బ్లాగ్ సత్తా. ఇది మీ సత్తా!
by admin@ 24fps
ఇవాళ దాదాపు ప్రతి ఒక్కరికీ internet అందుబాటులోకి వస్తోంది. మన దేశంలో పరిస్థితి ఇంకా మెరుగుపడాలి కానీ US మరియు UK లలో ఉచితంగా కంప్యూటర్ల పంపిణీ, ఉచితంగా internet లాంటి పథకాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.
ఇదంతా చూస్తుంటే రోటీ, కపడా, మకాన్ లతో పాటు త్వరలో internet కూడా ఈ లిస్టులో చేరినా ఆశ్చర్యంలేదు. internet అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుండడంతో బ్లాగులూ విపరీతంగా పుట్టుకొస్తాయి. ప్రతి ఒక్కరూ తమ అనుభవాలనూ, ఆలోచనలనూ, ప్రతిస్పందనలనూ అందరికీ తెలిసేలా చేయడానికి బ్లాగులు సుగమం చేసేసాక మన తెలుగులోనూ బ్లాగులు బాగానే పుట్టుకొస్తున్నాయి. కానీ వీటికి ఇంకా ప్రచారం కలగాలేమో అనిపిస్తుంది. తెలుగులో రాసే ప్రతి బ్లాగరి ఇంకా ఎక్కువ బ్లాగర్లను సృష్టించడానికి కృషిచేయాలి.
తెలుగులో బ్లాగర్లు ఇంకా తమ గళాన్ని ప్రపంచానికి ఇంకా గట్టిగా వినిపించడానికి ఇంకా కొద్ది సమయం పట్టొచ్చేమో గానీ రానున్న కాలంలో ఫలానా పత్రిక వాడు ఫలానా పార్టీకి తొత్తు అనో, ఫలానా పర్టీ గురించి ఎప్పుడూ వ్యతిరేకంగా మాత్రమే రాసే పేపరనో బాధ పడుతూ వార్తా పత్రికలు చదవాలసిన అవసరం రాదేమో!
ఉదయం లేవగానే కొత్తపాళీ ఏ కొత్త విషయం గురించి రాసారనో, రానారె కథ లు ఎప్పుడెప్పుడు వస్తాయనో, కృష్ రాం ఏ కొత్త సినిమా చూసాడనో, చరసాలలో ఎవరిని శిక్షిస్తున్నరో, ఇవ్వాళ ఏ సత్య శోధన జరిగిందో, కొత్త పుస్తకం గురించి సౌమ్య తెలుసుకుందామనో, లాదా కొత్త టెక్కునిక్కు ఏదైనా తెలుసుకుందామనో, ఏమీ పొద్దు పోక ఒకటి,రెండు,మూడు, నాలుగు లెక్కపెట్టుకుందామనో, కాసేపు అన్నీ గాలికొదిలి క్రాస్‌రోడ్స్ లో నిల్చుందామనో ఎదురుచూసే రోజు త్వరలోనే వస్తుందని నా ఆశ. అలాగే సినిమా సైట్ల పేరుతో అడ్డమైన గడ్డీ తినీ చెత్త సినిమాలకు అడ్డగోలు ప్రచారం కల్పించే సైట్లకూ చెక్ పెట్టే సత్తా కూడా బ్లాగర్లకుందనీ నాకు నమ్మకం. ఇప్పుడు చెత్త సినిమాని చెత్త సినిమా అని ధైర్యంగా చెప్పొచ్చు అలాగే మంచి సినిమా గురించి ప్రోత్సాహమూ కల్పించవచ్చు.
కానీ ఎంత చెప్పినా బ్లాగు బ్లాగే, పత్రిక పత్రికే అని చాలా మంది అనడం విన్నాను. బ్లాగంటే ఎదో సరదాకి రాసుకునే ఒక డైరీ అని చాలా మంది అభిప్రాయం. నిజమే కానీ కొంత మంది డైరీలే అధ్భుత గ్రంధాలయిన సంధర్భాలు ఎన్ని లేవు?
మరి అలాంటప్పుడు బ్లాగర్ను జర్నలిస్టుగానో రచయితగానో పరిగణించవచ్చా?
నా దృష్టిలో అనొచ్చేమో అనిపిస్తుంది.
