నినుకోరి…..మోహనం
by admin@ 24fps
కర్ణాటక సంగీతం ఖచ్చితంగా విని తీరాల్సిందే లేకపోతే మీరు మన సంస్కృతికి పెద్ద అన్యాయం చేసినట్టే. కాకపోతే చాలా మందికి ఎక్కడ మొదలుపెట్టాలో తెలియక, సరిగ్గా guide చేసే వాళ్ళు లేక కొంచెం కష్టాలు పడుతుంటారు. నేనూ మొదట్లో ఇలాంటి తిప్పలే పడినా ఇప్పుడు పరిస్థితి కొంచెం మేలయ్యింది.అందుకు చాలానే కారణాలున్నాయి.
1)అంతర్జాలం లో కర్ణాటిక్ సంగీతం గురించి వున్న వ్యాసాలు
2)www.musicindiaonline.com లో వున్న సంగీత సంపద
3)నా శ్రీమతికి కర్ణాటక సంగీతంలో మంచి ప్రవేశం వుండడం
4)పిల్లనిచ్చిన మామ గారు కర్ణాటక సంగీతం గురించి సమీక్షలు, విశ్లేషణలు రాయడం
5)అన్నిటికంటే ముఖ్యంగా మంచి సంగీతం వినాలన్న తపన
మీకూ నాలా మంచి సంగీతం వినాలని తపన వుంటే ముందుగా కొంచెం తేలికైన పాటలు వినడం మంచిది. మీకు ఇంతకుముందు కర్ణాతక సంగీతం గురించి పెద్దగా అవగాహన లేకపోతే మోహనం రాగంతో ఆరంభించడం మేలని నా అభిప్రాయం. ఘర్షణ(పాత) సినిమాలోని “నిన్నుకోరి వర్ణం” పాట ఈ రాగం లోనిదే.
ఫలానా పాట ఏ రాగంలో వుంది అని ఎలా తెలుసుకోవాలి అంటే, అందుకు సమాధానం చాలా కష్టమే! కాకపోతే వినగా వినగా మీకే తెలిసిపోతుంది. కావాలంటే మీరూ ప్రయత్నించండి.
ఉదాహరణకు త్యాగరాజ స్వామి వారి కృతులైన “రామా నిను నమ్మిన“, “నను పాలింప నడచివచ్చితివో “, “భవనుత” లాంటివి వింటే మీకు అర్థం అవుతుంది ఘర్షణ సినిమాలోని “నిన్నుకోరి వర్ణం” మోహన రాగంలో వుందని.
కొత్త పాట వింటున్నప్పుడు అది ఏ రాగంలో వుందో కనిపెట్టడంలో వుండే థ్రిల్లే వేరు.
మోహనం లాగే హిందోళం, అమృతవర్షిణి రాగాలు కూడా మంచి starting points. ఇంకెందుకాలస్యం ఇప్పుడే మొదలెట్టండి మీ పయనాన్ని!.
మీలో ఎవరికైనా కర్ణాటక సంగీతం గురించి ఆసక్తి వుండి ఎలా మొదలుపెట్టాలో తెలియకపోతే నేను గతంలో రాసిన వ్యాసం చదవి మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు.
కాకపోతే పోయిన సారి రాసిన వ్యాసంలో కర్ణాటక సంగీతం గురించి రాసిన కొన్ని వ్యాసాలకు లింకులు ఇచ్చాను. కానీ అవన్నీ చదివి అర్థం చేసుకునే ఓపిక లేని వాళ్ళకి ఒక quick start లాగా ఈ వ్యాసం పనికొస్తుందని నా అభిప్రాయం.
మనవి.
నేను సంగీతం గురించి రాస్తున్నాను కదా అని నాకు సంగీతంలో అనుభవముందనొ, ప్రావీణ్యత వుందనో భావించవద్దు. ఏదో నాకు కర్ణాటక సంగీతం ద్వారా కలిగిన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలనే నా ఆలోచన, తపన. ఈ వ్యాసం చదివే చాలామందికి సంగీతంలో ప్రవేశం వుండివచ్చు. అలాంటి వారు నేను రాసిన దాంట్లో ఏవైనా తప్పులుంటే మన్నించి కరెక్ట్ చేయగలరని మనవి. అలాగే శ్రీరాం, కొత్తపాళీ లాంటి వారు కూడా కర్ణాటక సంగీతం గురించి తమ బ్లాగుల్లో రాసి తెలియని వారికి మరింత జ్ఞానాన్ని అందివ్వగలరని మనవి.
