Kafka on the shore

by admin@ 24fps

"నువ్వు పితృహత్య కావించి,తల్లి,అక్కలతో సంయోగం జరుపుతావు" అన్న తండ్రి జోస్యం నిజం కాకుండా చేయాలని 'కాఫ్కా తమురా' అనే పదిహేనేళ్ళ కుర్రవాడు టోక్యో లోని తన ఇంట్లోంచి పారిపోవడంతో కథ మొదలవుతుంది.టోక్యో నుంచి షికోకు వెళ్ళే బస్సులో కాఫ్కా 'సకురా' అనే ఒక అమ్మాయి తో పరిచయం పెంచుకుంటాడు. అక్కడ కొన్ని రోజులు గడిపి చివరకు షికోకు నగరం లో ఊరి చివరనున్న ఒక గ్రంధాలయం చేరుకుంటాడు. అక్కడ ఒషిమా అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. ఒషిమా సాయంతో గ్రంధాలయంలో ఉద్యోగం సాధిస్తాడు. అక్కడే కాఫ్కా 'ష్యాకి ' అనబడే ఒక యాభై ఏళ్ల ఒక మహిళను కలుస్తాడు.ఆమె పరిచయం కాఫ్కా జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది.ఇదిలా ఉంటె కాఫ్కా ఇల్లి వదిలి పారిపోయె సమయానికి టోక్యో నగరంలో 'నకతా' అన్న ఒక వౄద్ధుడు విచిత్రమైన పరిస్థుతుల్లొ ఇల్లు వదిలివచ్చేస్తాడు. నిజానికి 'నకతా' మూగవాడు. చిన్ననాడెప్పుడొ జరిగిన ఒక విచిత్ర సంఘటనలో అతనలా మారిపోతాడు. అతను మనుషలతొ మాట్లాడలేడూగాని పిల్లిలతో మాత్రం బహు చక్కగా మాట్లాడగలుగుతాడు. తప్పిపొయిన ఒక పిల్లిని వెతికే ప్రయత్నంలో అతనికెదురైన కొన్ని విచిత్ర  పరిస్థితులు టోక్యో వదిలి వెళ్ళేలా చేస్తాయి. 'కాఫ్కా తమురా' మరియు 'నకతా' ల పయనం లొ ఎదురైన విచిత్రమైన పరిణామాలు , సంఘటనలు తో కూడుకున్న కథే Kafka On The Shore. అసలీ నవలలో కథేంటని అడిగితే చెప్పడం చాలా కష్టం. ఒక విధంగా Haruku Murakami పుస్తకాలన్నీ ఇంతే. అతని పుస్తకాలలో చెప్పనలివికాని అనుభూతులు, మాటలకందని అనుభవాలు ఎన్నో ఉంటాయి. అవన్ని చదివి అనుభవించాల్సిందేగాని ఒకరు చెప్తే అర్థంకాదు. ఒక్క మాటలొ చెప్పాలంటే చెప్పనలివికాదు.కలలప్రపంచంలొకి తీసుకెళ్ళి పాఠకులను సంభ్రమాస్చర్యాలలొ ముంచితేల్చడం Haruki Murakami కి తెలిసినంతగా మరెవెరకి తెలియదనుకుంటా. గ్రీకు చరిత్రలోని myth of Oedipus ఆధారం చేసుకుని, తోడుగా కొంచెం ఆత్మ స్వరూపత్వము, స్వప్న సౌందర్యము, శృంగారాలను జోడించి స్వైర కల్పిత సమ్రాజ్యానికి పాఠకులకు స్వాగతం పలికే ఈ పుస్తకం చదివే కొద్దీ ఎంతో ఆసక్తి కరంగా ఉంతూంది. కేవలం ఒక్క సారి చదివితే మనకంత అర్థంకాకపోవచ్చు గాని, చదివిన ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరింప చేయగలిగే సత్తా ఈ పుస్తకానికి ఉందన్నది మాత్రం నిజం. ఇది ఏదో ఊసుపోక చదవాలనుకునే నవల మాత్రం కాదన్నది తెలుసుకోవాల్సిన నిజం. సాదా సీదా కథలు , కథనికలు కాకుండా, magical realism, surrealism లాంటి సాహిత్యం ఇష్టపడే వారికి ఈ పుస్తకం షడ్రుచుల విందు భోజనమే! కాకపోతే నవల ముగింపు కాస్తా హడావుడిగాను, గందరగోళంగాను ఉంటుందన్నది మాత్రం నగ్న సత్యం. ఏదేమైనప్పటికి మంచి పుస్తకం చదవాలని కోరిక కల వారు తప్పక చదవవలిసిన పుస్తకం Kafka On The Shore. రచయిత గురించి: హరుకి మురకామి జపాను కు చెందిన ఒక ప్రముఖ రచయిత. ఈయన గతంలో Norwegian Wood, The Wind-up Bird Chronicle, లాంటి ఎన్నో నవలలు ప్రచురించాడు. ఇతని రచనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతొ ప్రఖ్యాతి గాంచాయి. ప్రస్తుతం జపాను సాహిత్యానికి కల విఖ్యాత ప్రాచుర్యానికి ఒక విధంగా ఈయన రచనలే కారణం అని చెప్పొచ్చు.పెద్ద పెద్ద నవలలు చదవడం ఇష్టం లేని వాళ్ళు ఈయన రాసిన కథనికలు చదివి ఆనందించవచ్చు. ఈయన రాసిన కథలు, కథానికల సంగ్రహాలయిన Blind Willow Sleeping Woman, After the Quakeమరియు Elephant Vanishes, అతని నవలలలాగే ఎఓతో ప్రాచుర్యము పొందాయి. మన చుట్టూ ఉండే మనుషల స్వభావాలను అక్షర రూపంలొ తన కథల్లోని పాత్రల ద్వార మన కళ్ళముందుంచుతాడు 'Haruki Murakami'.