గత ఏడాది Baghdad Burning అనే బ్లాగులో సంవత్సరం పాటు రాసిన వ్యాసాలన్నింటినీ సేకరించి “Baghdad Burning” – the book అని ప్రచురింపబడటమే కాకుండా Lettre Ulysses Award for the Art of Reportage 2005 అవార్డును కూడా సాధించింది.
అలాగే మన దేశ బ్లాగర్లకు ప్రభుత్వం accreditation ఇవ్వనున్నట్టుగా రెండేళ్ళ క్రితం ఇక్కడ ఒక వార్త వచ్చింది. ఆ పని ఎంతవరకూ వచ్చిందో తెలియదు కానీ మొన్న జరిగిన Cannes చిత్రోత్సవానికి కొంత మంది ప్రఖ్యాత సినీ బ్లాగర్లకు కూడా Press accreditation ఇచ్చారని ఎక్కడో చదివాను. US లో Democrats 2004 నుంచే బ్లాగర్లకు press accreditation ఇవ్వడం మొదలుపెట్టారు. వారి లాగే UK లో లేబర్ పార్టీ కూడా తమ conference లకు press తో పాటూ కొంత మంది ప్రముఖ బ్లాగర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. కావాలంటే ఇక్కడ లేదా ఇక్కడ చూడండి.
దీన్ని బట్టి చూస్తే రాబోయే కాలంలో బ్లాగర్లు జర్నలిస్టులతోనూ, బ్లాగులు వార్తా పత్రికలతోనూ పోటీ పడే అవకాశం వుంది. నిజం. మీకిప్పటికీ నమ్మకం లేకపోతే వినండి.వచ్చే నెల 17 నుంచి లండన్ లో జరగబోయే ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవానికి నాకు press accreditation వచ్చింది. నేనేమీ పత్రిక విలేఖరిని కాదు. అలాగే నా బ్లాగు ప్రపంచ ప్రక్యాతి గాంచినదీ కాదు. రెండు వారాల ముందు నాకు press accreditation ఇస్తారా అని apply చేస్తే ఏం చూసి నీకు press accreditation ఇవ్వాలి అని నన్నడిగితే నా సైటు www.24fps.co.in గురించి అందులో గత 6 నెలలుగా ఏమేం రాసాను, ఎందుకు రాసాను అని తీరిగ్గా చెప్పాక పరిశీలిస్తాం అనడంతో కొంచెం ఆనందం కలిగింది. ఇవ్వము పో అనకుండా కనీసం పరిశీలిస్తాం అనడం మేలే కదా అనుకున్నా. ఈ రోజు ఇంటికొచ్చే సరికి పోస్టులో లండన్ చిత్రోత్సవానికి సంబంధించిన పాస్ వుండడం చూసి కొద్ది సేపు నోట మాట రాలేదు. అంతా బ్లాగు మహిమ. తెలుగులో బ్లాగొచ్చు అని తెలియచేసి, అలా బ్లాగడానికి సహాయపడి, నా బ్లాగుని ప్రతిరోజూ చదివి వ్యాఖ్యలు రాసి నాకు ప్రోత్సాహం కలిగించిన వారందరికీ కృతజ్ఞతలు.

Comments
amazing! congratulations..
అద్భుతం! అభినందనలు!!
బ్లాగులని ‘పౌర జర్నలిజం’గా వ్యవహరిస్తున్నారు కూడా.
కార్డులో మీ సైటు చిరునామా తప్పుగా పడ్డట్టుంది.
wow, great… congratulations….
-famus
ముందుగా మీకు శుభాకాంక్షలు.
మీరన్నట్లు బ్లాగర్లు జర్నలిస్టులతో పోటీపడగలరు. అయితే బ్లాగులు వార్తా పత్రికలతో పోటీ మాత్రం.. సరి అయినది కాదేమో. ఎందుకంటే కొన్ని బ్లాగులలో వార్తాపత్రికల ఆధారంగానే టపాలు వస్తూంటాయి. కాసేపు ఇది పక్కన పెడదాం. వార్తాపత్రికల విషయంలో అన్ని రకముల సమాచారం, ఒకే చోట(ఒకే వెబ్సైట్) లభిస్తుంది. కానీ బ్లాగుల విషయంలో వెతుక్కోవాలి. తెలిసిన వాటిని వెతుక్కోవచ్చు మరి తెలియని వాటి విషయమో? వార్తా పత్రికలు సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని, నైతిక విలువలు తప్పిపోకుండా వార్తలను ప్రచురిస్తాయి(కాని మన తెలుగు పత్రికలు ఈ విషయాలను పెద్దగా పట్టించుకోవు, అన్నీకావు కొన్ని మాత్రమే). మరి అన్ని బ్లాగుల విషయంలో ఇది సాధ్యమంటారా?
