Cannes-2007

by admin@ 24fps

Cannes Film Festival మొదలయ్యి ఇప్పటికి 60 ఏళ్లయింది. ప్రపంచసినిమాలోని ఆణిముత్యాల్లాంటి సినిమాలను గుర్తించే వేదికగా ఈ Film Festival కున్నంత ప్రఖ్యాతి మరే Film Festivalకు లేదనడంలో అతిశయోక్తిలేదు. మన సత్యజిత్ రేని మొదటిగా గుర్తించి అతని సినిమాలకు ప్రపంచ సినిమాల స్థాయిలో గుర్తింపు కలుగచేయడంలో Cannes Film Festival పాత్ర ఎంతో ఉంది. ఈ సినిమా పండుగ ఈ సారి ఎంతో ఆసక్తి కరంగా ఉండబోతుందని సినిమా పండితులు అంచనాలు వేస్తున్నారు.అందుకు చాలా కారణాలే ఉన్నాయి.

Hongkong కి చెందిన Wang Kar Wai మొదటి ఆంగ్ల చిత్రమైన My Blueberry Nights చిత్రంతో ఈ సినిమా ఉత్సవం మొదలవబోతుంది. Cannes Film Festival లో Wang Kar Wai చిత్రాలు ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణ.

Palme d'Or అవార్డు కోసం పోటీ పడుతున్న చిత్రాలివే

  • MY BLUEBERRY NIGHTS -WONG Kar Wai
  • AUF DER ANDEREN SEITE – Fatih AKIN
  • UNE VIEILLE MAÎTRESSE – Catherine BREILLAT
  • NO COUNTRY FOR OLD MEN – Joel & Ethan COEN
  • ZODIAC – David FINCHER
  • WE OWN THE NIGHT – James GRAY
  • LES CHANSONS D'AMOUR – Christophe HONORÉ
  • MOGARI NO MORI -Naomi KAWASE
  • SOOM – KIM Ki-duk
  • PROMISE ME THIS – Emir KUSTURICA
  • SECRET SUNSHINE – LEE Chang-dong
  • 4 LUNI, 3 SAPTAMINI SI 2 ZILE – Cristian MUNGIU
  • TEHILIM – Raphaël NADJARI
  • STELLET LICHT – Carlos REYGADAS
  • PERSEPOLIS – Marjane SATRAPI & Vincent PARONNAUD
  • LE SCAPHANDRE ET LE PAPILLON -Julian SCHNABEL
  • IMPORT EXPORT – Ulrich SEIDL
  • ALEXANDRA – Alexander SOKUROV
  • DEATH PROOF – Quentin TARANTINO
  • THE MAN FROM LONDON – Béla TARR
  • PARANOID PARK – Gus VAN SANT
  • IZGNANIE – Andreï ZVIAGUINTSEV

 Wang Kar Wai తో పాటు Qunentin Tarantino తన Death Proof తో, Gus Van Sant తన Paranoid Park తో, Coen Brothers తమ No Country for Old Men సిన్మా తో, ప్రశంశాత్మకమైన Palme d'Or అవార్డు కోసం పోటీ పడుతున్నారు.

వీరే కాకుండా Bela Tarr, Alexander Sukorov, Kim-Ki Duk, Faith Akin, David Fincher లాంటి మహామహులు తమ సినిమాలతో ఈ పండుగకు తమ సినిమాలను తీసుకొస్తున్నారు. ఇంత మంది ప్రముఖుల సినిమాలు ఒకే వేదికపై ప్రదర్సిపబడటమే కాకుండ ఒక దానితో ఒకటి పోటి పడుతుండడం ఈ మధ్య కాలంలో నాకు తెలిసి జరగలేదు.

కాకపోతే Quentin Tarantino సినిమా Death Proof ఇప్పటికే చాలా చోట్ల ప్రదర్శిపబడింది.మరీ అంత బాగోలేదని అన్నరు చాల మంది. అలాగే David Fincher Zodiac చూసిన వాళ్ళుకూడా ఫర్వాలేదని మూతివిరిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా Wang Kar Wai సినిమా My Blueberry Nights సినిమాకి Christopher Doyle సినిమాటోగ్రఫీ చేయలేదన్న సత్యాన్ని జీర్ణీంచుకోలేకపోతున్నారు ఆయన ఫ్యాన్స్. మన రవి శంకర్ కూతురయిన Norah Jones కి ఇదే మొదటి సినిమా! ఈ రోజు ( May 16)నుంచి సినిమాపండుగ మొదలు. కానీ మన సినిమాల చాయలేవి ఇక్కడ కానరావటంలేదు.అయినా మనకు Cannes ఎందుకులే మనకే బోల్డన్ని సినిమా పండుగలు, అవార్డు మహోత్సవాలు ఉన్నాయిగా!