ఈ వారం సినిమాలు
by admin@ 24fps
ఈ వారం నేను చూసిన సినిమాలలో కొన్నింటి గురించి:
1)Tzameti(ఫ్రెంచ్)
2)Across the Universe(ఆంగ్లం)
3)Rules of the game (ఫ్రెంచ్)
4)…and when did you last see your father(ఆంగ్లం)
Tzameti: 2005 లో వచ్చిన ఈ సినిమా సగం వరకైతే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా మొదలయ్యేటప్పటికి సెబాస్టియన్ అనే ఇరవైరెండేళ్ళ కుర్రాడు ఒక ఇంటి పైకప్పు మార్చే పనిలో చేరుతాడు. ఆ ఇంటాయన ఏదో పెద్ద సమస్యతోనే బాధపడుతున్నాడని తెలుసుకుంటాడు. ఆ ఇంటాయనకి బాగా డబ్బు గడించే అవకాశం తెలిపే ఒక తపాలా పోస్టు కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా గ్రహిస్తాడు. ఇంతలో అనుకోని పరిస్థుతుల్లో ఆ ఇంటాయన గుటుక్కుమంటాడు. ఆయన కు మార్గం చూపించాల్సిన ఆ పోస్టల్ కవరు సెబాస్టియన్ కి దొరుకుతుంది. అందులో ఏముంది? సెబాస్టియన్ దాంతో ఏం చేసాడు అనేది మిగిలిన కథ.
ఈ సినిమా మొదటి సగం లో వున్నంత పట్టు తర్వాత సగంలో లోపిస్తుంది. అందుకు కారణం రెండో సగంలో కథ కొంచెం predictable అయిపోవడమే! మీకు థ్రిల్లర్ సినిమాలు ఇష్టమయితే ఈ సినిమా తప్పక చూడండి.
ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశాలు నటన, దర్శకత్వం. ఇలాంటి సినిమాలో మంచి నటులు లేకపొతే థ్రిల్లర్ కాస్తా కామెడీ అయ్యే అవకాశం వుంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా మంచి నటనతో సినిమాలో వున్న మూడ్ ని maintain చేయడం జరిగింది. సహజమైన నటనతో ప్రేక్షకుడు సినిమా చూస్తున్న సంగతి మర్చిపోయేలా చేసారు ఈ సినిమాలో నటించిన నటులు.ఇకపోతే సెబాస్టియన్ పాత్రధారునికి సినిమా సగం వరకూ అసలేం జరుగుతుందో తెలియదో అలాగే ప్రేక్షకునికీ ఎటువంటి క్లూ ఇవ్వకుండా మంచి సస్పెన్స్ కల్పించగలిగాడు దర్శకుడు. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో వుండడానికి ప్రధాన కారణం తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను రూపొందించడమే అనుకుంటా.
హాలీవుడ్ వాళ్ళు త్వరలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారట!
Across The Universe::మీకు Beatles సంగీతం గురించి తెలిసుంటే ఈ సినిమా మీకు అతిగా నచ్చే అవకాశం వుంది, అలానే ఘోరంగా నిరాశ కూడా చెందవచ్చు. ఈ సినిమా దర్శకురాలు Julie Taymor. ఈమె గతంలో Frida అనే సినిమాకు దర్శకత్వం వహించింది.
1960 లలో Beatles బృందం కంపోజ్ చేసిన ముప్పై పాటల అధారంగా నడుస్తుంది ఈ సినిమా కథ. 1960 లలో అమెరికా వియత్నాంతో యుధ్ధం జరిపిన రోజుల్లో జరిగిన కథ ఇది. ఈ సినిమాలో కథే కాదు పాత్రలు కూడా Beatles పాటల అధారంగా రూపొందించబడ్డవే!
చూడ్డానికి చాలా కలర్‍ఫుల్ గా వుంటుంది సినిమా.కానీ ఈ సినిమా చాలా మందికి నచ్చకపోవచ్చు. మీకు 1960-70 రోజుల్లోని సంగీతం, Jack Kerouac సాహిత్యం, Beatles, Jim Morrison ల పాటలు నచ్చితే ఈ సినిమా కూడా మీకు నచ్చవచ్చు.