బాగుంది బాగుంది. ఆ చిత్రోత్సవంలో మీ ప్రవేశం నుంచీ నిష్క్రమణందాకా ఎన్నెన్నో విశేషాలు మీ బ్లాగులో మేమూ చూడొచ్చు. వాటితో మళ్లీ కలుద్దాం. తెలుగు బ్లాగులకు వార్తాపత్రికలంత శక్తి రావాలంటే మన దేశంలోకూడా అంతర్జాలం ఇంటింటికీ విస్తరించాలనుకుంటాను. ఒక మంచి తెలుగు కథకు పేపర్లలో వచ్చే ప్రచారం అంతర్జాలంలో రాదు. ఆ మార్పుకోసం ఎదురు చూస్తూ …
లోక్ సత్తా…ఇది మీ సత్తా! లాగానా:) వేసుకోండి వీరతాళ్లు!
సంతోషం.
తెలుగు సినిమాలని వారికి తెలియజేయండి.
“సినిమా గ్రామఱ్”ని కూడా పరిచయం చెయ్యండి.
good post!
బ్లాగులంటే చాలా చెత్త అని అభిప్రాయం చాలా మందికి ఉందండి ఇంకా…. నా మొహం మీదే ఆ ముక్క…పనీ పాటా లేకపోతేనే బ్లాగులు రాస్తారు అన్న మాట కూడా అన్నవాళ్ళని చూసాను…. అన్ని బ్లాగులో “నేను లేచా, పళ్ళు తోమా, ఆఫీసుకెళ్ళా…వచ్చా, పడుకున్నా” అన్నట్లు ఉండవు అని చెబితే, ఒకళ్ళిద్దరు మన తెలుగు బ్లాగులు కొన్ని చూపిస్తే అభిప్రాయం మార్చుకున్నారు కానీ… అసలుకైతే, పబ్లిక్ ఒపీనియన్ అది. ఎలా మార్చాలో మరి….
బాగు బాగు,
మాక్కూడా త్వరలోనే అతిథి సినిమా టిక్కెట్లు ప్రత్యేక షోకు ఆహ్వానం రావాని ఆశిస్తూ
బ్లాగు బ్లాగు. తెలుగు బ్లాగులని మీరు ఇంకో శిఖరం అధిరోహింపజేసినందుకు అభినందనలు.
ఎంతో మంచి విజయం.
బ్లాగుల ప్రభావం భారతం లో తక్కువ గానీ ఇతర దేశాల్లో ఇప్పటికే వీటి ప్రభావం చాలా ఎక్కువ.
నిజాయతీయయిన రివ్యూలు కావాలంటే బ్లాగులు చదవవలసిందే. పత్రికల, టీవీ చానళ్ళ మీద ఉన్నటువంటి ఒత్తిడులు బ్లాగులు రాసేవారి మీద ఉండకపోవడం కూడా ఒక కారణం.
భేష్…
అద్భుతం! అభినందనలు!!
sebaash!
వేల వావ్‌లు….నాకైతే మీరు తెలుగు బ్లాగర్లందరి తరపున దీనికి హాజరవుతున్నంత ఆనందంగా వుంది. హుర్రే
అభినందనలు.
-నేనుసైతం
Congratulations!
Congratulations!
మీకు అభినందనలు.
ఇంకో ముక్క. ఈ ముక్క మీకు చెప్పాలా ఒద్దా అని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. ఓ నెల క్రితం పని మీద ఇక్కడున్న ఓ తెలుగు మిలియనీర్ ను కలిశాను. ఆయన నేను రాసి, నటిస్తున్న నాటకాలన్నీ చూస్తుంటారు. అవి నచ్చినప్పట్నుండి నన్ను అడుగుతున్నారు ఓ మంచి స్క్రిప్టు వుంటే చెప్పండి సినిమా తీద్దాం అని. అది ఆనంద్ లాగా వుండాలి అంటారాయన. పొద్దు లో మీ వ్యాసం చూసిన గుర్తు తో, సందు దొరికింది కదా అని మీ పేరు చెప్పాను. ఆయన దానికి చూద్దాం అన్నారు. మీరూ ఓకే అంటే ఈ సారి ఆయన్ని ఓ “ఘట్టి” పట్టు పడతా. ఏమంటారు.
