకు మరో రూపంలో తెలియజేస్తారు. మీరు చెప్పే విషయాలు, సినిమా పట్ల మీకున్న నిబద్ధత, గాఢమైన ప్రేమ నాకు తెలుసు,కానీ ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని భావిస్తాను.
Thanks for ur reply Siddareddy garu,
I too agree the 10 movies mentioned above are good and not made in India. Even though checkout the repeated audiances…. what 4 they r comming? that meens for any movie sucess its based on so many things.. In my openion except few movies, most of the movies which is having capabality of repeated viewership is the good movie(pls. note not the best) like OSO.
any way thanks for ur postings…. and Don’t stop for anyone.
Wish you good luck.
Kishore
ayya entertainment media alage untadi.worrt kakandi. manchi vnarsakulu meeru manchi darsakulu meeku santrupthi kaligistaru.