24fps.co.in

…………..Cinema is life, and life cinema: around us, beside us, inside us.

ఆరిపోయిన కళాజ్యోతి

ఈ రోజు(జులై 30, 2007) ప్రపంచ సినీ చరిత్రలో దాదాపు 89ఏళ్ళపాటు అవిరామంగా వెలిగిన ఒక కళాజ్యోతి ఆరిపోయింది. జులై 14, 1918 లో స్వీడెన్ లోని ఉప్శల అనే ప్రదేశంలో పుట్టి, 1946లో Crisis అనే చిత్రం ద్వారా చలనచిత్ర ప్రపంచంలోనికి అడుగుపెట్టి, The Seventh Seal, Wild Strawberries, Fanny and Alexander లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గాంచి దాదాపు 60 సినిమాల ద్వారా ప్రపంచంలోని అన్నిమూలలవున్న సినీ ప్రేమికుల హృదయాలను స్పందింపచేసిన Ingmar Bergman జులై 30వతేదీ ఉదయాన తన స్వగృహంలో మరణించారన్న వార్త ఆయన అభిమానులెందరినో విచారంలో ముంచెత్తింది.

తీసేవాళ్ళకి కిరీటం-చూసేవాళ్ళకి టోపీ

మొన్నా మధ్య తమిళనాడులో కిరీటం అనే సినిమా విడుదలయ్యింది. అజిత్ నటించిన ఈ సినిమా సూపర్‌స్టార్ రజనీ సినిమా శివాజీ ని వెనక్కి నెట్టి ఇప్పుడు బాక్సాఫీసు కలెక్షన్లలో మొదటి స్థానంలో నిలబడింది. ఈ సినిమా దాదాపు ఒక దశాబ్దం క్రితం మలయాళంలో మొహన్‌లాల్ నటించిన కిరీటం అనే సినిమాకు రీమేక్.