– విహారి
చదివి చాలా ఆనందించాను.
అన్నమయ్య సినిమాలోనో మరేదానిలోనో ఏవియస్ ఒక మాట చెబుతాడు.
ఆత్మానందం కలిగించే మాట చెప్పావయ్య అని అంత ఆనందం కలిగింది.
మీ బ్లాగు ద్వారా మేమంతా లండన్ చిత్రోత్సవం చూడబోతున్నామన్నమాట
నెనర్లు
బ్రాహ్మీ
wow….this is great news for telugu blogs! congrats!
అభినందనలు వెంకట్ గారు
విహారి! ఎక్కడికెళ్లారు విహారానికి? ఈ మధ్య బొత్తిగా నల్లపూసై పోయారు! బ్లాగుల ద్వారా సినిమా ఆఫర్ కూడానూ!!!(అప్పుడెప్పుడో ‘రానా’ పతాకంపై (రా.అ.of నా.అ.:)సినిమా అని సరదాగా అనుకొనేవాళ్లం మా మిత్రబృందం అంతా కలిసి!)ఇక రచన మొదలెట్టండి వెంకట్ గారూ…అన్నట్టు అవసరమైతే తె.బ్లా.ల సలహాలు తీసుకొని :రచనా సహకారం:తెలుగు బ్లాగ్లోకం” అని వెండి తెర మీదా వేద్దురు గానీ:)
అభినందనలు,
బ్లాగెత్తి జైకొట్టు తెలుగోడా,
గతమెంతో ఘనకీర్తి కలవోడా…
విహారి గారూ, మీ ప్రయత్నాలు కూడా సఫలం కావాలని కోరుకుంటున్నాను.
జాట్ల సిద్ధార్థ ఒక్క నిమిషం చిత్రానికి ఎన్నికకు ఆఖరు తేది ఈనాడే.
మనం ఎన్నుకుంటే అది అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఎన్నికవుతుంది.
ఈ సినిమా ని మనం ప్రోత్సహించాలి.
ఎందుకు అన్నది ఇక్కడ చూడండి.
మీరు తప్పక ఏకిభవిస్తారు.
http://www.filminute.com/2007/vote/view_film.php?f=56
http://www.filminute.com/2007/vote/send_page.php?f=0
వెంకట్! గొప్ప విషయం. అభినందనలు అందుకోండి.
అభినందనలు తెలిపిన వారికందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.
ఈ Press Accreditation రావడం పెద్ద achievement ఏమీ కాకపోయినప్పటికీ బ్లాగు రాస్తే వచ్చే ప్రయోజనాల్లో ఇదొకటని ఉదహరించాలనందే నా ఆకాంక్ష. తెలుగులో బ్లాగులు రాసే వారందరికీ నా మనవి ఏమిటంటే ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన ఈ బ్లాగుయజ్ఞాన్ని ఇలానే కొనసాగించి మన జ్ఞానాన్ని నలుగురికీ పంచి సమాజానికి కొద్దో గొప్పో సేవ చేయడంలో మనమూ ఒక చెయ్యేద్దాం. ఎవరికి తెలుసు రేపు మన బ్లాగర్లందరం కలిసి ఎన్నెన్ని చెయ్యొచ్చో!
I think I need to clarify properly on what I wrote as a comment here:
I said – “అన్ని బ్లాగులో “నేను లేచా, పళ్ళు తోమా, ఆఫీసుకెళ్ళా…వచ్చా, పడుకున్నా” అన్నట్లు ఉండవు అని చెబితే…” – It does not necessarily mean that one should not write about one’s life in his blog. What I mean is two fold:
1. A blog might not be very readable for others, if it contains nothing but a dairy of activities one does everyday.
2. “నేను లేచా, పళ్ళు తోమా, ఆఫీసుకెళ్ళా…వచ్చా, పడుకున్నా” style means a style which is highly dull and unattractive. I did not refer to any blog in saying this. I was just mentioning to the common opinion that some people express when they hear the word – “blog”. I kept it in quotes not because I LIFTED it from some blog. Its because, I wanted to stress on the style of the blog.
-Thanks.