We the people

by admin@ 24fps

ఇక్కడ మా ఊర్లో(Reading,UK) Art of Living వాళ్ళు సమావేశమవుతున్నారని తెలిసి నన్ను కూడ రమ్మని పిలిస్తే మొన్న వారాంతంలో వెళ్ళాను. అంతకు ముందు ఒక సారి వెళ్ళినప్పుడు కొన్ని యోగసూత్రాలు అవీ ఇవీ చెప్పరు. చేసినంతసేపు బాగానే ఉంది కానీ ఇంటికి వచ్చాక మర్చిపోయానా విషయాన్ని. ఈ సారి వెళ్లినప్పుడూ జనాలు కాస్త ఎక్కువే వున్నారు. ఒకాయన తన గానామృతంతో ప్రజల్ని పరవశింపజేశాడు. ఆయన చేస్తున్న శివుడు మరియు బుధ్ధుని మంత్రోచ్చారణల్తో పారవశ్యంలో మునిగిపోయి తన్మయత్వం చెందారు అక్కడి జనాలు. అరమోడ్పు కన్నులతో సగం మనసా మంత్రాల మీద , సగం మనసు మనుషుల మీద పెట్టి అటూ ఇటూ అయిపోయాను.అక్కడి మనుషులను చూసి ఆశ్చర్యపోయాను.

ప్రశాంతమైన వాతావరణం లో హాయిగా అన్ని బాధలు మరిచిపోయి ఆనందడోలికల్లో మునిగిపోయిన ఈ మనుషుల్ని చూసి సిగ్గుపడిపోయా. నాలోని cynic kaaసేపు నిద్రపోయాడు. ఆహా! ప్రపంచంలో శాంతి , ఆనందం వెల్లివిరిసే రోజులు ఎంతో దూరంలో లేవనిపించింది. నాకు తెలిసిన వాళ్ళందరికీ Art of living కోర్సుని పరిచయం చేయాలని గట్టిగా నిర్ణయించేసుకున్నాను.

ఇంతలో స్టేజి మీదున్నాయన తన పాట ఆపాడు. “చూసారా మనసు ఎలా ప్రశాంతంగా వుందో! ప్రతిరోజు మీరు ఒక గంట సేపు ఇలా ప్రశాంతంగా గడిపితే మీజీవితం సుఖమయం అవుతుంది” అని భోధించాడు. అతను చెప్పింది నిజమేననిపించింది నాకు. అతను చెప్పడం ఆపగానే ముందు వరసలో కూర్చున్న కుర్రాడొకడు మైకు తీసుకుని ఒక అరగంట సేపు మరో భజన చేపించాడు ప్రజలందరిచేత. ఈ లోపల మరో వ్యక్తి వెనకనుంచి వచ్చి ముందు వరసలో కూర్చుని మైకు లాక్కోవడానికి సిధ్ధమైపోయాడు. ఆ రెండో వ్యక్తికి మైకు దొరికేలోపే ఎక్కడినుంచో వచ్చింది ఒకావిడ. అప్పటివరకూ అక్కడ జరిగిన కార్యక్రమంలో పాలుపంచుకోలేదామె. రాగానే హార్మొనీ పెట్టె ముందు కూర్చుని తన హిందుస్తానీ సంగీత ప్రతిభను చూపించేసింది. తన అవకాశాన్ని ఆమె పుచ్చుకుందని గుర్రుగా ఆమెనే చూస్తుండిపోయాడా రెండో కుర్రాడు. ఆవిడ అక్కడున్నఒక ప్రముఖ వ్యక్తికి సంగీతం నేర్పిస్తుందట. ఆ వ్యక్తి తన influence ఉపయోగించి తన గురువుకి పాడే అవకాశం కల్పించి తన గురుభక్తిని చాటుకున్నారు.

ఆమె పాడడం ఆపగానే మరో అమ్మాయి పాడడానికి సిధ్ధమయింది. కానీ అంతకుముందు కుర్రాడు పాడాకే తను పాడతానని మొండిపట్టుపట్టింది. ఆమె భర్తేమో ఇలా అయితే జీవితంలో ముందుకు పోలేము అని సనగసాగాడు. ఈ అమ్మయి ఎవరబ్బా అని ఆరా తీస్తే అక్కడ వున్న Art of living సభ్యుల పిల్లలకు సంగీతం నేర్పించే గురువని తెలిసింది.

