Doubts from Maidanam
by admin@ 24fps
లేచిపోయినానంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంతో వుంటుంది. ఇదివరకంతా యీ మనుషుల్లోంచి, నీతి వర్తనుల లోంచి వెళ్ళిపోయి, ఎడారిలో జీవించడంవల్ల నేను చేసినపని ఘోరత్వం, నీచత్వం బోధ్పడలేదు. ఆ జీవితమంతా సుందరమైన స్వప్నం వలె, ఆ ఎదారి పుణ్యభూమివలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళ హారతివలె తోచింది. ఇంటినే, మంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం ఎంత ఉన్నతమో అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్నీ, మీరానీ అనుభవించిన తరువాత, మన చుట్టూ బతికే ఈ ప్రజలందరూ పురుషులేనా మనుష్యులేనా అనిపిస్తుంది నాకు. నేను బండి దిగేటప్పుడు వీళ్ళు చుట్టూ పోగై,
“లేచిపోయిందట్రా!”
“చాలా బావుందిరా మనిషి!”
“కావాలసిందే శాస్తి ముండకి!”
అంటూ వుంటే అర్థమయింది నాకు లోకమార్గం. చివరికి నువ్వు అన్నావు- ‘లేచిపోవడానికి నీ భర్త లోపమేమన్నా వుందా?” అని. ఆయన్నెరుగుదువా? అమీరే నాకు కనబడకపోతే ఇంకా నా పెనిమిటితో కాపరం సుఖంగా, మత్తుగా చేస్తోవుండేదాన్నే. అమీర్ తో నీకో ఇంకో పతివ్రతకో స్నేహమే వుంటే, మీరూ లేచిపోయివుందురు. అతని ఆకర్షణ నిగ్రహించలేక మీరూ, నేనూ కాదు జవాబుదారీ దానికి. ఒప్పుకోవూ? మీరెవరూ లేచిపోయి వుండరూ?
నీ మాట నిజమేమో? ఆ ఆకర్షణ అర్థమయ్యే హృదయం వుండాలికదా! కాని మధ్యాహ్నపు సోమరి గాలి నన్ను తాకితే ఒళ్ళు ఝల్లుమనే నాకు, అమీరు విశాల వక్షపు వొత్తిడి స్వర్గంగా అర్థం కాకుండా వుండాగలదా? పోనీండి. మీరే అదృష్టవంతులేమో తగాదా యెందుకు?
ఇదంతా మైదానం మొదటి పేజీనుంచని చెప్పనవసరం లేదనుకుంటా!
చాలా రోజుల తర్వాత చలం మైదానం చదువుదామని రాత్రి పుస్తకం తీసాను. అదేంటో గానీ మొదటి పేజీ దాటలేకపోయాను.
అందుకు కారణాలు చాలా వున్నాయి. గతంలో ఒక స్నేహితుడితో మైదానం గురించి ఒక స్నేహితునితో చర్చిస్తున్నప్పుడు, “ఆ ఏముందయ్యా మైదానంలో, తన వాంచలు తీర్చుకోడానికి బరితెగించి ఒకరు కాదు ఇద్దరితో పడుకున్న ఒక స్త్రీ కథే గా! ఎందుకా పుస్తకానికి అంత ప్రాముఖ్యత ఇస్తారో!” అని నా స్నేహితుడన్నప్పుడు నాకు అతనికి చెప్పదానికి సరైన సమాధానం దొరకలేదు. ఎప్పుడోకప్పుడు మైదానం మళ్ళీ చదివి సరిగ్గా అర్థం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఈ పుస్తకంపై phd చేసిన వాళ్ళను అడిగి తెలుసుకుందామని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలేవీ ఫలితాలివ్వలేదు.
సరే నేనే సీరియస్ గా చదివి అర్థం చేసుకుందామనే ప్రయత్నంలో నిన్న రాత్రి పుస్తకం పట్టుకుని మొదటీ పేజీ దాటి రేండో పేజీలో అడుగుపెట్టే లోపే బోల్డన్ని అనుమానాలు. నా అనుమానాలు/ప్రశనలకు మీరెవరన్న సమధానాలివ్వగలరెమో ప్రయత్నించండి.
