desipundit
by admin@ 24fps
మొన్నా మధ్యన ఇక్కడ Telugu blog of the day అని ఒక శీర్షిక మొదలుపెట్టిన సంగతి మీకు తెలుసనుకుంటా! ఒక వారం పాటు సాగిన ఆ శీర్షిక నా సైటు నుంచి www.telugublogoftheday.wordpress.com కి మార్చడం కూడా మీకు గుర్తుండే వుంటుంది.రోజుకొక బ్లాగుని సమీక్షిస్తూ రాసిన కొన్ని వ్యాసాలకు మంచి స్పందనే లభించింది. ఇదంతా జరుగుతుండగా పోయిన వారం ఒక రోజు ఇస్మాయిల్ గారు గాడ్‌ఫాధర్ లెవల్లో నాకొక offer ఇచ్చారు. ఆయన అడగడం నేను refuse చేయడం కుదరదు కాబట్టి (He made me an offer that I couldn’t refuse) ఆయన చెప్పినట్టుగా desipundit సైటులో సభ్యునిగా చేరిపోయాను.
అసలీ desipundit ఏంటి? దీనికి blog of the day కి వున్న సంబంధం ఏమిటి?
Desipundit అనేది మిగిలిన బ్లాగుల్లాగే ఒక బ్లాగు. కానీ మిగిలిన బ్లాగులకు దీనికి వున్న వ్యత్యాసం ఏంటంటే, ఇది ఒక multiuser బ్లాగు. ఈ సైటులో సభ్యత్వం కలిగిన బ్లాగర్లు తమకు నచ్చిన బ్లాగుల గురించి ఇక్కడ రాస్తుంటారు. ఒక విధంగా మన కూడలి, తేనెగూడు లాంటిదే ఈ సైటుకూడా. కానీ కూడలి, తేనెగూడు లలో బ్లాగు సేకరణలు automatic గా జరుగుతాయి. అదే desipundit లో అయితే బ్లాగు సేకరణలు manual గా జరుగుతాయి. అలా జరగడంలో సహాయపడేది ఇందులో సభ్యులు.
నిన్ననే desipundit లో సభ్యత్వం అందింది కాబట్టి మన తెలుగు బ్లాగుల్లోని మంచి వ్యాసాలను ఒక దగ్గరకు చేర్చి పాఠకులకు సౌలభ్యం కలిగించే ప్రయత్నం ఇంకా కొద్దిరోజుల్లో (వచ్చే సోమవారం నుంచి) మొదలవుతుంది. ఎప్పటికప్పుడు తెలుగు బ్లాగుప్రపంచంలో ప్రచురితమవుతున్న మంచి వ్యాసాలు, కథలు, కవితలు గురించి తెలుసుకోవడానికి ఇక నుంచి desipundit వెబ్‌సైటుని దర్శించండి.
గమనిక: రోజురోజుకి బ్లాగుల సంగతి పెరిగిపోతున్న సంధర్భంగా అన్ని బ్లాగులూ వెతికి మంచి వ్యాసాలు వెతికి పట్టుకోవడం కొంచెం కష్టమైన పనే అయినప్పటికీ, మీలో ఎవరైన మంచి వ్యాసం చదివినప్పుడు నాకో e-mail చేసి చెప్పారంటే నాకెంతో మేలు చేసినట్టవుతుంది.
Comments
tappakumdaa
I think you’re the right person to do it.
BTW, Did you hear of a gentleman called Theodore Baskaran? He’s a retd govt officer with twin passions – wildlife conservation and tamil film history. He wrote a book called “eye of the serpent”, documenting tmail film history. A lot of it holds for Telugu too I think. You may be itnerested in it.
He lives in Madras – in case you stop by there.