California Dreamin’
by admin@ 24fps
సినిమా:California Dreamin’
దేశం: రోమానియా
దర్శకుడు:Cristian Nemescu
నా అభిప్రాయం:ఈ సినిమా గురించి చెప్పేముందు ఈ సినిమా దర్శకుని గురించి చెప్పుకోవాలి.ఈ సినిమా దర్శకుడు Cristian Demescu. ఈ సినిమా ఎడిటింగ్ పూర్తికాకూండానే ఒక ఏక్సిడెంట్ లో మరణించాడు. ఆయనకు నివాళులర్పిస్తూ పూర్తిగా ఎడిటింగ్ జరగకుండానే Cristian Demescu వుండగా ఎలా వుందో అలాగే ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. అందుకే ఈ సినిమాకు క్యాప్షన్ endless అని వుంటుంది. కానీ చాలా మంది రోమానియన్లు చెప్తున్నట్టుగా ఆ క్యాప్షన్ తప్పుదోవ పట్టించేదిగా వుందని నా అభిప్రాయం కూడా. Endless కి బదులుగా With out an end అని పెట్టడం సబబేమో!
గతంలో నాలుగైదు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించిన Cristian Demescu తన మొదటి చిత్రానికి మంచి కథను ఎన్నుకుని అధ్భుతంగా తీర్చిదిద్దాడు. తన మొదటి సినిమాతోనే అంతర్జాతీయ ఖ్యాతిని సాధించగలిగాడు. కానీ ఆ కీర్తి ప్రతిష్టలు అతన్ని చేరకముందే ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు.
రొమానియా లో 1990 లలో జరిగిన ఒక సంఘటన ఆధరాంగా ఈ సినిమా కథ రూపొందించబడింది. 1999 లలో యుగోస్లేవియా పై NATO ప్రకటించిన యుధ్ధం నేపద్యంలో కథ మొదలవుతుంది. యుగోస్లేవియా పై NATO జరుపుతున్న యుధ్ధంలో సహాయం కోసం అమెరికా నుంచి ఒక రాడార్ ను రొమానియాకు దిగుమతి చేసి అక్కడనుంచి రొమానియా సరిహద్దుల్లోకి ఆ రాడార్‌ను తలలించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.ఆ రాడార్ ను రైల్లో తీసుకెళ్ళాలనే ఆలోచనతో దాదాపు 20 మంది అమెరికన్ సైనికులతో కూడిన ఒక సైనిక బలగం బయల్దేరుతుంది.
కొంచెం సేపు సజావుగా సాగిన వారి ప్రయాణానికి ఒక మారుమూల పల్లెటూర్లో పెద్ద బ్రేక్ పడుతుంది. ఆ వూర్లో స్టేషన్ మాస్టారు అందుకు కారణం. అమెరికన్లంటే విపరీతమైన ఏహ్యభావం పెంచుకున్న ఆ స్టేషన్ మాస్టారు రైలును ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తాడు. సరైన కస్టంస్ పత్రాలు లేకుండా స్టేషన్ నుంచి ముందుకెళ్ళడం సాధ్యం కాదని మొరాయిస్తాడు. ఆయన బాధ భరించలేక అతనికి లంచం ఇవ్వాలని ప్రయత్నిస్తారు అమెరికన్లు. చివరకు పై అధికారుల దగ్గరనుంచి ఫోను చేపించినా వినడు ఆ స్టేషన్ మాస్టారు. రూల్స్ కి వ్యతిరేకంగా తను ఏ పని చేయనని నొక్కి వక్కణిస్తాడు. ఇక చేసేదేమీలేక రైలునక్కడే ఆపేసి కాసేపు సెదతీరుదామనుకుంటారు. ఒక రొజు గడుస్తుంది. రెండు రోజులు గడుస్తాయి. కానీ ఏమీ జరగదు. ఈ లోగా అమెరికన్లు వున్న రైలు తమ వూర్లో ఆగుందని తెలుసుకున్న గ్రామస్తులు అక్కడ గుమికూడుతారు. ఇదే సరైన అవకాశం అని గ్రహించిన ఆ వూరి మేయర్ గతంలో జరిపిన వేడుకలను మరోసారి జరిపి వాటికి అమెరికన్లను ఆహ్వానిస్తాడు.
