శంకర్ దాదా అమెరికా వెళ్తాడా?
by admin@ 24fps
ఈ రోజు చాలామంది ఎంతో రోజులుగా ఎదురుచూస్తున్న రోజు. చిరంజీవి అభిమానుల కలలు పండేరోజు. శంకర్‌దాదా జిందాబాద్ విడుదలయ్యే రోజు. గతంలో హిందీలొ వచ్చిన “మున్నాభాయ్ MBBS” అనే సినిమా రీమేక్ హక్కులు కొని తెలుగులో హిరంజీవితో “శంకర్‌దాదా MBBS” పేరుతో తీసారన్న సంగతి అందరికీ తెలిసిందే! హిందీలో వున్నంత గొప్పగా తెలుగులో లేకపోయినా మన చిరు మానియా కలిగిన అభిమానులు తెగ చూసేసి నిర్మాతల జేబులు నింపారు. ఆ తర్వాత హిందీలో “మున్నాభాయి MBBS” సినిమాకు సీక్వెల్ గా “లగే రహో మున్నాభయ్” అన్న సినిమా తీసి విజయం సాధించాక అదే సినిమా హక్కులు పొంది ఇప్పుడు “శంకర్ దాదా జిందాబాద్” అన్న సినిమా తీసి ఇవ్వాళ విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసే వుంటుంది.
ఈ సినిమా ఎలా వుంటుందో దేవుడెరుగు(చిరంజీవి అభిమానుల కళ్ళు పెట్టుకు చూస్తే మాత్రం ఖచ్చితంగా బావుంటుంది). కానీ ఈ సినిమా వళ్ళ నిర్మాత నష్టపోడు, మనం ఎలా వున్నా చూస్తాము కాబట్టి ఎగ్జిబిటరికీ రిస్కు లేదు. ఎటొచ్చీ సినిమా బాగాలేకపోతే బలయ్యేది జనాలే!
నా అనుమానమళ్ళా ఒక్కటే! ఒక వేళ ఈ సినిమా బాగా ఆడి నిర్మాతలకు లాభాలు గడిస్తే అప్పుడు మరో భాగం తీయడానికి సిధ్ధమవుతారా లేదా? అని.
ఇప్పటికే హిందీ వాళ్ళు అమెరికాలో మకాం వేసి మూడోభాగం (మున్నాభాయ్ చలే అమెరికా) షూటింగ్ చేసేస్తునారు. అది విడుదలయ్యి జనాల స్పందన తెలిసేసరికి మరో సంవత్సరం పట్టొచ్చు. ఈ లోపల మన శంకర్‌దాదా రెండొ భాగం ఫలితాలు తెలిసిపోతాయి. దాన్ని బట్టి మూడో భాగం రీమేక్ హక్కులు కొనాలో లేదో తేల్చుకుంటారు. మనం ఎంత అరిచి గీపెట్టినా ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.
నా అభిప్రాయం ఏంటంటే ఎప్పుడులా రొటీన్‌గా ఆలోచించకుండా, వెంతనే మంచి స్క్రీన్‌ప్లే తయారు చేసుకుని హిందీ వాళ్ళకంటే ముందే మన వాళ్ళూ మూడొ భాగం తీసేస్తే అప్పుడు అంతా తారుమారయిపోతుంది. ఇప్పటివరకూ వాళ్ళ దగ్గర్నుంచి మనం రీమేక్ హక్కులు కొనుక్కుంటున్నాట్టు, ఇప్పుడూ వాళ్ళే వచ్చి మన దగ్గర కొనవచ్చు. ఎలాగూ మూడో భాగం తీయాలనే ఆలోచన వస్తుంది కాబట్టి ఈ విధంగా చేస్తే రీమేక్ హక్కులు కొనడానికి ఖర్చు చేసృ డబ్బులు మిగిలిపోయినట్టే!ఇంకా ఆలోచిస్తే మంచి స్క్రిప్ట్ రాసుకోవడం ద్వార దాన్ని ఇతర భాషల్లోకి అమ్ముకునే అవకాశం కూడా వుంది.
ఇలా ఎందుకు అంటున్నానంటే అసలు మున్నాభాయ్ MBBS సినిమా నే One flew over Cuckoos nest అనే ఇంగ్లీషు సినిమా నుంచి కాపీ. మరీ మక్కీకి మక్కీ కాపీ కాకపోయినా చాలా క్యారెక్టర్లు మరియు స్టోరీలైను మాత్రం ఈ సినిమా ద్వార ప్రేరణ చెందినదే. కావాలంటే మీరే చూసి నిర్ణయించుకోండి. అసలు వాళ్ళే కాపీ కొట్టిన ఐడియాను కోట్లు పోసి మనం కొనుక్కోవడం ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందుకే ఈసారయినా మన వాళ్ళు కాస్త వెరైటిగా ఆలోచించి శంకర్దాదాను మున్నాభాయ్‌కంటే ముందే అమెరికా పంపిచ్చేస్తే బావుంటుంది కదా!
Comments
I was also thinking the same…we do have talented and creative directors, why don’t we make Shankara Dada series of movies with Chiru, so that we can sell the rights to hindi, tamil and kannada industry. I don’t think the second part was not being released in tamil and kannada. If we make a telugu movie, tamil and kannada people will buy rights as well as hindi guys.
“one flew over cockoo’s nest” nenu chusanu gani, naku ekkada polikalu unnattu anipinchaledey? “Patch adams” ni chala caraku copy kottaranipinchindi naku.. treatment methods, strict superior in hospital etc.
Quite right – it has very little resemblance to cuckoos nest.
Chiranjivi is verry exallent Acter in the filim industry but he was not supported by the dubbing movies and mainly in this time he was not propose for this type of move do this directed story and its only message oriented movies is betterr then for commparing to the others a small request for chiranjivi you are not “Enter into the poliics once you enter this politics our one of the politsian in this curreption cuntry” you can do the public service is better for the with out politics is that real parson can do the work like MOTHERTHERISA
Thanks for reading this message
your’s Brouther
Sunder.R
you are absolutly right. we should try to be ahead of remake films. since chiru has great influence and capacity to change the minds of the people he should encourage the people to work for society. chiru you must live in hearts of everyone like rajkumar for kannadigas.