1)”చివరికి నువ్వు అన్నావు -లేచిపోవడానికి నీభర్తలోపమేమన్న వుందా?” అన్న వాక్యంలో ఆ నువ్వు” ఎవ్వరు? ఒకవేళ ఆ “నువ్వు” చలం అనుకుందామనుకుంటే “అమీర్ తో నీకో ఇంకో పతివ్రతకో స్నేహమే వుంటే, మీరూ లేచిపోయివుందురు.” అన్న వాకయం ద్వార ఆ “నువ్వు” ఒక స్త్రీ అన్న విషయం అర్థమవుతుంది. అంటే ఆ “నువ్వు” పాఠకురాలని అర్థమా?
2)”…..వెళ్ళిపోయి, ఎడారిలో జీవించడంవల్ల నేను చేసినపని ఘోరత్వం, నీచత్వం బోధపడలేదు” అని రాజేశ్వరి అన్నప్పుడు, “మీరే అదృష్టవంతులేమో తగాదా ఎందుకు?” అని తన దురదృష్టాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆమె చేసినది తప్పు ఒప్పుకున్నట్టా?
3)”జీవితం సుందరమైన స్వప్నం వలె, ఆ ఎడారి పుణ్యభూమివలె……” అని తన గతాన్ని నెమరు వేసుకున్నప్పుడు, “ఆ ఆకర్షణ అర్థమయ్యే హృదయం వుండాలికదా…” అని చెప్పినప్పుడు తన చేసిన పనిలో తప్పేమీలేదని రాజేశ్వరి చెప్తున్నట్టా?
పై ప్రశ్నల్కు మీకు తోచిన సమాధానాలు ఇవ్వగలరని మనవి.
Comments
1. ఆ ‘నువ్వు’ చలం కాదు.. నాకు కధ పూర్తి గా గుర్తు రావటం లేదు.. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం చదివాను. PhD కాదు కాని ఈ ‘మైదానాన్ని’, చలం తత్వాన్ని బాగా బుర్రకి ఎక్కించుకున్నాను. అక్కడ నువ్వు అంటే… పాఠకురాలే. కాకుంటే.. సాటి స్త్రీ . ( a common woman).
2.అవును. అలా అనటం వల్ల ఆమె తప్పు ఒప్పుకుంది. అది తెలుసుకోకుండా చాల మంది (వీరంతా కధ చదవని వారే!! ) ఆ పుస్తకాన్ని దూషిస్తారు.
3. అప్పుడు అలా తోచింది అని చెపుతుంది. అప్పటికి తను చేసిన తప్పు తనకి తెలీదు.
కధ చదివితే పూర్తిగా చదవండి. అప్పుడే అర్ధమవుతుంది. మధ్యలో ఆపే లెక్కన చదవొద్దు. కధ మొత్తం చదివాక నాకు చెప్పండి. మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ‘చలం’ నా ఫేవరెట్ సబ్జెక్ట్.
ఈ ప్రశ్నలే కాదు .. ఈ నవల గురించే కాదు. చలం ప్రతీ రచన గురించీ బోలెడేసి ప్రశ్నలు అడగాల్సి ఉంది. చర్చ మంచిదే – వివిధ దృక్కోణాలని, సన్నివేశాల్లోనూ పాత్రల్లోనూ మనం చూడని పాఋశ్వాలని బయటికి తేవడంలో ఉపయోగ పడుతుంది. కానీ ఏ PhDలనీ, చలం గుత్తాధికారుల్లా మాట్లాడేవారినీ నమ్మకండి.
[...] మధ్య సాహిత్యం గుంపులూ, 24 frames.. లో చలం గారి మైదానం గురించి చదివాను. ఆ [...]
చలం అర్ధం కావాలంటే జీవితాన్ని కొంచెం అనుభవించి వుండాలి..
నాకు తోచిన సమాధానాలు లేక అర్థమయిన విధానం:
1)”చివరికి నువ్వు అన్నావు -లేచిపోవడానికి నీభర్తలోపమేమన్న వుందా?” అన్న వాక్యంలో ఆ నువ్వు” ఎవ్వరు? ఒకవేళ ఆ “నువ్వు” చలం అనుకుందామనుకుంటే “అమీర్ తో నీకో ఇంకో పతివ్రతకో స్నేహమే వుంటే, మీరూ లేచిపోయివుందురు.” అన్న వాకయం ద్వార ఆ “నువ్వు” ఒక స్త్రీ అన్న విషయం అర్థమవుతుంది. అంటే ఆ “నువ్వు” పాఠకురాలని అర్థమా?
