Tim Sennitt

by admin@ 24fps

ఎక్కువగా తైల వర్ణ చిత్రాలతో నిండిపోయిన ప్రదర్శనలో అక్కడక్కడా కొంతమంది తాము తీసిన ఛాయాచిత్రాలను కూడా ప్రదర్శించారు. వారిలో Tim Sennitt ఒకరు. ఈయన తీసిన ఫోటోలు చూడగానే "ఆ ఇందులో ఏముంది. మనక్కూడా ఒక ఫొటో ఇచ్చి, రెండుగంట సేపు కంప్యూటర్ లో Adobe Photoshop తో కుస్తీ పడితే మనమూ ఇంతకంతే మంచి బొమ్మలే ఇత్పాదించవచ్చు" అని చాలా మందికి (నాకులాగే) అనిపిస్తుంది. నిజానికి అలా అనుకోవడంలోనే మనం పప్పులో కాలేస్తాం. Tim Sennitt ఛాయాచిత్రాలు చూడ్డానికి కంప్యూటర్ లో రంగులు సవరింపబడ్డాయని అనిపించినప్పటికీ, అలా అనిపించేలా తన కెమెరాతో చిత్రాలను బంధించడమే ఇతని ప్రత్యేకత.Tim Sennitt's work represents the way he sees the world-not philosophically, but quite literally. His aim is to see, capture and most importantly, share the overwhelming excitement that he exeriences – the adernalin rush.