Lets change the world!

by admin@ 24fps

మొన్నా మధ్య నా సైటులో “rahi kaun Hain” అనే ఏరుతో నేనొక్క వ్యాసాని ప్రచురించాను. దాని ద్వారా నేను తెలియచేయాలనుకున్న విషయమేమిటంటే, మన తెలుగు రచయితలను, వారి వారి శైళిని ఒక్క వాక్యంలో “రహీ” గారు చెప్పడం నాకు బాగా నచ్చింది. నా దృష్టిలో అది చాలా కష్టమిన పని. ఒక రచయిత శైళిని వివరిస్తూ పేజీలు పేజీలు రాసెయ్యొచ్చు. కానీ ఒకటి లేదా రెండు వాక్యాల్లో చెప్పడం చాలా కష్టం. ఇక పోతే ఈ వ్యాసం ద్వారా నేను తెలుసుకోవాలనుకున్న విషయమేమిటంటే, ఈ “రహి” ఎవ్వరని? నా వ్యాసం చదివి కామెంట్ల ద్వార ఎవరో ఒకరు తెలియచేస్తారనుకున్నాను. కానీ నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కాకపోతే నా వ్యాసం చదివిన leo గారు “అంటే తెలుగు నవల కేవలం సమాజానికి ప్రతిబింబంగా వుండాలా? కాల్పనికత వుండకూడదా? మరీ విడ్డూరంగా వుందే!” అని, ఆయన మాటలతో ఏకీభవిస్తూ Giri గారు ఈ విధంగా అన్నారు,

“Well said Leo!
I too have the same question.
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని వుంది నాక్కూడా.
నవలలకే కాదు, కథల్లో కూడా సమాజం ప్రతిబింబించాలనీ, సమాజాన్ని ఉద్ధరించే నీతులుండాలనీ (వ్యంగ్యం ఏ మాత్రమూ లేదు!), సమాజం గబుక్కున మారిపోవడానికి నవల/కథ రాయాలని – ఒక వర్గం వారు చెబుతుంటారు. ఈ theory మీద నాకెప్పుడూ అనుమానమే!
Can you pls comment Venkat?”

Leo మరియు Giri మాత్రమే కాకుండా కొత్తపాళీ గారు “ఈ వ్యాసంలో ఆయన చేసిన తీర్మానాలు, ఆరోపణల గురించి మీ అభిప్రాయం ఏమిటో కూడా రాయ వలసింది” అని రాసారు. వారి వ్యాఖ్యలకు సమాధన్మిచ్చే ప్రయత్నంలో రాస్తున్న మరో వ్యాసం ఇది.

నా ధృష్టిలో సమాజాన్ని ఉధ్ధరించే నీతులుండే కథైనా, నవలైనా, సినిమా అయినా లేదా మరే కళా రూపమైనా అలాంటి వాటికి నేనూ వ్యతిరేకినే! సమాజం గబుక్కున మారిపోయే కథలు రాయడం శుధ్ధ దండగ. అలాంటి వాటి వల్ల సమాజం చచ్చినా మారదు. మొన్నా మధ్య ఒక లఘు చిత్రం చూస్తుంటే ఈ విషయమే నాకు అనిపించింది.

ఈ సినిమాలో ముగ్గురు కుర్రాళ్ళు తమ జన్మదిన సందర్భంగా బార్‌కెళ్ళి డబ్బులు వృధా చేయకుండా ఆ డబ్బును సమజానికి ఉపయోగపడేలా ఖర్చుపెట్టాలని నిర్ణయించుకుంటారు. అనుకున్నదే తడవుగా ఆ డబ్బులు తీసుకెళ్ళి వారి కాలనీలో కూలి పని చేసుకుంటున్న ఒక చిన్న అమ్మయిని వెతికి పట్టుకుని ఆ అమ్మయికి చదువు చెప్పించాలని నిర్ణయించుకుంతారు. ఒక్క సీన్లో కథంతా మారిపోతుంది. అప్పటివరకూ ఇటుకలెత్తుతూ కష్టాలు పడుతున్న ఆ అమ్మాయి తర్వాత సీనులో మంచి బట్టలేసుకుని భడిలోకి అడుగు పెడుతుంది. కట్ చేస్తే బడికెళ్తున్న కూతుర్ని సంతృప్తిగా చూస్తున్న తండ్రి. క్లోజప్లో ఆయన కళ్ళల్లో ఆనంద భాష్పాలు. కట్ చేస్తే ఎలుగు నిందిన మొహాల్తో ఆ ముగ్గురు కుర్రాళ్ళు. ఆ సీను కట్ చేస్తే సినిమా ఏకంగా ఇరవై ఏళ్ళు ముందుకు పరిగెట్టింది.