ఎందుకో గానీ ఈ సినిమా ఇక్కడ చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే విడుదలయింది. అంతర్జాలంలో చూస్తే limited release అన్నారు. ఎందుకో మరి?
Rules of the Game: ఈ వారం నేను చూసిన సినిమాల్లో అన్నింటికంటే మంచి సినిమా ఈ Rules of the game. ఈ వారమే కాదు నా జీవితంలో చూసిన చాలా సినిమాల్లోకెల్లా అత్యంత గొప్పదైన ఈ సినిమాకి దర్శకుడు Jean Renoir. ఫ్రెంచ్ సినీ చరిత్రలో మకుటంలేని మహరాజు లాంటి Jean Renoir ఎన్నో కళాఖండాలను తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా మాత్రం ఆయన తీసిన సినిమాల్లోకెల్లా అత్యుత్తమ చిత్రమని చెప్పొచ్చు.
ప్రపంచలోని అత్యుత్తమ సినిమాల లిస్టులో ఎప్పుడూ స్థానం కల్పించుకుని దాదాపు 70 ఏళ్ళ తర్వాత కూడా ప్రేక్షకుల మరియు విమర్శకుల మన్ననలు పొందుతున్న ఈ సినిమా 1930 ల నాటి ఫ్రెంచ్ బూర్జువా సమాజానికి ప్రతిబింబంగా నిలుస్తుంది.
వ్యగ్యం అనే పదానికి అర్థం ఈ సినిమా అని చెప్పొచ్చు. ఇందులో కథ Christine అనే అమ్మాయి చుట్టూ నడుస్తుంది. ఈమె కు అప్పటికే పెళ్ళి అయిపోయినప్పటికీ André Jurieux ఆమెను ప్రేమిస్తున్నాని వెంటపడతాడు. కానీ ఈమె భర్త Robert ఇదివరకే Geneviève అనే మరొకామెతో సంబంధం కలిగి వుంటాడు. Christine ని ఎలా అయినా తనదాన్ని చేయమని André తన స్నేహితుడైన Octave ని అడుగుతాడు. ఆ ప్రయత్నంలో Octave తనకు Christine పై వున్న ప్రేమను ఆమెకి తెలియచేస్తాడు. వీరందరూ మరో పెద్ద గుంపుతో కలిసి వేటాడడానికి ఒక మహల్లాంటి ప్రదేశం చేరుకుంటారు. అక్కడ వున్న పనివాళ్ళలో దాదాపుగా ఇలాంటి లవ్ ట్రయాంగిల్ ఒకటి నడుస్తుంది. ఈ గందరగోళంలో ప్రేక్షకుడిని ఒక పాత్రను చేసి ఆనాటి సమాజంపై Renoir చేసిన ఒక అధ్భుతమైన satire ఈ సినిమా.
ఒక్క మాటలో చెప్పాలంటే మాస్టర్‍పీస్!
చదివితెలుసుకోవడంకంటే చూసి ఆనందించవలసిన సినిమా ఇది. చాలా గొప్ప సినిమాలలాగే విడుదలయినప్పుడు ప్రేక్షకాదరణ పొందలేకపోయిన ఈ సినిమా ఆ తర్వాత కాలంలో చాలా సార్లు నిషేధించబడింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుధ్ధంలో దాదాపుగా మంట కలిసింది. కానీ సినీ ప్రేమికులెవరో చేసిన పుణ్యంతో డిజిటల్ ప్రక్రియతో restore చేయబడింది. ఏ ప్రముఖ DVD షాపులోనయినా మీకు దొరుకుతుంది. తప్పక చూడండి.
