Overrated Career?
by admin@ 24fps
మొన్నీ మధ్యనే ప్రపంచ సినీ చరిత్రలోని అత్యుత్తమ దర్శకునిగా పేరుగాంచిన Ingmar Bergman మరణించిన విషయం తెలిసిందే కదా! ఈ సంధర్భంగా ప్రపంచంలోని ఎంతోమంది సినీ ప్రేమికులు విలపించారు. నేను కూడా రెండు కన్నీటిబొట్ట్లు రాల్చిన మాట నిజమే. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ ఎంతో మంది బ్లాగర్లు తమ బ్లాగుల్లో ఆయన గురించి రాసేసారు. పత్రికలు ఆయన సినిమాలనూ, ఆయన్ను పొగుడూతూ రాసేసాయి. అయితే వీటన్నింటికీ వ్యతిరేకంగా Newyork Times పత్రికలో JONATHAN ROSENBAUM అనే సినీ విమర్శకుడు, Scenes From an Overrated Career అని ఒక వ్యాసం రాసేసారు. Bergman తీసిన Scenes from a marriage అనే సినిమా టైటిల్ను పేరడీ గా వుపయోగిస్తూ ఈయన రాసిన వ్యాసం ఇప్పుడు internet లో పెద్ద చర్చనీయాంశమైంది.
ఈ వ్యాసం చదివిన చాలామంది ఆయనతో ఏకీభవించటం లేదు. అలాంటి వారిలో నేను కూడా ఒకడినే. ఈ వ్యాసంలో Jonathan Rosenbaum తెలియచేసిన అభిప్రాయాలతో ఏకీభవించడం చాలా కష్టమైనప్పటికీ, అందరూ గొప్ప దర్శకుడని పొగుడుతున్న Bergman ను వ్యతిరేకిస్తూ ఈయన రాసిన వ్యాసం కొత్త కోణాలను ఆవిష్కరించి మంచి చర్చకు పునాది వేసిందన్న మాట నిజం.
Bergman ప్రపంచం నమ్మేటంతటి గొప్పదర్శకుడు కాదు అని అభిప్రాయపడడానికి Jonathan Rosenbaum చెప్తున్న కొన్ని కారణాలివే!
1)ఇప్పుటి తరం వాళ్ళు అంతగా Orson Wells, Goddard, Hitchcock సినిమాలు చూస్తున్నంతగా Bergman సినిమాలు చూడాటం లేదు.
2)ఈయన సినిమాల గురించి film schools లో బోధించడం లేదు.
3)Film buffs Bergman సినిమాల గురించి పెద్దగా చర్చించుకోవడం లేదు.
Bergman సినిమాలు ఇప్పుడు ఎవరూ పెద్దగా చూడటంలేదు, చర్చించడంలేదు అనేదానికి అనేక కారణాలున్నాయి. నా దృష్టిలో Bergman సినిమాలు మనుష్య సంబంధాలను చాలా తీవ్రమైన డీల్ చేయడమే ఇందుకు కారణం. మీడీయా కూడా అమెరికన్ సినిమా దర్శకులను, వారి సినిమాలను ప్రచారం చేసినంతగా మిగిలిన సినిమాల గురించి చేయదు. అందుకే Bergman సినిమాలు అందరికీ చేరడం లేదేమో. అంతేకానీ ఎవరూ చూడకపోయినంత మాత్రాన మంచి సినిమా చెడ్డదైపోదు. ఆ మాటకొస్తే Bela Tarr అనే హంగరీ దర్శకుని గురించి గానీ , ఆయన సినిమాల గురించి గానీ ఎంతమందికి తెలుసు? మీడీయా పాపులర్ అయిన సినిమాలను మరింత పాపులర్ చేస్తుందేమో గానీ కొత్తగా వెతికి పాపులర్ చేయడం అరుదే. అందుకే Rosenbaum చెప్పిన మాటల్తో నేనేకీభవించను.
అలాగే Bergman మరీ అంత గొప్ప దరశకుడు కాదని చెప్పడానికి Rosenbaum చెప్పిన మరో విషయమేమిటంటే Bergman సినిమాలపై నాటకరంగ ప్రభావం ఎక్కువగా వుందని, అందుకే ఈయన సినిమాలన్నీ డ్రామాల్లాగా వుంటాయని ఈయన అభిప్రాయం. అలాగే “The stylistic departures I saw in Mr. Bergman’s ’50s and ’60s features — the silent-movie pastiche in “Sawdust and Tinsel,” the punitive use of magic against a doctor-villain in “The Magician,” the aggressive avant-garde prologue of “Persona” — were actually more functions of his skill and experience as a theater director than a desire or capacity to change the language of cinema in order to say something new.” అని చెప్పడం ద్వారా, Bergman సినిమాల్లో పెద్దగా వెరైటీ ఏమీలేదు, పాత చింతకాయ పచ్చడి లాంటి theater డ్రామాలను సినిమాలుగా మాత్రమే తీసాడు అని చెప్పకనే చెప్తున్నాడు Rosenbaum.
సినిమా తీసే ప్రతి దర్శకుడు desire to change the lanugauge of cinema అంటూ కొత్త కొత్త ప్రయోగాలు చేయడం ఎంత కష్టం. నాకు తెలిసినంతవరకూ Bergman యొక్క సినిమాటిక్ langugae అధ్బుతం. అది theater నుంచి వచ్చిందా, painting నుంచి తెచ్చుకున్నదా అనేది అనవసరం. సినిమా 64 కళల సమ్మేళనం కదా మరి! ఆయన cinimatic language దోషాలు లేకుండా, సంపూర్ణంగా వున్నంతవరకూ కొత్త ప్రయోగాలకూ, కల్పనలకూ అవసరం లేదు. అందుకే కాబోలు Bergman కూడా అలాంటి ప్రయత్నాలు చేయలెదేమో! అంత మాత్రాన అదేదో ఘోర తప్పిదం లాగా రాసెయ్యడం సమంజసం కాదని నా అభిప్రాయం.