–ఇక్కడ “నువ్వు” సమాజం. అది పాఠకురాలవ్వచ్చు. రాజేశ్వరి లేచిపోయిందని చెప్పే ఏ సమాజ సభ్యుడు/సభ్యురాలూ అవ్వచ్చు.
2)”…..వెళ్ళిపోయి, ఎడారిలో జీవించడంవల్ల నేను చేసినపని ఘోరత్వం, నీచత్వం బోధపడలేదు” అని రాజేశ్వరి అన్నప్పుడు, “మీరే అదృష్టవంతులేమో తగాదా ఎందుకు?” అని తన దురదృష్టాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆమె చేసినది తప్పు ఒప్పుకున్నట్టా?
– ఇక్కడ “మీరే అదృష్టవంతులేమీ తగాదా ఎందుకు?” అనడం ఖచ్చితంగా తప్పు ఒప్పుకున్నట్టు కాదని నా అభిప్రాయం. “నా అదృష్టం సంగతి నాకు తెలుసు, నీది నీకు తెలుసు తగాదా ఎందుకు?” అని మాత్రమే. అంటే రాజేశ్వరి తన అదృష్టాన్ని ఒప్పించడంలోని నిరాసక్తత మాత్రమే.
3)”జీవితం సుందరమైన స్వప్నం వలె, ఆ ఎడారి పుణ్యభూమివలె……” అని తన గతాన్ని నెమరు వేసుకున్నప్పుడు, “ఆ ఆకర్షణ అర్థమయ్యే హృదయం వుండాలికదా…” అని చెప్పినప్పుడు తన చేసిన పనిలో తప్పేమీలేదని రాజేశ్వరి చెప్తున్నట్టా?
–అవును. తను చేసిన పనిలో రాజేశ్వరికి ఏ తప్పూ కనిపించలేదు. “ఆ ఆకర్షణ అర్థమయ్యే హృదయం వుండాలి గదా” అనడంలో కూడా “నా అదృష్టం సంగతీ, నా స్వర్గం సంగతీ మీకు అర్థం కాదు, అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరమూ నాకు లేదు.” అని చెప్పడమే!
మైదానం చదివి పదేళ్ళ పైన అయింది. అయినా మీరు రాసిన వాక్యాలు చదువుతూంటే అది నిన్నో మొన్నో చదివినట్లనిపిస్తోంది.
–ప్రసాద్
http://blog.charasala.com
chalam at the last days of his life went to ramana maharshi and then he changed alot..then in one situation he gave a statement ” burn down all my workings..they r all crap…”
srujana’s ccmment correctly and exactly describe chalam’s novels
s n rao
12 nov 07
స్త్రీ స్వాతంత్ర్యం అని చెప్పిందీ చలమే, నేను రాసిందంతా చెత్త కాల్చేయండి అన్నదీ చలమే! రెండు విషయాలు చెప్పింది చలమే అయినప్పుడు పాఠకులు తమకేది నచ్చితే ఆ విషయాన్నే గ్రహిస్తారు. ఇక్కడ చలం ఏం చెప్పడన్న దానికన్నా మనకేది నచ్చిందన్నది ప్రశ్న.నా వరకూ ఆశ్రమం వెళ్ళిన చలం కంటే మునుపటి చలమే మేలనిపిస్తుంది.
chalam novels koni chadivitini kani naku aradham kani chala yunavi. chalam novles chala varku lady ki freedom kosam chala varku vrasaru. naku aradham kanidi ladi ki freedom kavalsindhi economic freedom,laka, only kamasukhama. naa abhiprayam prakaram lady ki economic freedom yundali kani,mana sampradayalu,mana kathubhatulu gaali ki vadilayadam yanta varku correct. naa drustilo chalam kana viswanada satyanarayana gari rachanlo lady ki economic and education importance chala yuntayi. ide na abhiprayam. yantavarku correct meeru chapakalaru.
ఈ లోకంలో మగ వాడికి ఎంత స్వేఛ్చ ఉందొ ఆడదానికి కూడా అంత స్వేఛ్చ ఉండాలి/కావాలి, even, తప్పులు చేయడంలో నైనా సరే. ఇదీ చలం చెప్పేది.