Monday Morning Blues
by admin@ 24fps
కొత్త వారం, కొత్త నెల, కొత్త రోజు.
నా లాగే మీరూ ఆఫీసులో పని చేసేవాళ్ళయితే ఈ రోజు ఎంత డల్ గా మొదలవుతుందో నాకు తెలుసు.
మరో జీతం రావడానికి మరో 31 రోజులు, వారాంతరం రావడానికి మరో ఐదు రోజులు. I know that its gloomy day, and you must be surely feeling blue. కాకపోతే మీ Monday morning blues ఇట్టే వదిలించెయ్యడానికి నా దగ్గర వున్న ఈ చిట్కా తప్పక పని చేస్తుందేమో అనిపిస్తుంది నాకు.
కొన్ని రోజులు ముందు మా ఆవిడ స్నేహితురాలొకరు వినమని మాకొక CD ఇచ్చారు. ఏ ముహూర్తంలో ఆ CD నా చేతికొచ్చిందో కానీ గత రెండు నెలలుగా ఆ పాటలు వినకుండా ఒక్క రోజయినా గడవలేదంటే నమ్మండి. ఆ CD పేరు మదిరాక్షి.
బీటలువారిన నేలను భక్తునితోనూ, జోరు వానను దైవంతోనూ పోలుస్తూ, జోరున కురిసే వాననీటిలో ఎర్రమట్టి కలిసిపోవడమనే ప్రక్రియను మోక్షమనే భావంతో రూపొందించిన ఈ ఆల్బం కవర్ మీద ఇచ్చిన వివరణ చదవడంతోనే నాకు ఈ ఆల్బం పై ఆసక్తి కలిగింది.
సిక్కిల్ గురుచరణ్ అనే గాయకునితో కలిసి అనిల్ శ్రీనివాసన్ పియానో నేపధ్యంలో వెలువరించిన సంగీతమిది.కర్ణాటక సంగీతం పాడే గాయకులకు సాధారణం గా మృదంగం, వయోలిన్ లు మాత్రమే నేపధ్యంలో వుండడమే చూసాను కానీ ఇలా పియానో తో కర్ణాటక సంగీతం వినలేదు.
గతంలో సుశీలా రామన్ కర్ణాటక సంగీతాన్ని వెస్ట్రన్ సంగీతం నేపధ్యంలో పాడడం గుర్తుంది కానీ ఆ ప్రయత్నం నాకంత నచ్చలేదు. ఈ మదిరాక్షి కూడా అలానే వుంటుందేమోనని అనుమానం కలిగింది.కానీ ఒక్క సారి విన్నాక మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ ఆల్బంను రూపొందించడంలో అనిల్ మరియు గురుచరణ్ నూటికి నూరు శాతం కార్య సిధ్ధి సాధించారని చెప్పొచ్చు.
మీలో ఎవరైనా సినిమా పాటల మీద విరక్తి చెంది మంచి సంగీతం వినాలనుకుంటే ఈ మదిరాక్షి ఆల్బం తప్పక వుపయోగపడుతుందని నా అభిప్రాయం.
ఈ అల్బంలో మొత్తం ఆరుపాటలున్నాయి.
ఇందులో నాకు బాగా నచ్చినది సుబ్రమణ్య భారతి రచించిన “ఆసై ముగం”.
తన చిన్న నాడే మరణించిన తల్లి గుర్తుగా వున్న ఒక్కగానొక్క ఫోటో కూడా కాలి బూడిదవ్వడంతో గుర్తుకు రాని తన తల్లి మోముని తలుచుకుంటూ సుబ్రమణ్య భారతి తన ఆవేదనను వానను మర్చిన పైరుతోనూ, వికసించడం మర్చిన పువ్వులతోనూ పోలుస్తూ అత్యధ్భుతంగా వ్యక్త పరచగా అంతే గొప్పగా గురుచరణ్ తన అధ్భుత గాత్రంతో కంట నీరు తెప్పిస్తాడు.
ఇదొక్కటే కాకుండా క్షేత్రయ్య రచన అయిన “పై యెద పై మీదే చేరి”, పాపనాశం శివన్ రచన అయిన “పిరవా వరం” పాటలు అధ్భుతం. ఇవి మాత్రమే కాకుండా ట్రావెన్‌కోర్ మహరాజా అయిన స్వాతి తిరునాళ్ బాల్యంలో ఎరైమ్మన్ తంపి అనే సంగీత గురువు బాల స్వాతి తిరునాళ్ ను నిద్ర బుచ్చడానికి రచించిన “ఒమానా తింగళ్” అనే జోల పాట వింటూ మీరు నిద్రలోకి జారుకున్నా ఆశ్చర్యంలేదు. (మీరు నిద్రపోయి ప్రాజెక్ట్ చేతిలో తిట్లు తింటే నేను భాధ్యుణ్ణి కాదు).
నా మాటల మీద నమ్మకంలేకపోతే ఈ పాటలు విన్నాక మాత్రం నాతో తప్పక ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. వినండి. పరవశించిపొండి.
ఆశై ముగం
[audio:Asaimugam.mp3]
పిరవా వరం
[audio:PiravaVaram.mp3]
యాయుం యాయుం
[audio:YayaumYayum.mp3]
పై యెద
[audio:paiyyeda.mp3]
ఓమానా తింగళ్
[audio:omanathingal.mp3]
విరుత్తం
[audio:viruttam-sediyaga.mp3]
ఈ పాటలు ఇక్కడ అప్‌లోడ్ చేయడం అన్యాయం అని తెలుసు కానీ ఇంత చెప్పాక మీరు వినకపోతే ఏం ప్రయోజనం. అందుకే మీకోసం కేవలం 24 గంటలు మాత్రమే ఇక్కడ ఈ పాటలను వుంచుతాను. మీరు విన్నాక నచ్చితే ఇక్కడికెళ్ళి మీరు CD కొనొచ్చు.
ఈ CD గురించి మరిన్ని విశేషాల కోసం CD కవర్ పై నున్న సమాచారం ఇదే!
Red earth and pouring rain. The mingling of two elemental forces produces a singularity so vibrant that distinguishing one element from another becomes untenable.
Throughout the development of thought, the merger of dual energies producing a singular, vibrant entity has been captured across his realization of supreme consciousness is the first example of this process. This, to the devotee, is love, longing and supreme desire.
Imagine, then, the idea that the tantalizing prospect of achieving such singularity can be brought close and then withdrawn. The passionate longing for fusing these dual energies to achieve a singular, vibrant energy also creates desire.
The compositions in this album have thus been chosen to represent a longing, a state of intoxication in the presence of desire.
Red earth and pouring rain. A longing, a state of intoxication in the presence of desire. A triumph of dual energies forming one, vibrant singularity. Madhirakshi depicts the longing for that which is intensely desired yet unattainable.
గురుచరణ్ మదిరాక్షి ఆల్బం గురించి ఇక్కడ ఇంటర్వ్యూలో వివరిస్తున్నారు. ఆసక్తి వుంటే చదవండి.