ఈ సినిమాలో వున్న ప్రత్యేకత ఏంటంటే ఇందులో కెమెరా యొక్క presence ని మర్చిపోయి ఈ సినిమా జరిగే మహల్లో మనమే తిరుగుతూ అక్కడి పాత్రలను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. సత్యజిత్ రే Renoir సినిమాలు చూసే బాగా ప్రేరణ చెందాడట! The River సినిమా చిత్రీకరణకు Renoir కలకత్తా వచ్చినప్పుడు సత్యజిత్ రే కలిసి సినిమాల గురించి చాలా సేపే సంభాషించారట. తన తొలి సినిమా తీయకముందు సత్యజిత్ రే లండన్ లో వుండగా చూసి ప్రేరణ పొందిన వంద సినిమాల్లో ఈ Rules of the Game సినిమా ఒకటి.
ఈ సినిమాలోని సంభాషణలు ఒక్కొక్కటీ ఒక్కో వజ్రపు తునక. బూర్జువా సమాజంపై సంధించిన అస్త్రం. ఉదాహరణకు కొన్ని:
Robert: Corneille! Put an end to this farce!
Corneille: Which one, your lordship?
Robert: [to Schumacher] I have no choice but to dismiss you. It breaks my heart, but I can’t expose my guests to your firearms. It may be wrong of them, but they value their lives.
ప్రఖ్యాత దర్శకుడు Robert Altman ఈ సినిమా గురించి చెబుతూ “Rules of the Game taught me the rules of the game” అన్నారు. ఈ సినిమా చూసి సినిమా తీయాలనుకునే వాళ్ళు నేర్చుకొవలిసింది చాలా వుంది.
…and when did you last see your father: పోయిన శుక్రవారం విడుదలయిన ఈ సినిమా దర్శకుడు ఆనంద్. (అవును ఆనందే! మనవాడే! కాకపోతే సగం మాత్రమే. అతని పూర్తిపేరు ఆనంద్ టక్కర్). గతంలో కొన్ని సినిమాలు తీసాడు కానీ అవి నేను చూడలేదు. మొన్నేదో సినిమాకెళ్ళినప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూసి మొన్న శుక్రవారం సినిమా విడుదలగానే వెళ్ళి చూసేసా!
మీకు ఫ్యామిలీ డ్రామాలు ఇష్టం లేకపోయినా ఈ సినిమా నచ్చే అవకాశం వుంది. ఒక తండ్రీ కొడుకల మధ్య జరిగే కథ ఇది. మరణానికి అంచులో వున్న తన తండ్రితో పాటు సమయం గడపడానికి వచ్చి తన జీవితంలో తండ్రితో గడిపిన తీపి మరియు చేదు ఘట్టాలను నెమరు వేసుకోవడమే ఈ సినిమా ముఖ్య కథాంశం. తండ్రీ కొడుకల మధ్య సంబంధాన్ని అధ్భుతంగా చిత్రీకరించడంలో ఆనంద్ సఫలమయ్యాడు.
ఇదే పేరుతో గతంలో వచ్చిన ఒక పుస్తకం అధారంగా ఈ సినిమా రూపొందంచబడింది.నేనా పుస్తకం చదవకపోయినా ఆ పుస్తకంలోలాగే ఈ సినిమలో కూడా తండ్రీ కొడుకల బాంధ్వ్యాన్ని హృద్యంగా చిత్రీకరించి ఒక మంచి సినిమాను ప్రేక్షకులకందించాడు ఆనంద్.
తండ్రి పాత్రలో Jim Broadbent కొడుకు పాత్రలో Colin Firth తమ పాత్రలకు న్యాయం చేసారు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది సినిమాటోగ్రఫీ. చిన్నప్పటినుండి తండ్రిని అనుమానించే పాత్రలో Colin Firth కనిపించినప్పుడల్లా అద్దంలో అతని ప్రతిబింబాన్ని చూపించడం, ఆ ప్రతిబింబం కాస్తా మసగా వుండడం లాంటి సినిమాటిక్ devices తో కొడుకు పాత్రలోని confusion ను బాగా తెరకెక్కించాడు దర్శకుడు.
ఫర్వాలేదు. చూడదగ్గ సినిమా. కానీ చాలా స్లో సినిమా.
Comments
where are you
ldj cvkiiouf jickjkcw