Toronto’07-Update
by admin@ 24fps
పది రోజుల పాటు ఘనంగా జరిగిన టొరొంటో చిత్రోత్సవం మొన్న ఆదివారంతో ముగిసింది. ప్రపంచంలోని అన్ని చిత్రోత్సవాలకంటే ఎక్కువ సినిమాలు(350?) ప్రదర్శించిన ఘనత ఈ చిత్రోత్సవానికే దక్కుతుంది. ప్రపంచంలోని వివిధ సినీ పండితుల విశ్లేషణ ప్రకారం ఈ సారి ప్రదర్శించిన సినిమాల్లో చాలావరకు బాగానే వున్నాయని తెలుస్తుంది.
390 సినిమాలు ప్రదర్శించినప్పటికీ అందరు అన్ని సినిమాలు చూసే అవకాశం వుండదు కనుక ఏ ఒక్కరి అభిప్రాయం బట్టి ఇవి మంచి సినిమాలు, ఇవి కాదు అని ఒక నిర్ణయనికి రావడం కష్టం.కాకపోతే చివరి రోజున న్యాయనిర్ణేతలు ఎన్నుకున్న సినిమాలే మేలైనవని ప్రకటిస్తారు కాబట్టి ముందుగా ఈ చిత్రోత్సవంలో అవార్డులు సాదించిన సినిమాల గురించి తెలుసుకోవడం వుత్తమం.
2007 టొరోంటో చిత్రోత్సవంలో అవార్డుల జాబితా:
1)People’s choice award for “Eastern Promises”
గతంలో వచ్చిన History of Violence సినిమా దర్శకుడైన David Cronenberg దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. History of Violence కథా పరంగా మన రజనీకాంత్ సినిమా భాషా ను పోలి వుంటుంది. David Cronenberg కెనడాకు దేశస్థుడు. గతంలో ఈయన తీసిన సినిమాలన్నీ కెనడాలోనే చిత్రీకరించిన మొదటి సారి Eastern Promises సినిమాను లండన్ లో చిత్రీకరించారు. లండన్ నేర ప్రపంచంలోని రష్యన్ గ్యాంగుల మధ్య నడిచే Crime Drama ఇది. ఇప్పటికే ఈ సినిమాని చాలా మంది క్లాసిక్ అని పేర్కొంటున్నరు. అంతే కాకుండా వచ్చే నెల 17న లండన్ లో మొదలయ్యే London Film Festival లో ఈ సినిమా ప్రదర్శనతోనే మొదలవ్వబోతుండడంతో ఈ సినిమాకి ఇప్పటికే అమితమైన క్రేజ్ లభించింది.
2)People’s choice అవార్డులో రెండో స్థానం – Juno
అమెరికాకు చెందిన Jason Reitman దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి ఇప్పటికే విపరీతమైన క్రేజ్ లభించింది. IMDB లో 9.4/10 రేటింగ్స్ తో వున్న ఈ సినిమాకు కథే ప్రాణం. కథా పరంగా చాలా సామాన్యమైన కథ. కానీ ప్రేక్షకుల్లో మంచి స్పందన తేగల కథ ఇది.
Juno అనే ఒక టీనేజ్ అమ్మాయి అనుకోని పరిస్థుతుల్లో గర్భం దాలుస్తుంది. కానీ అందరిలా కంగారు పడి అబార్షన్ చేపించుకోకుండా తనకు పుట్టబోయే బిడ్డ ని దత్తత తీసుకోగలిగే కుటుంబం కోసం చేసే ప్రయత్నాలే ఈ సినిమా యొక్క ముఖ్య కథాంశం.
డిశెంబరు 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తం గా విడుదలవుతుంది.
3)International Film Crtics అవార్డు – La Zona
Rodrigo Pla అనే మెక్సికన్ దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా సినీ విమర్శకుల ప్రశంశలు పొంది International Film Critics అవార్డుని సాధించింది. La Zona సినిమా ద్వారా తొలి సినిమాతోనే అంతర్జాతీయ ఖ్యాతి సాధించాడు దర్శకుడు Rodrigo Pla
La Zona అనే ప్రదేశం బాగా డబ్బున్న వాళ్ళు నివసించే ఒక ప్రదేశం. అత్యంత భధ్రతా వ్యవస్థ కలిగిన ఈ ప్రదేశంలోనికి ప్రవేశిస్తారు ముగ్గురు దొంగలు. అక్కడ జరిగిన నాటకీయ సంఘటనల నేపధ్యంలో ఇద్దరు దొంగలు వారితోపాటు మరో ఇద్దరు కూడా మరణిస్తారు. తన తోటి వారు చనిపోగా మిగిలిన ఒకా దొంగ పోలీసులు వచ్చేలోపల పట్టుకోవడానికి జరిగే ప్రయత్నంఏ ఈ సినిమా యొక్క ముఖ్య కథ.
ఈ సినిమాలు మాత్రమే కాకుండా Guy Maddin దరశక్త్వంలో వచ్చిన My Winnipeg సినిమాకు Best Canadian film అవార్డు, ఆనహి భెర్నెరి రూపొందించిన Encarnacion సినిమాకు Artistic Innovation అవార్డు మరియు Phil Donahue దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ చిత్రం Body of War people’s choice award లో మూడో స్థానాన్ని గెలుచుకుంది.
అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాలే కాకుండా Bela Tarr రూపొందించిన The Man from London, మన అదూర్ గోపలకృష్ణన్ సినిమా Four Women, లాంతి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Toronto లో ప్రదర్శించిన మంచి సినిమాలన్నీ ఒక్కొక్కటే చూసే ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టాను. పైన పేర్కొన్న సినిమాలే కాకుండా త్వరలో చూడాలనే ఆసక్తితో ఎదురుచూస్తున్న మరో సినిమా కూడా వుంది అదే SUKIYAKI WESTERN DJANGO.
