కర్ణాటక సంగీతం….It’s cool man!
by admin@ 24fps
పొగ తాగని వాడు వచ్చే జన్మలో దున్నపోతై పుడ్తాడో లేదో తెలియదు కానీ, కర్ణాటక సంగీతం వినకపోతే మాత్రం వచ్చే జన్మలో తప్పక గొర్రెగా పుడ్తారు; ఎందుకంటే వినని వాళ్ళు ఈ జన్మలోనే గొర్రెలు కనుక. వినని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే వుంటుందని తెలుసు. కానీ మన సంగీతాన్ని మనమే వినకపోతే ఎలా? అందుకే కొంచెం గట్టిగా చెప్తే అయినా వింటారేమో అని….
పూర్వజన్మలు, పునర్జన్మలు , గొర్రెలు, దున్నపోతుల సంగతి పక్కన బెట్టి సంగీతం విషయానికి వస్తే ఒకప్పుడు నేనూ చాలా మంది లాగే కర్ణాటక సంగీతమంటే కర్ణకఠోరంగా వుంటుందని ఫీల్ అయిపోయేవాడిని. అదృష్టవశాత్తూ సరైన వాళ్ళు సరైన సమయంలో పరిచయమయ్యి నా కళ్ళు తెరిపించారు.
అలా అని నేనేదో సంగీత విద్వాంసుణ్ణి అనుకోకండి. నేను పాడడం మొదలుపెడితే జనాలు చెవులు మూసుకొని మైలు దూరం పారిపోవల్సిందే! పాడే అదృష్టం లేకపోయినా విని ఆనందించగలిగే స్థాయికి చేరుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది. కర్ణాటక ్ సంగీతమంటే ముసలీ ముతకా తా… తీ….అంటూ రాగం తీస్తూ పాడే అర్థం లేని సంగీతం అని చాలా మంది అనుకోవడం నేను ప్రత్య్క్షక్షంగా విన్నాను. కర్ణాటక సంగీతానికి సరైన ప్రచారం లేకపోవడం ఇందుకు ముఖ్య కారణం అని నా అభిప్రాయం. కర్ణాటక సంగీతం ప్రాచుర్యం పొందకపోవడానికి మరో కారణం, దాని గురించి జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా తక్కువమంది కావడం. నా అదృష్టం కొద్దీ నేను ప్రతిరోజు ఈ సంగీతాన్ని హాయిగా వినగలుగుతున్నాను. నాలా ఈ సంగీతం తెలుసుకోవాలనుకుని కానీ ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని వారెవరైనా వుంటే ముందుగా ఈ కింది లింకు క్లిక్ చేయడం వుత్తమమని నా అభిప్రాయం.
http://www.mahadevanramesh.com/music.html
జీవితంలో సగ భాగం కంప్యూటర్ ముందు గడిపేసే చాలామందికి కర్నాటిక్ సంగీతంలోని దాదాపు అన్ని విషయాలను స్పృశిస్తూ మహదేవన్ రమేశ్ రాసిన వ్యాసాలు ఇక్కడ చదవొచ్చు. అంతే కాదు అంతర్జాలం లో సరిగ్గా వెతికితే అంతులేని జ్ఞానం ఇమిడివుంది.
ఒక వేళ మీకు చదివే ఓపిక లేకపోతే డైరెక్టుగా http://www.musicindiaonline.com/music/carnatic_vocal/ కి వెళ్ళిపోయి హాయిగా మంచి సంగీతం విని పరవశించిపోండి.
ఇవి కాకుండా internet లో బోలెడు సైట్లలో అంరులేని సంగీత సంపద దాగివుంది. కాకాపోతే వినేవాళ్ళే కరువయ్యారు. ఒక వేళ మీకెవరికైనా నిజంగా ఆసక్తి వుంది మీరు కావాలనుకున్న information మీకు నెట్ లో దొరకలేదంటే నాకు మెయిల్ లేదా ఇక్కడ కామెంట్ చేస్తే నాకు తోచిన సహాయం చేయగలను.
కర్ణాటక సంగీతం అనగానే ముందుగా చాలామంది అదేదో పురాతన కళ అనుకుంటారు. దాంతో కర్ణాటక సంగీతం వినడంతో పాతకాలపు మనుషులుగా చూడబడతామేమో అని చాలా మందికి అనుమానం.
ఒక వేళ మీలో ఎవరికైనా అలాంటి అనుమానం వుంటే ఈ కింది లింకులు క్లిక్ చేయండి. అప్పుడుకూడా కర్నాటిక్ సంగీతం un-cool అనుకుంటే మీ ఖర్మ.
It’s cool to listen to Carnatic music
పై రెండు ఆర్టికల్స్ చదివి కూడా మీరు కన్విన్స్ కాకపోతే ఈ వీడియో చూడండి. కర్నాటిక్ సంగీతం kool కాదో లేదో మీరే నిర్ణయించుకోండి.
Comments
Very happy to see this from you. there is this discussion forum (www.rasikas.org) which is a great resource for learning appreciation of indian classical music…
సంగీతం గురించి ప్రాధమిక విషయాల్ని పొందుపరిచిన వ్యాసాల్ని ఇలా ఒక చోట అందించడం చాలా మంచి ప్రయత్నం. దీనితో ఉద్బోధితులై మరి కొందరు కర్ణాటక సంగీతాస్వాదనకి తయారవుతారని ఆశిద్దాం.
మంచి లింకులు ఇచ్చారు. ధన్యవాదాలు. కానీ తెలుగులో రాస్తూ, ఎవరో విదేశీయుల్లాగ ‘కర్నాటిక్’ సంగీతం అని పదే పదే అనడం మాత్రం ఎబ్బెట్టుగా ఉంది. (సత్యజిత్ రాయ్ ని సత్యజిత్ రే అన్నట్లు)
మంచి వ్యాసం అందించారు.. ధన్యవాదాలు….
[...] తెలియకపోతే నేను గతంలో రాసిన వ్యాసం చదవి మరిన్ని విశేషాలు [...]
ఇలాంటి సమాచారం కోసమే చాలా రోజుల నుంచీ ఎదురు చూస్తున్నాను. కర్ణాటక సంగీతం గురించి సులభశైలిలో ఉన్న వ్యాసాలకు దారి చూపినందుకు ధన్యవాదాలు.
సంగీతం వినడానికి మీరు పోస్ట్ చేసిన లింక్ ఎందుకనో సా కంప్యూటర్ లో పనిచేయడం లేదు( పాట వినలేకున్నాను). ఇంకా ఏదైనా మంత్ర ముగ్ధుల్ని చేసే కర్ణాటక సంగీతాన్ని వినిపించే లింకులు ఉంటే ఇక్కడ పోస్ట్ చేయగలరు