24fps.co.in

…………..Cinema is life, and life cinema: around us, beside us, inside us.

The Last Lear

సినిమా: The Last Lear
దేశం:India
దర్శకుడు: రీతూపర్ణో ఘోష్.

నా అభిప్రాయం: మన బిగ్గు బి అమితాబ్, రీతూపర్ణో ఘోష్ దర్శకత్వంలో అదీ పూర్తి స్థాయి ఆంగ్ల సినిమా అనగానే Festival circuit లో మంచి క్రేజే లభించింది ఈ సినిమాకి. కానీ అంతా హైప్. సినిమాలో విషయం లేదు. మీరు వీర అమితాబ్ ఫ్యానో లైటో అయ్యుంటే మీకు పిచ్చపిచ్చగా నచ్చొచ్చేమో కానీ ఈ సినిమాకి అంత సీన్ లేదని నా అభిప్రాయం.

The Voyeurs

సినిమా: The Voyeurs
దేశం: ఇండీయా
దర్శకుడు: బుధ్ధదేవ్ దాస్ గుప్త.

నా అభిప్రాయం: బుధ్ధదేవ్ దాస్ గుప్తా సినిమాల గురించి వినడమే కానీ ఎప్పుడు చూసే అవకాశం రాలేదు. కానీ ఆయన గెలిచినన్ని అంతర్జాతీయ అవార్డులు మరే ఇండియన్ దర్శకునికీ రాలేదేమో. ఆ విషయమే ఈ సినిమా గురించి నా అంచనాలు ఎక్కువయ్యేలా చేసాయి. సినిమా కథ వరకూ అధ్భుతంగా వుంది. Its very very contemporary. కానీ ఆ idea ని execute చెయ్యడంలో మాత్రం ఎక్కడో పెద్ద తప్పే జరిగినట్టుంది. సరైన నటులు లేక పోవడం ఈ సినిమాకి పెద్ద డ్రాబ్యాక్ అనుకుంటా.

4 Months, 3 Weeks and 2 days

సినిమా: 4 Months, 3 Weeks and 2 Days
దేశం: రోమానియా
దర్శకుడు: Cristian Mungiu

నా అభిప్రాయం: ఈ సినిమా నేను చూసిన రెండో రోమానియన్ సినిమా. మొదటి సినిమా California Dreamin లాగే ఈ సినిమా కూడా రొమానియా దేశ పరిస్థితులను చాలా బాగా వివరిస్తుంది. రోమానియా చరిత్ర తెలిసుంటే ఈ సినిమా కథతో relate చేసుకోవడం చాలా సులభం. నిజానికి ఈ చలన చిత్రోత్సవంలో నాకు బాగా నచ్చిన సినిమాలన్నింటిలోను నేను గమనించిన విషయం అదే. అన్ని సినిమాల్లోనూ ఆ దేశ సామాజిక ఆర్థిక పరిస్థుతులను, అక్కడి ప్రజల జీవన శైళిని ఈ సినిమాల ద్వారా చాలా తెలుసుకోగలిగాను.

Ploy

సినిమా:Ploy
దేశం: Thailand
దర్శకుడు: Pen-Ek Ratanaruang

నా అభిప్రాయం: ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాలు కొద్దో గొప్పో చూసాను కానీ, థాయిలాండ్ సినిమాలు పెద్దగా చూడలేదు. అనుకోకుండా లండన్ చలన చిత్రోత్సవంలో చూసిన ఈ సినిమా నాకు చాలా నచ్చేసింది. ఎక్కువగా అంచనాలు లేకపోవడం వల్లనో ఏమో గానీ ఈ సినిమా నాకు చాలా వినోదాత్మకంగా అనిపించింది.

California Dreamin’

సినిమా:California Dreamin’
దేశం: రోమానియా
దర్శకుడు:Cristian Nemescu

నా అభిప్రాయం:ఈ సినిమా గురించి చెప్పేముందు ఈ సినిమా దర్శకుని గురించి చెప్పుకోవాలి.ఈ సినిమా దర్శకుడు Cristian Demescu. ఈ సినిమా ఎడిటింగ్ పూర్తికాకూండానే ఒక ఏక్సిడెంట్ లో మరణించాడు. ఆయనకు నివాళులర్పిస్తూ పూర్తిగా ఎడిటింగ్ జరగకుండానే Cristian Demescu వుండగా ఎలా వుందో అలాగే ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. అందుకే ఈ సినిమాకు క్యాప్షన్ endless అని వుంటుంది. కానీ చాలా మంది రోమానియన్లు చెప్తున్నట్టుగా ఆ క్యాప్షన్ తప్పుదోవ పట్టించేదిగా వుందని నా అభిప్రాయం కూడా. Endless కి బదులుగా With out an end అని పెట్టడం సబబేమో!

Secret Sunshine

సినిమా: Secret Sunshine
దేశం: దక్షిణ కొరియా
దర్శకుడు:Lee Chang-Dong
నా అభిప్రాయం:మొదట్లో నేను దక్షిణ కొరియా సినిమాలు చూడడం మొదలుపెట్టినప్పుడు హాలీవుడ్ సినిమాలను చీప్ గా కాపీకొట్టేస్తున్నారు వీళ్ళు అని అభిప్రాయపడ్డా, తర్వాతర్వాత లోతుగా చూడడం మొదలుపెట్టాక కానీ అర్థం కాలేదు వీళ్ళ సినిమాల సత్తా.