Amitabh

by admin@ 24fps

మితాబ్ బచ్చన్ మంచి నటుడే! కాని రోజు రోజుకి అతని ప్రభావం సినిమాలపై ఎక్కువైపోతుందని నా అభిప్రాయం.అవసరమున్నా లేకపోయినా అతన్ని ఎలాగోలా తమ సినిమాల్లో ఇరికించేసి మా సినిమాలోను బచ్చన్ ఉన్నాడంటూ సినిమాలనమ్ముకోవడం పరిపాటయిపోయింది.

పోనీలే చిన్న పాత్రలే కదా ఎలాగో భరించేద్దమనుకుంటె ఈ మధ్య మన్ రాం గోపల్ వర్మ తీసిన నిశ్శబ్ద్ సినిమా ద్వారా మరొక ట్రెండ్ మొదలయినట్టు అనుమానం కలుగుతుంది. అరవై ఏళ్లు పైబడ్డ ముదుసలి ఇరవై ఏళ్ళైన నిండని కన్నెపిల్ల తో ప్రెమలో పడడం నిశ్శబ్ద్ కథాంశమ్ని మనకు తేలిసిందే. ఇప్పుడు ‘చినీ కం’ అనే మరో సినిమాలో కూడ మన బచ్చన్ గారు ఇలాంటి పాత్రనే పోషిస్తున్నారట.
ముప్పైనాలుగేల్ల యువతితో ప్రెమలో పడె నేపథ్యంతో నడిచే ఈ ‘చినీ కం’ ని ప్రెక్షకులు ఏ మాత్రం ఆదరిస్తారో తెలియదు కాని, ఈ సినిమా హిట్టైపొతే అమితాబ్ తో ప్రేమకథలు తీయడానికి క్యూ కడ్తారేమో  నిర్మాతలు, దర్శకులు? ‘చిని కం’ మాటేమోగాని సినిమాల్లో ‘అమితాబ్ కం’ అనిపించుకోకముందే రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకోమని సలహా చెప్పే అర్హుడిని కాదని తెలిసినా మనసాగటంలేదు.

అమితాబ్ ప్రాభవం ఇలానే మరి కొన్ని రోజులు నడిస్తే దాని ప్రభావం ఎల ఊంటుందో ఊహించలేము. ప్రతి సిన్మాకి ఒక ఎడిటర్, డైరెక్టర్ ఉన్నట్టు ప్రతి సినిమాకి ఒక అమితాబ్ కూడ ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో! అయినా ఫర్వాలేదనుకోండి మన షారూక్ ఖాన్, అభిషేక్ బచ్చన్లు ఉన్నారనుకోండి. కాని ఇలా చేయడం మంచిదేనంటారా? ఏమోలెండి! పెద్దోల్ల విషయాల్లో తలదూర్చడం మెందుకు, చూసీ చూడనట్టు వదిలేస్తే పోలా?