సాధారణం గా అమెరికన్లంటే వుండే వ్యామోహం మూలంగా ఆ వూరి అమ్మాయిలందరూ అమెర్కన్ సైనికుల వెంత పడతారు. ఇదే అదనుగా చూసుకుని కొంతమంది ఫ్యాక్టరీ కార్మికులు తమ సమ్మె మొదలు పెడతారు. అమెరికన్లను అంతగా గౌరవించి పూజిస్తున్న గ్రామస్తులను చూసి మండిపడతాడు స్టేషన్ మాస్టర్.
అదీ కాక తన సొంత కూతురే అమెరికన్ సైనికుడి వెంట తిరగడం భరించలేకపోతాడు. ఈ లోగా ఆ వూరి మేయర్ కు మరియు స్టేషన్ మాస్టర్ కి వున్న విరోధాన్ని గ్రహిస్తాడు అమెరికన్ సైనికులకు నాయకుడైన Captian Jones. స్టేషన్ మాస్టారిగా వుంటూ వచ్చే పోయే రైళ్ళలోనుంచి సామాగ్రిని దొంగలించి ఎక్కువ రేటుకి ప్రజలకు అమ్ముతున్న అతని అన్యాయాన్ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని గ్రామస్తులకు నూరిపోస్తాడు captain Jones. అయితే పోలీసు యంత్రాంగం స్టేషన్ మాస్టారి గుప్పెట్లో వుందని అతన్ని ఎదుర్కోవడం సాధ్యం కాద్ని చెప్తాడూ మేయర్. మీకా భయం అవసరం లేదు. మీ వెంట మేముంటాము. మీతో కలిసి మేమూ అన్యాయాన్ని ఎదుర్కుంటాం అని దైర్యం చెప్పి యుధ్ధానికి రంగం సిధ్ధం చేస్తాడూ Jones
ఈ లోగా రావాల్సిన కస్టంస్ పత్రాలేవో వస్తాయి, అమెరికన్లు హాయిగా అక్కడనుంచి బయల్దేరి వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత ఆ వూర్లో జరిగిన మారణహోమం సినిమా చూసి తెలుసుకోవల్సిందే!
అమెరికా నడిపే యుధ్ధ రాజకీయాలను ఎత్తిపొడిచిన ఈ సినిమా నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. వీలయితే తప్పక చూడండి. సినిమా అక్కడక్కడా కొంచెం పొడిగించినట్టు అనిపించినా అది ఈ సినిమా పూర్తి స్థాయిలో ఎడిటింగ్ కానందువలన అని అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యన రొమానియా సినిమాలకు పెరుగుతున్న ఆదరణకు ఇలాంటి సినిమాలే కారణం.
ఈ సినిమాతో పాటు మరో రొమానియా సినిమా 4 Months, 3 Weeks, 2 Days కూడా ఇక్కడ ప్రదర్శింపబడుతుంది. త్వరలో ఆ సినిమా గురించి నా అభిప్రాయాన్ని ఇక్కడ పొందుపరుస్తాను.
ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు:
CALIFORNIA DREAMIN’ (endless) tells the poignant tale of the long-awaited arrival of the Americans to Romania, after no less than 55 mentality-altering years of crushed expectations. Romanians in the mid-forties sought solace in their faith in the messianic American salvation, unaware of the fact that the bombs nearly killing their loved ones werebeing fabricated in the United States. Eventually, they came to accept the Russian domination, which, to their minds, was as messianic an arrival as the American one.
In response to the developments in the Kosovo Province in 1999, NATO launched a series of air raids against Serbia. After several weeks of bombing, NATO decided it was imperative to install a ground-based radar system under top-priority conditions and neighboring Romania was deemed the ideal location. The Romanian government dutifully accommodated the request, and on the very next day a radar system was shipped over from Turkey to the harbor of Constanţa. The radar was then loaded onto a train guarded by soldiers of the American special troops and Romanian conscripts, and scheduled to reach the opposite end of the country, which is the Serbian border. Because of “the exceptional situation”, there was no time for obtaining any legal customs document to account for the transport.
Soon after having reached Romania, the Americans face the first obstacle: the vehicle of their voyage is not yet in functioning condition, and the Romanians seem more intent on welcoming them with a brass band playing the national anthem, then a working train. Once the situation is resolved, they carry on through the Baragan, the Romanian flood-plain of the river Danube. Along their course is the prototypical Romanian village of Capalnita, where the railroad station master is involved in reselling goods stolen off freight trains, where Gypsies steal coal by pretending to “clean” the train carriages and where the ball bearings factory workers have just gone on strike again.