నల్ల స్క్రీనుపై తెల్ల అక్షరాలతో “ఇరవై ఏళ్ళ తర్వాత” అని చూపించి ఒక హాస్పిటల్లో తర్వాతి సీను మొదలవుతుంది. అక్కడ ఒక డాక్టరమ్మ కూర్చుని వుందగా ఒక ముసలాయన వైద్యం కోసం ఆ హాస్పిటలికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసుకోవాలని వున్న చెప్పడం నాకు ఇష్టం లేదు.

రోటీను కథే ఇది కూడా!

ఆ సినిమా సంగతి పక్కనబెడితే ఆ సినిమా షూటింగ్ చేసి సాయంత్రం రిలాక్సవ్వడానికి బార్కెళ్ళి మందుకొట్టే రకం ఆ సినిమా తీసిన వాళ్ళు. వీళ్ళు సమాజాన్ని ఉధ్ధరించేలా సినిమాలు తీసే వాళ్ళు! అంతా ట్రాష్. పెద్ద అబధ్ధం.

నా దృష్టిలో ఇలాంతి వాళ్ళ సినిమాలు, కథలు, నవలవల్ల చాల చెడు జరుగుతుంది సమాజానికి. దాని బదులు హాయిగా కామెడీ సినిమానో, థ్రిల్లర్ సినిమానో మంచిది. ఇలా నీతిని ప్రబోధించే సినిమాలు లేదా కళా రూపాలెలా వుంటాయంటే, సినిమా చివరి దాకా అశ్లీల సన్నివేశాలతో నిండిపోయిన సీన్లతో విచ్చలవిడి సృంగారాన్ని చూపించేసి చివర్లో ఆ పనులు చేసిన వాళ్ళకు కష్టాలు కలుగచేసి “అలా” చేస్తే “ఇలా” అవుతుంది అని ఒక నీతి ప్రభోధించి వాటికి sex educations films అని ప్రజల్ని మోసంచేసే బూతు సినిమాలలాగే ఈ నీతి సినిమాలు కూడా.

కానీ సమాజాన్ని ప్రతిబింబించని కథైనా, నవలైనా, లేదా వేరే ఏ కళారూపమైనా దాని ప్రయోజనం సున్నా! కొద్దో గొప్పో వినోదం అందివ్వగలవన్న మాట నిజమే కానీ ఆ మాత్రం వినోదం కోసం దానికి కళ అని పేరుపెట్టడం అనవసరం అని నా అభిప్రాయం.

ఇకపోతే ఆ వ్యాసంలో “రహి” గారి అభిప్రాయలతో పూర్తిగా ఏకీభవించలేనప్పటికీ చాలావరకు మాత్రం ఆయన వ్యక్తపరిచిన విషయాలు సరైనవే అనిపిస్తుంది. బుచ్చిబాబు కథలన్నీ తెలుగుదేశంలో జరిగే పాశ్చాత్య కథ అనడం నాకు చాలా నచ్చింది. కాకపోతే గోపీచంద్ గురించి రాస్తూ ఆయన పాత్రలు సమాజం నుంచి వచ్చినప్పటికీ సమాజానికి అతీతంగా వ్యవహరిస్తారని ఆయన ఆరోపణతో నేనంగీకరించలేను.