ఆ రెండొ కుర్రాడూ , ఈ అమ్మాయి పాడాక మరో సారి మైకు లాక్కోబోయాడు మొదటపాడిన కుర్రాడు.ఈ లోపల ఇద్దరు అమ్మలు వారి పిల్లలను తీసుకుని వీళ్ళూ పాడతారు అని ప్రకటించారు. ఈ గందరగోళం చూసి అప్పటివరకూ శాంతి శాంతి అన్నాయన కాస్త చిరాగ్గా టైము లేదు మరో సారి పాడుతారులే అని వారిని వారించాడు. ఆ ఇద్దరమ్మల్లో ఒక అమ్మ కాస్త నొచ్చుకుని తన పిల్లల గురువు దగ్గరకొచ్చి , “ఇందాక మీరు పాడినప్పుడే పిల్లలనూ పిలవాల్సింది” అని అంది. దాంతో ఈ అమ్మాయి కాస్త బాధ్పడింది. ఆమె భర్త “పోనీలే ఎవరైనా ఒక అవకాశం కోసమే గా ప్రయత్నిస్తారు. ఫెర్ఫొర్మ్ చెసే అవకాశం లేనప్పుడూ నేర్చుని ఏం లాభం” అనేసాడు.

అప్పటివరకూ అక్కడున్న ప్రశాంతతపోయిది. మనందరం ఒక్కటే అన్న గ్రూపు మెంటాలిటి పోయి “నేను” , “నేను” అని గందరగోళం సృష్టించారు. దాంతో అప్పటివరకూ నా కళ్ళెదుట కమ్ముకున్న మేఘాలు తొలిగిపోయాయి. ఒక Art of living మాత్రమే కాదు, కుండలినీ , క్రియ యోగా , విపాసన లాంటి ఎన్ని వచ్చినా ప్రజలు అంత సులభంగా మారరని అర్థ్మైపోయింది. కాకపోతే Art of living రవిశంకర్ లాంటి వాళ్ళూ ప్రజలను కొద్దోగొప్పో మార్చగలరేమో కానీ , ప్రజల్లో మొత్తానికి మార్పు కావాలంటే ముందు తనని తాను మార్చుకోవాలేమో అని ఆలోచిస్తుంటే ఎప్పుడో చదివిన శేషేన్ రక్త రేఖ నుంచి ఒక వ్యాసం నా మదిలో మెదిలింది.

(శేషేన్ రక్త రేఖ నుంచి)

ప్రజలు ఎవరు ?

మొహంమీద మొహం పెట్టి ఆవులించేవాళ్ళు ; మనమీద దగ్గేవాళ్ళు ; హొటళ్ళలో చిన్న చిన్న గదుల్లో క్రిక్కిరిసి కూర్చుని , సిగరెట్ల పొగలో మునిగిపోయి, ప్లేట్లమీద చంచాలతో నీచమైన చప్పుళ్ళు చేస్తూ తింటూ వుండేవాళ్ళు ;- దేనికోసమో ఓట్లిచ్చేవాళ్ళు, డబ్బుకు గడ్డితినేవాళ్ళు, ప్రతిదానికీ భయపడి పారిపోయేవాళ్ళు; అన్ని అన్యాయాలకూ నోరుమూసుకొని పడివుండేవాళ్ళు- ఇలా ఎన్నో ఉన్నాయి వాళ్ళ లక్షణాలు! అనిర్వచనీయమైన ఒక ముడి పదార్థం వాళ్ళు. గోధుమపిండిని మనం వాడుకున్నట్లు వాళ్ళని వాడుకుంటారు రాజకీయవాదులు.

కానీ వాళ్ళలో ఒక భగవదంశ వుంది. సామూహికంగా వున్నప్పుడు అది కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ ఆలోచనలు కుడా వ్యక్తిగతంగా వుండవు ; ఒక సామూహిక స్పృహ ఒక నూతన చేతనని రగుల్కొల్పుతుంది. వాళ్ళు ఆ దశలో వున్నప్పుడు ఎంత ఎత్తుకయినా వెళ్ళగలరు. చరిత్ర సృష్టించగలరు. ఎవడో ఒకడు సూత్రధారుడు కావాలి దీనికి. సృష్టిలో మనిషి ఉత్తమ పరిణామస్థాయి చేరే వరకు ప్రజలకు మహానుభావుల నాయకత్వం తప్పదు.