పిల్లలూ, స్కూల్‍కి మూడు నెలలు శెలవు!
by admin@ 24fps
మరో మూడు నెలల వరకూ ఈ బ్లాగుకు శెలవు ప్రకటించడమైనది. దాదాపు ఆరు నెలలుగా ప్రపంచ సినిమాలను తెలుగు వారికి పరిచయం చేసే నా ప్రయత్నం ఫలించిందో లేదో తెలియదు కానీ, నాకు తెలిసిన విషయాల్ని నలుగురితో పంచుకోవాలనే ఆలోచనతో మొదలుపెట్టిన ఈ బ్లాగు వేరెవరికైనా వుపయోగపడిందో లేదో కానీ నా మదిలోని ఆలోచనలని ఇక్కడ వ్రాయడం ద్వారా నాకు తెలిసిందెంత, తెలియనిదెంత అని మాత్రం నాకు బాగా తెలిసి వచ్చింది.
ఇన్నాళ్ళూ నా బ్లాగు చదివి మీ వ్యాఖ్యల ద్వారా ప్రోత్సాహం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మళ్ళీ ఫిభ్రవరిలో మరిన్ని సినిమా విశేషాలతో తిరిగి వస్తానని తెలియచేస్తూ అప్పటి వరకూ శెలవు తీసుకుంటున్నాను.
Comments
>ఈ బ్లాగు వేరెవరికైనా వుపయోగపడిందో లేదో కానీ
ఉపయోగపడింది
మీ పునరాగమనానికై ఎదురుచూస్తుంటాం.
వెబ్‌లో మీ ఇతర ముఖ్య వ్యాపకాలు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
we will be waiting for ur re-entry!
నాకు మాత్రం బతికేంత ఉపయోగపడింది. ఎప్పుడయినా టైం దొరికితే సెలవుల్లో కూడా బ్లాగండి.
మనలో ఎంత ఆత్మ విశ్వాసం ఉన్నా ఒక్కోసారి మనం చేసిన పని ఎలా ఉందనేది అవతలి వాళ్ళు మనస్ఫూర్తి గా చెప్తే తప్ప మనకి సంతృప్తి ఉండదు.అందుకే చెప్తున్నాను. మీ ప్రతి రచన లోనూ సినిమా పట్ల మీ ప్యాషన్ స్పష్టంగా తెలుస్తోంది. సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళడమూ, వెళ్ళకపోవడమూ తర్వాతి సంగతి. It depends on many things in life. But సినిమాల గురించి తెలుసుకుని, తెలుసుకుని- ఆస్వాదించి, ఆస్వాదించి- that itself is a great pleasure !! keep up your good work !! Have great vacation and bounceback soon!
Hi Everybody
Ya the technic of the short film is mind blowing……. if you like those long shots technic watch
another movie called ‘IRREVERSIBLE’, it is little gross but interesting movie for movie buffs….
BTW….I just joined and saw this Blog. I am working in Bollywood as an asst. director. It would
be of great help if you forward me this kind of interesting information on shortfilms and regular
feature films or interesting scenes from movies, which can be remade in our desi languages.
For example if you see the last few successful movies in Bollywood….
they are all either flicked from Hollywood or World movies…..
1. Partner – Hitch
2. Hey Babby – 3 Men and a Baby
3. Dhamal – Its a mad mad world
4. Bheja Fry – Le Dîner de cons (French Film)
Thanks
Prasad