Little do the Americans know that Doiaru, the railroad station master is about to bring their train to a grinding halt. He invokes the lack of customs documents, ignores the free-passage statute granted by the government and refuses to be coerced into it.
The language barrier first surfaces as a major issue (much is lost in translation), as does the average Romanian’s attitude towards Americans, ranging from great elation (in hopes of financial or marital bliss) to profound disapproval and hatred. However, all hard feelings, together with the troops’ anxiousness to be on their way, seem to be appeased by the mayor’s invitation to the village celebration..
The party turns out a great success – most of the soldiers hit it off from the get-go with a lot of the eager Romanian teenage girls. Doiaru’s daughter, Monica, who had earlier tried to escape the village by getting on the radar train and ended up bumping into David, one of the soldiers, sees her Prince Charming at the party. Despite the fact that she speaks no English, she flirts and dances with David. To the jealousy of her enamored class-mate Andrei, there is obvious chemistry between the two. Meanwhile, Captain Jones himself tries to convince Doiaru to let the train pass, but is only met with the latter’s profuse scorn against the violent, intrusive and self-righteous American foreign affairs policy.
The following day Monica asks Andrei, who speaks good English, to tutor her and then chaperone on her date with David. They later attend the street-party thrown by the mayor’s son and Monica’s obnoxious ex-boyfriend. David and Monica, while in the throes of love-making, cause a chain reaction of fabulous proportions which leads to a power black-out all the way to Bucharest and to the explosion of a WWII American missile, buried in the basement of the Romanian Ministry of Foreign Affairs. Meanwhile, Jones and the rest of the troops have been partying with the mayor. As day breaks over the hung-over assembly, the mayor discloses his plan to get rid of Doiaru to Captain Jones.
Doiaru fiercely opposes the relationship between his daughter ad the American soldiers and still refuses to budge in respect with letting the Americans go, despite the pleas from Jones himself, who even attempts getting on the man’s good side. However, when Jones’ impassioned speech manages to rally up the villagers against him, Doiaru ends up being killed in an ambush, stabbed by none other than his deputy. The American soldiers finally leave, amidst an ocean of tears on the part of their dejected teenage lovers. Monica, however, bravely decides to sever all ties with David.
Jones and his troops reach their destination and the radar is made operational two hours after the cease-fire had been declared in Kosovo.
ఈ సినిమా దర్శకుని గురించి:
Cristian Nemescu was born on the 31st of March, 1979. He graduated from the Academy for Theater and Film of Bucharest in 2003. His short films (La Bloc Oamenii Mor Dupa Muzica / In Appartment Buildings People Are Dying After Music, Mihai si Cristina / Mihai and Cristina, Poveste la Scara C / C Block Story and Marilena de la P 7 / Marilena From P7) earned him a well deserved place among Romanian directors. For most of these films Cristi wrote the scripts as well.
He made his debut as a feature film director in CALIFORNIA DREAMIN’ (endless).
At only 27, Cristi Nemescu won some very important awards: in 2006, for Marilena de la P7 / Marilena From P7 – Best Romanian Film in Transilvania International Film Festival, Best Film in Milan Film Festival; in 2003, for Poveste la Scara C / C Block Story – Best Short Award in Berlin Interfilm Festival and Best director at Art Film Festival, in Slovakia. One year later the same film won the UIP Award at European First Film Festival.
In 2001, Cristi won the Audience Award at the International Student Film Festival CineMAiubit, in Romania, for his short film Mihai si Cristina / Mihai and Cristina.
Last year, “Marilena from P7” was selected in ”International Critics’ Week” the parallel section of the Cannes Film Festival.
Actor Andi Vasluianu says that there is something special about Cristi, “a camera movement that is more active, sometimes even a bit insane. He’s more interested in the scenery and leaves the actor to do his job. To the producer Ada Solomon the young director reminds of Nae Caranfil in many ways “due to his sensitivity, humor, refinement, intelligence, although Cristi is way more introvert than Nae”.
Comments
[...] గాంచిన సినిమాలైన Vanaja, Ploy, 4 Months, 3 weeks, 2 days, Sankara,California Dreamin’,In the name of God,Ore kadal, Naalu Pennungal లాంటి చిత్రాలను [...]