తీసేవాళ్ళకి కిరీటం-చూసేవాళ్ళకి టోపీ
by admin@ 24fps
మొన్నా మధ్య తమిళనాడులో కిరీటం అనే సినిమా విడుదలయ్యింది. అజిత్ నటించిన ఈ సినిమా సూపర్‌స్టార్ రజనీ సినిమా శివాజీ ని వెనక్కి నెట్టి ఇప్పుడు బాక్సాఫీసు కలెక్షన్లలో మొదటి స్థానంలో నిలబడింది. ఈ సినిమా దాదాపు ఒక దశాబ్దం క్రితం మలయాళంలో మొహన్‌లాల్ నటించిన కిరీటం అనే సినిమాకు రీమేక్.
తమిళంలో ఈ సినిమా హిట్టయిందని తెలియగానే మన ఏంగ్రీ యంగ్ మేన్ రాజశేఖరుడు ఈ సినిమా రీమేక్ హక్కులు పొందడానికి హడావుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇంతకీ మన రాకశేఖరునికి తెలియని విషయమేమిటంటే ఇదే సినిమాను గతంలో రౌడియిజం నశించాలి అన్న పేరుతో ఇప్పటికే తీశేసారని. తెలియక పోవడం తప్పేమీ కాదు. కాకపోతే రౌడీయిజం నశించాలి సినిమాలో హీరో రాజశేఖరే కావడంతో ఆ విషయం ఆయన తెలుసుకుని వుండాలి అని అనుకోవడంలో తప్పేమీ లేదు. ఈ విషయం గురించి ఒక తెలుగు సినిమా వెబ్సైటులో చదివి మొదట్లో ఆస్చర్య పడ్డా తర్వాత అదేమీ అంత వింత కాదనిపించింది.
చూసే జనాలు వుండేవరకూ వీరు ఇలాంటి ప్రయత్నాలు ఆపరు. ఈ రీమేక్‌లు డబ్బింగ్ ల పరవం ఎంత వరకూ వెళ్ళిందంటే గతంలో తెలుగులో సూపర్ హిట్టయిన సినిమా నరసింహనాయుడిని తమిళంలో అర్జున్ రీమేక్ చేసుకోగా అదే తమిళ సినిమాను మళ్ళీ తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేసారు ఎవరో తెలివిగలాయన.
ఇంతకీ ఈ కిరీటంలోని కథేమైనా పెద్ద గొప్ప కథయ్యుంటే పోనీలే అనుకోవచ్చు. పోలీసు కానిస్టేబులయిన తండ్రి తన కొడుకుని ఎప్పటికైనా పోలీసు ఇన్స్‌పెక్టర్‌ని చేయాలన్న ఆశయంతో వుంటాడు. అప్పుడే కాలేజీలో పట్టభద్రుడై ఇంటికి వచ్చిన కొడుకుతోపాటు మరో వూరికి బదిలీ అవుతుంది ఆ కుటూంబం. ఆ కొత్త వూరిలో ఒక పెద్ద రౌడీ. పోలీసులు ఆయన వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతుంటారు. ఒకరోజు అనుకోని పరిస్థుతుల్లో ఆ రౌడిని ఎదుర్కుంటాడు ఆ కానిస్టేబుల్ తండ్రి. ఎదురొచ్చిన ఆ కానిస్టేబుల్ ని చంపేస్తాడు ఆ రౌడీ. తన తండ్రిని చంపిన రఊడీ ని చితగ్గొడతాడు కొడుకు. చివరికి ఆ రౌడీ మధ్య, ఆ కానిస్టేబుల్ మధ్య తలెత్తిన గొడవల్లో తన తండ్రిని చంపిన ఆ రౌడీని చంపి పగ తీర్చుకుంటాడు కొడుకు. క్లుప్తంగా అదీ కథ. ఈ మాత్రం కథ మనవాళ్ళలో ఎవరూ రాయలేరా? ఏమిటో అంతా మాయ.
ఒక వేళ రౌడీయిజం నశించాలి సినిమా కిరీటంకు రీమేక్ అయ్యుండి, తమిళ్ లో హిట్టయింది కదా అని మళ్ళీ ఇప్పుడు తెలుగులో తీస్తే జనాలకి ఇంతకంటే పెద్ద టోపీ పెట్టిన ఘనతను దక్కించుకుంటారు ఈ సినీ నిర్మాతలు.
Comments
కిరీడం రీ-మేక్ కోసం వెంకటేష్ ఇంట్రెస్ట్ చూపించాడు అని విన్నాను. మీరు స్టోరీ చెప్పాక గుర్తు వస్తుంది ఈ సినిమా చిన్నప్పుడు చూసాము .
“రౌడీయిజం నశించాలి” అంటే నాకు చప్పున గుర్తు రాలేదు కానీ.. మీరు చెప్పిన కథ విన్నాక అంతా జ్ఞప్తికి వచ్చింది. ఈ మద్యనే జెమినీ/తేజాల్లో బోలెడన్ని సార్లు వచ్చింది. రాజశేఖర్, వాణీ విశ్వనాధ్, సత్యనారాయణ, అన్నపూర్ణమ్మ వుంటారందులో. ఒక సాధారణ యువకున్ని పరిస్థితులు ఎలా నాశనం చేస్తాయో చక్కగా వుందందులో. అది హిట్టు సినిమానో కాదో తెలియదు కానీ నాకు బాగా నచ్చింది.
అయితే దాన్నీ మళ్ళీ డబ్బింగ్ చేయడం/రీమేక్ చేయడం ఏంటి.. తలతిక్క గాకపోతే!
–ప్రసాద్
http://blog.charasala.com
alage, late 80’s lo vachina (hit ayina) “chinnaraja” aney tamil dubbing cinema early 90s lo hindi lo “beta” ani remake cheste adi hit ayindani, abbayigaru (?) ani venkatesh ni petti malli teesaru. manam malli chusi malli hit chesam.
rajnikanth-vijayasanthi hit tamil cinema ni telugu loki “gharana mogudu” ani remake chesina 1 yr ki, original tamil movie ni dub chesi release chesaru, vijayasanthi character meeda base chesina title tho.
నిజం సినిమా కథ కూడా యిదే కదా?
Nenu chennai lo vuntunnanu kereetam cinimani Rajahamundry lo shoot chesi adi tamilnadu lo oka grammam ga choopincharu enduko teludu ipudu vastunna telugu cinimalu Tamil leda Malayalam remakule naku teliaka adugutunnanu telugulo rachaitalu lera ????
naaku oka aalochana vachhindi entiante kerala lo office petti remake hakkulu koni telugollaki ammadam (Naku malayalam baga vachu) Emantaru………. Ninna keretamchusanu hall lo pattumani
vandhamandhi kuda leru meere alochinchandi entha galivarthalo….ikkada talk peddaga ledu
మీరు స్టోరీ చెప్పాక గుర్తు వస్తుంది ఈ సినిమా చిన్నప్పుడు చూసాము .
nanu ee cinema chusanu, kani ee cinema malli tamilamlo vachi malli telugulo rajashekahr chastunadante chala ascharyanga vundi