51వ లండన్ చలనచిత్రోత్సవం

by admin@ 24fps

ఇలా టొరంటో చిత్రోత్సవం ముగిసిందో లేదో సినీ ప్రేమికులు బ్యాగులు సర్దుకుని లండన్ బయల్దేరడానికి సిధ్ధమవుతున్నారు. వచ్చే నెల 17వ తేదీ ఇక్కడ మొదలవబొయ్యే అంతత్జాతీయ చలనచిత్రోత్సవానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇప్పటికే లండన్ చలన చిత్రోత్సవానికి సంబంధించిన క్యాలేండరు కూడా ప్రచురించారు.

మొన్న టొరొంటోలో పీపుల్స్ ఛాయిస్ అవార్డు పొందిన Eastern Promises అనే సినిమా ప్రదర్శనతో ప్రారంభమవుతుంది. David Cronenberg చే లండన్ నేర సామ్రాజ్యం నేపధ్యంలో రూపొందిన ఈ సినిమా లండన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడడం గురించి ఆయన మాటల్లో,

I’m thrilled to be returning to the scene of the crime. Eastern Promises is the first film I’ve ever shot entirely away from my home in Canada, and it makes perfect sense that it is set in London, home of so many of my most potent film influences. I can’t wait to be there!

.

చాలాభాగం భారతదేశంలో చిత్రీకరించిన The Darjeeling Limited సినిమా ద్వారా ఈ చలనచిత్రోత్సవం ముగుస్తుంది. గతంలో Royal Tenanbaums అనే సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన ఈ సినిమా గురించి,

In THE DARJEELING LIMITED, three American brothers who have not spoken to each other in a year set off on a train voyage across India with a plan to find themselves and bond with each other – to become brothers again like they used to be. Their “spiritual quest”, however, veers rapidly off-course (due to events involving over-the-counter pain killers, Indian cough syrup, and pepper spray), and they eventually find themselves stranded alone in the middle of the desert with eleven suitcases, a printer, and a laminating machine. At this moment, a new, unplanned journey suddenly begins. Owen Wilson, Adrien Brody, and Jason Schwartzman star in this film about their adventure and their friendship.

The film was written by Wes Anderson (THE ROYAL TENENBAUMS), Roman Coppola and Jason Schwartzman and was produced by Anderson, Scott Rudin, Roman Coppola and Lydia Dean Pilcher.

ఈ చలనచిత్రోత్సవంలో మన దేశానికి చెందిన 5 సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. అందులో నాలుగు ఇప్పటికే టొరొంటోలో ప్రదర్శింపబడ్డాయి.వాటి వివరాలు ఇక్కడ లేదా ఇక్కడ చదవొచ్చు. ఇక ఐదో సినిమా గురించి

The tag line for the film reads ‘Some flowers blossom late’ and this is certainly true of 12-year-old Mahek, a bright, likeable girl who spends much of her time daydreaming in class and attempting to make sense of what she wants to achieve in life.

Reminiscent of Walter Mitty, each one of her dreams celebrates a previously undemonstrated success that reveals her tremendous ability and popularity, but in reality she is neither an achiever in or outside the classroom. When she meets an old lady, a fairy godmother of sorts, a process is started that will begin to unlock her true strength and ability by reining in her imagination and facing up to the reality of her position.

Mahek is an entertaining and inspiring family tale that boasts an exceptional central performance by Shreya Sharma in the lead role and is a first-time feature for award-winning short filmmaker K. Kanade.

ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింప బడుతున్న మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు:

The Assassination of Jesse James by the Coward Robert Fordఇది బ్రాడ్ పిట్ నటించిన ఒక western(కౌబాయ్) సినిమా.చూస్తుంటే హాలీవుడ్ వాళ్ళకు సీక్వెల్ మానియా వదిలి western పిచ్చి పట్టినట్టనిపిస్తోంది. మొన్న 3:10 to Yuma నిన్న No country for old men ఇప్పుదేమో ఇది రానున్న కాలంలో ఇంకా ఎన్నో!

Lust, Caution
Crouching Tiger, Hidden Dragon, Brroke back Mountain చిత్ర దర్శకుడైన Ang lee దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 1940లలో చైనా దేశంలోని రాజకీయ పరిస్థుతల నేపధ్యంలో నడుస్తుంది.

ఇవికాకుండా Into the wild, Juno, Lions for lambs, Silent light, Things we lost in fire లాంతి సినిమాల కోసం లండన్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచుస్తునారు.పైన పేర్కొన బడ్డ సినిమాలే కాకుండా 4 Months, 3 Weeks, 2 Days సినిమాకిం కూడా మంచి క్రేజ్ వుంది.

ఈ సినిమా Cannes చలనచిత్రోత్సవంలో అత్యుత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఇది రొమానియా దేశానికి చెందిన సినిమా.

రొమానియా దేశానికి చెందిన మరో రెండు సినిమాలు (Home, California Dreaming)కూడా ఇక్కడ ప్రదర్శితమవుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఇప్పుడు రొమానియా సినిమా పై సినీ ప్రపంచం కళ్ళుపడ్డాయి.

ఒకప్పుడు ఫ్రాన్స్ లో మొదలయిన నవతరంగం సినిమాలతో ఈ రొమానియా సినిమాలను పోలుస్తున్నారు. అందులో భాగంగానే Romanian Cinema: The Next New Wave? అన్న అంశంపై పానెల్ డిస్కషన్ కూడా జరుగుతుంది.

రొమానియన్ సినిమా గురించే కాకుండా కొత్త తరం దర్శకుల గురించి The new Auteurs, దర్శకుడు మరియు ఏదిటర్ మధ్య వుండాల్సిన సంబంధాల గురించి A Match Made in the Cutting Room: The Director and the Editor, విదేశంలో వుంటూ సినిమా తీయడంలోని బాదరబందీలను చర్చించడానికి A Filmmaker in a Foreign Land లాంటి మరిన్ని విషయాల గురించి ఇకాడ పానెల్ డిస్కషన్లలో చర్చించబడతాయి.

వీటిలో కొన్నింటికి నేను వెళ్ళదలచుకున్నాను. మీలో ఎవరైనా లండన్ లో వుండి ఆసక్తి వుంటే నాతో పాటే రావొచ్చు

రాబోయే రోజుల్లో లండన్ చలనచిత్రోత్సవం గురించి పూర్తి స్థాయి కవరేజ్ కోసం ఇక్కడ చూడండి.