Comments
హమయ్య నాకు దారి చూపే ఒక మంచి టపా దొరికినది(ఇదే). ఇప్పుడు నేను మరియు నా Friends వచ్చే జన్మలో గొర్రెలు కాదు. రాసినవారికి 24హృదయపూర్వక 64ధన్యవాదములు.
-మరమరాలు
మంచి ప్రయత్నం వెంకట్. నీ మొదటి రాగాల సిఫార్సు కూడా it’s right on the money. సంగీతాన్ని ఆస్వాదించడానికి చెయ్యాలిసిందల్లా విస్తృతంగా వినడం. ఎక్కువగా వినాలి, అనేక రకాలుగా (వివిధ గాయకులు, వివిధ వాయిద్యాలు) వినాలి, వినేప్పుడు అదేదో నేఫథ్య సంగీతంలా కాకుండా శ్రద్ధ పెట్టి వినాలి. సాధ్యమైనంత వరకూ విన్నదాన్ని గుర్తు పెట్టుకోవడం.
ఇంకోళ్ళకి ఆ అభిరుచి లేకపోతే మనం ఇది మీరు వినితీరాలి అని చెప్పినంత మాత్రాన అభిరుచి రాదు కానీ ఇలా బ్లాగుల్లో మనమొక పదిమందిమి చేరి అబ్బ, ఆ కచ్చేరీలో సంజయ్ బిలహరి రాగం ఏమి ఆలాపించాడు అని పబ్లిగ్గా లొట్టలు వేస్తుంటే .. ఈ బిలహరిలో ఏముందో అని జనాలకి ఆసక్తి రేగే అవకాశం ఉంది.
శంకరాభరణం దర్శకుడు విశ్వనాథ్ కు సంగీత జ్ఞానము లేదని స్వయంగా ప్రకటించారు.తనకు ఉన్నది అభిరుచి మాత్రమేనని సెలవిచ్చారు. కూర రుచి గా ఉందని చెప్పటానికి మనం పాక శాస్త్రం లో పట్టా తీసుకోనవసరం లేదు.సంగీతం గురించి పాఠకులలో ఆసక్తిని రేపే ఇలాంటి వ్యాసాలు తరచుగా రాయండి.
మీరు ఇచ్చిన సమాచారం బావుందండీ.. క్రొత్తగా నేర్చుకునేవారికి ఈ లింక్ కూడా ఉపయోగపడుతుంది..
http://www.carnaticindia.com/learn_music.html
చాలా మంచి పని చేసారు. మీ లాంటి వాళ్ళు చెప్తే ఎక్కువమందికి ఆసక్తి కలుగుతుంది.
నేను ఇదివరలో కర్ణాటక సంగీతం గురించి రాసిన వ్యాసాలు:
శారదా…!
ఆపాతమధురం
ఆపాతమధురం -2
ఆపాతమధురం – 3
శ్రీమతి పంతుల రమ
పొడగంటిమయ్యామిమ్ము పురుషోత్తమా..తిరుమలగిరిరాయా..
Good post!
ఇలాంటి పోస్టులు మరిన్ని రావాలి… కర్నాటక సంగీతం సామాన్యుడికి కూడా అర్థమౌతుందని ప్రోత్సహించాలి
@వెంకట్,
వెరీ గుడ్. మంచి పని చేశారు. సంగీతమ్మీద మీ రెండు టపాలు బాగున్నాయి. ఆస్వాదించటానికి ప్రావీణ్యం అక్కరలేకపోయినా, ఆ తర్వాత మరింత లోతుకి వెళ్ళాలంటే కొన్ని కనీస పాఠాలు తప్పనిసరి.
its very good…nice…interesting…..
thanks alot