జపనీస్ దర్శకుడైన Takashi Mike దర్శకత్వంలో వచ్చిన జపనీస్ western (కౌబాయ్) సినిమా SUKIYAKI WESTERN DJANGO అనే సినిమా ఈయన దరశకత్వంలో వచ్చిన మొదటి ఇంగ్లీష్ సినిమా. కాకపోతే జపాను వాళ్ళ ఇంగ్లీషు మాట్లాడడం, అది ఎవ్వరికీ అర్థం కాకపోవడం.(ఫర్వాలేదు Subtitles ఉనాయట లెండి!)ఈ సినిమాకున్న మరో ప్రత్యేకత ఏంటంటే Quentin Tarantino ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించడమే!
ఇంతకు ముందు నేను రాసిన వ్యాసంలో చెప్పినట్టు మన దేశానికి చెందిన నాలుగు సినిమాలు ఈ చిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డాయి.కానీ ఒక్క Four Women సినిమాకు తప్పితే మిగిలిన సినిమాలు వేటికీ పెద్దగా స్పందన లభించినట్టులేదు. ఎవ్వరూ మన సినిమాల గురించే మాట్లాడడం లేదు. ఈ నాలుగు సినిమాలే కాకుండా మన వాళ్ళే(?) అయిన శేఖర్ కపూర్,విశాల్ భరద్వాజ్, మీరా నాయర్, సంతోష్ శివన్, ఫరాన్ అక్తర్, రిచీ మెహతా, పర్వెజ్ శర్మ లు ఈ చిత్రోత్సవంలో తమ సినిమాలను ప్రదర్శించారు.
గతంలో Elizabeth సినిమాతో ఆస్కారు వాకిట దాకా వెళ్ళి ఆ తర్వాత కనుమరుగైపోయిన శేఖర్ తిరిగి మరో Elizabeth సినిమాతో తిరిగొచ్చినా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదని సమాచారం. మీరా నాయర్, సంతోష్ శివన్, ఫరాన్ అక్తర్, మరియు విశాల్ భరద్వాజ్ లు మన దేశంలో AIDS వ్యాధి నేపధ్యంలో సృష్టించిన నాలుగు లఘు చిత్రాలను ఇక్కడ ప్రదర్శించారు. ఇక పోతే కెనడాలో పుట్టి పెరిగిన రిచీ మెహతా తన సినిమా అమల్ ను ఇక్కడ ప్రదర్శించాడు. చివరిగా పర్వేజ్ శర్మ A jihad for love అనే డాక్యుమెంటరీ చిత్రం ద్వార ముస్లిం మతస్థుల్లోని Homosexuals గురించి ధైర్యంగా చిత్రించారు.
Toronto Film Festival లో ప్రేక్షకుల మన్ననలు పొందిన మరిన్ని చిత్రాల వివరాలు
Into the Wild:It’s based on the true story of a young man’s tragic walk into the Alaskan winter as he looks for something to replace the hypocrisies of American materialism. Emile Hirsch stars and Sean Penn directs his adaptation of Jon Krakauer’s book.
Mongol:Russian director Sergei Bodrov’s sweeping 12th-century tale of the rise of Genghis Khan.
Atonement:British director Joe Wright’s old-fashioned adaptation of Ian McEwan’s best-selling WWII-era novel about love, class and war. With Keira Knightley, James McAvoy and Vanessa Redgrave.
Michael Clayton:George Clooney follows up his Ocean’s 13 payday by playing a Canali-clad lawyer who is fed up with the “For Sale” sign that U.S. corporations put on truth.
The Assassination of Jesse James by the Coward Robert Ford:Clooney’s pal Brad Pitt does his part to attack the Robin Hood myth of the gunslinger in director Andrew Dominik’s latest. In Pitt’s hands, James is a killer in a battered derby who allowed himself the convenience of shooting others in the back. Casey Affleck, who plays Ford, could get a supporting-Oscar look
I’m Not There:Todd Haynes’ hypnotic, shape-shifting view of Bob Dylan features a raft of actors, including Cate Blanchett and Richard Gere, who play the rock legend. Out
Jimmy Carter, Man From Plains:Jonathan Demme’s doc about the former president’s controversial Palestine: Peace Not Apartheid book tour.
Caramel:Lebanese actress-director Nadine Labaki’s small French- and Arabic-language film about a Beirut beauty parlor where women sift through what beauty can and can’t do. Lebanon’s submission to the Oscars for best foreign film. January.
Control: Anton Corbijn’s recounting of the short, unhappy life of Joy Division lead singer Ian Curtis, who committed suicide at the age of 23. Curtis is played hauntingly by Sam Riley.
Dans la ville de Sylvia (José Luis Guerin)
Secret Sunshine (Lee Chang-dong)
Voyage of the Red Balloon (Hou Hsiao-hsien)
Useless (Jia Zhang-ke)
The Romance of Astrea and Celadon (Eric Rohmer)
Paranoid Park (Gus van Sant)
The Last Mistress (Catherine Breillat)
A Girl Cut in Two (Claude Chabrol)
The Mourning Forest (Naomi Kawase)
Alexandra (Alexander Sokurov)
One Hundred Nails (Ermanno Olmi)
Silent Light (Carlos Reygadas)
4 Months, 3 Weeks, 2 Days (Christian Mungiu)
The Banishment (Andrey Zvyagintsev)
I’m Not There (Todd Haynes)
Slingshot (Brillante Mendoza)
Happiness (Hur Jin-ho)