Bergman గురించి Rosenbaum చేసిన మరో అభియోగం, “Bergman సినిమాలన్నీ ఆయన నిజజీవితంలోని బాధావేశాలతో నిండిపోయుంటుందని”. Rosenbaum మాటల్లోనే చెప్పాలంటే “…these films are at times too self-absorbed to say much about the larger world,…” అంటారు ఆయన.
ఇదంతా చూస్తుంటే Rosenbaum ని చూస్తుంటే ఈయనకు గతంలో Bergman తో ఏదో వ్యక్తిగత గొడవలేమన్నా వున్నాయేమో అని నాకు అనుమానంగా వుంది. కళ ఎప్పుడూ కళాకారుని self-expression మీదే ఆధారపడివుంటుంది. ఆ expression తను అనుభవించిన, లేదా గమనించిన జీవితంలోనుంచో రావచ్చు. అంత మాత్రాన అది సమాజాన్ని ఉధ్ధరించేలానో, సమాజం మొత్తాన్ని ప్రతిబింబించేలానో వుండాలన్న నియమం ఏమీ లేదు.
ఇక్కడ ఇంకా ఆలోచించిన మరో విషయం ఏంటంటే సరిగ్గా Bergman చనిపోయిన కొద్దిరోజులకే ఈయన ఈ వ్యాసం రాయడం. నిజంగానే ఈయనకు Bergman పై వున్న అభిప్రాయాలు నిజమైతే అతకు ముందెప్పుడూ ఎందుకా పని చేయలేదో?
Bergman కి సంతాపం తెలుపుతూ ప్రపంచం మొత్తం ఆయన గొప్పదనాన్ని కొనియాడుతుంటే, “అందరిలా మనమెందుకు రాయాలి. కాస్తా వెరైటిగా వుంటుంది. ఉల్టాగా రాసేద్దాం” అని ఆయన రాసేస్తే, కొద్దో గొప్పో కాంట్రవర్సీ సృష్టించినట్టవుతుందని NYT వాళ్ళు ప్రచురించేసినట్టునారు. అంత మాత్రాన Bergman సినిమాలన్నీ విమర్శకందని కళాఖండాలని నేనడడం లేదు. ఒక సినిమా కానీ, దర్శకున్ని గానీ విమర్శించేటప్పుడు అందుకు సరైన కారణాలు చెప్తే బావుంటుందని అభిప్రాయం.
Comments
నేను కూడా ఆ ఆర్టికల్ చదివాను New York Times Article Link
…. దాని గురించి పోస్టు కూడా చెయ్యాలనుకున్నా …ఇంతలో మీరే చేసారు .. సర్లెండి ఆ సోదేదో ఇక్కడే వాగుతా … నాకు సంబంధించిింతవర్కూ Some Minor Quibblings abt bergman I think it is not just a willingness to tackle “big” and serious questions that make Bergman’s films so effective and leave such a powerful impression. It is rather his technical competence and even more important the extraordinary cast of actors that he surrounds himself with that save his films from ridicule and laughter which comes from too much seriousness. Even a marginally less competent director will not be able to pull things off like Bergman does. Even then I don’t think there is a any director in film history who is more often parodied, although never without respect.
Another thing that came to my mind was how relevant the questions of soul, existence of God, spiritual isolation, freedom and responsibility are to us living in the early twenty first century? I mean the general human populace, stripped of all individuality and self-identity, mindless herd of consumerist sheep populating the shopping malls and movie multiplexes? It takes me to another weak point I find in Bergman — his utterly a-historical and decontextualised portrait of human reality. Some people would say it is his strength, he doesn’t clutter what he wants to say with extraneous details. That he is interested only in the essential. If that is so his diagnosis of the human condition can only be called incomplete. Is the problem of faithlessness really that universal and timeless as Bergman claims it is? I think modern literature tackles this question is much more well rounded manner. In fact I have still been thinking of David Cronenberg’s Crash, which I saw on Saturday, a film as attuned to the 21st century human life as one can be (a cinema of the body as opposed a cinema of the soul), and even there I found Cronenberg’s hesitant approach to tackle his subject in a more direct and political manner a little disappointing.
Lastly, much as we would like it otherwise, we can’t escape the fact that we live in the age of irony. You can’t say something and also hope that people think you mean it. That is asking too much. Again Bergman pulls it off because of his extraordinary craft. Not the stuff of lesser filmmakers. (Even in fiction I often see critics bewailing the lack of story, characters and believable psychology in modern literature and longing for the comforts and the securities of the victorian fiction. Needlessly to say I find these very irritating too.) In movies I don’t see any example more eloquent than Lars von Trier’s reworking of Dreyer’s Ordet into his own Breaking the Waves. The austerity, sincerity and seriousness of Dreyer give way to mockery, contrivance and irony in von Trier. This is truly the Ordet we deserve at this time in the history. Asking otherwise is akin to trying to reverse the historical clock. We don’t have any Bergman and Dreyer now because we can’t have.
అయాయో ….. కామెంట్ తో డబుల్ రోల్ చేపించినందుకు సారీ ….
బై ద వే ROSENBAUM ఆర్టికల్ కి కౌంటర్ గా Roger Ebert రాసిన Defending Ingmar Bergman చదివారా ??