Oasis
by admin@ 24fps
నిన్న రాత్రి Wembley (London) లో సౌమ్య కచేరి ఉందని తెలిసింది. గంటన్నర పాట మూడు trains లో ప్రయాణం చేసి సాయంత్రం ఆరింటి కల్లా Wembley చేరుకున్నాము.7 పౌండ్లు టికెట్, అంటే షుమారు 600 రూపాయలు మన డబ్బుల్లో. కచేరి తర్వాత భోజనాలు కూడా ఉండడం మరియు ఇక్కడి standards తో పోలిస్తే టికెట్ వెల అంత ఏక్కువకాదనిపించింది. కచేరి కి R కూడా నాతో పాటు వచ్చింది. నిజానికి నేనే R తో పాటు వెల్లానని చెప్పడం సబబు. శాస్త్రీయ సంగీతం పై నాకు కొద్దో గొప్పో ఆసక్తి కలగచేసినందుకు నేను R కి చిరకాలము ఋణపడి వుంటాను
6:15 కి మొదలవ్వాల్సిన కచేరి, మన IST ప్రకార ఒక గంట లేటు గా షుమారు 7 గంటల ప్రాంతంలో మొదలయింది. కానడ రాగం లో ‘నెరనమ్మితి’ అన్న అట తాళవర్ణంతో మొదలుపెట్టి, మాయామాళవగౌ రాగంలోని ‘తులసి దళములచే’ అన్న త్యాగరాజుల వారి కృతితో కచేరి కి ఆరంభం పలికింది సౌమ్య. ఆ తర్వాత సహన రాగంలో రాగాలాపన చేసి, ‘చిత్తం ఇరంగాదదేనయ్యా’ అన్న తమిళ కృతి పాడిన తర్వాత కుతళవరాలి రాగంలో స్వాతి తిరునాల్ రచించిన ’బోగీంద్ర సాయినం’ తో పాటు శంకరాభరణం లో రాగాలాపన చేసి ముత్తుస్వామి దీక్షితులు శివుని ఆరాధిస్తూ రచించిన ‘అక్షయలింగ విభో’ కూడ పాడి రసహృదయులను మైమరిపించింది సౌమ్య.
పక్కనున్న మృదంగ వాద్యకారుడు ఇంకా మనకి కేవలం అరగంట మాత్రమే సమయముందని సౌమ్య చెవిలో గుసగుసలాడడంతో మరో నాలుగు చిన్న పాటలు పాడి కచేరి ముగించింది సౌమ్య. పైన పేర్కోన్న కృతులతో పాటు గా, ‘కాదలెన్నుం తీవినులే రాధే రాధే’ -కమాస్ రాగం, స్వాతితిరునాళ్ రచించిన భజన ‘రామచంద్ర ప్రభూ’ – సింధుభైరవి రాగం , దుర్గా రాగంలోని ‘ఈ ముద్దుకృష్ణ నా’ తోపాటు పూర్ణచంద్రిక రాగంలోని తిల్లాన, సౌరాష్ట్రం రాగంలోని ‘పవమాన’ అన్న పాటతో ఆనాటి కచేరికి మంగలం పలికింది సౌమ్య.
ఆరేల్ల క్రితం మొదటి సారిగా అసలీ సంగీతంలో ఏముందో తెలుసుకోవాలని ఒక ఆడియో C.D కొన్నప్పుడు అందులో నేను విన్న మొదటి పాటయిన ‘తులసి దళములచే’ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత సౌమ్య నోటినుంచి అది లండన్లో వింటానని, ఆ రోజు మా ఊర్లో చెట్టుకింద పడుకుని పాట వింటున్నా నేను కలలోనైనా ఊహించలేదు.
నిన్న జరిగిన కచేరిలో ఒక విశేషమేమిటంటే సౌమ్య పాడిన పాటల్లో రెండు పాటలు స్వాతి తిరునాల్ చే రచింపబడ్డవి. ట్రావెన్కోర్ మహరాజా అయిన స్వాతి తిరునాళ్, కన్నడ, మలయాళం, తెలుగు,తమిళ్ హింది, సంస్కృతం తోపాటు ఇంగ్లీషు, ఒరియా, బెంగాళి భాషల్లో ధారాలంగా మాట్లాడగలిగే వాడట.
షుమారు 60 మందికి పైగానే రసహృదయులు కచేరికి హాజరయ్యారు. గత వారంరోజులుగా సౌమ్య london లో కచేరిలు చేస్తుండగా ప్రతి దగ్గరా ’sold out’ గా నడిచాయి కచేరిలు.మన శాస్త్రీయ సంగీతానికి ఇంకా మంచి ప్రాచుర్యమే ఉందని సంతోషం కలిగింది. కాకపోతే అక్కడి వాల్లలో నేనోక్కడినే తెలుగు వాడినవడంతో కాస్త బాధ కలిగింది. ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన తెలుగు వాళ్ళకి తమిలోళ్ళతో పోలిస్తే కళాపోషణ తక్కువే అని చెప్పాలి.
కచేరి తర్వాత సౌమ్య తో కాసేపు మాట్లాడి, కడుపునిండా భోజనంచేసి ఇంటికి బయల్దేరుతుండగా బాలు రఘురామన్ (వయోలనిస్ట్ ) నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాననడంతో అతనితో కలిసి హాయిగా కార్లో ఇంటికి బయల్దేరాం.
దారిలో బాలు తను నిజానికి తెలుగు వాడినని, తమిల్నాడు సెటిల్ కావడం మూలాన తమిళంలో మాటలాడుతానని చెప్పడంతో మనసు కాస్తా ఊరట చెందింది. R తో బాలు కి మంచి పరిచయం కలిగింది. వచ్చేవారం నుంచి బాలు ఇంట్లో సంగీత సాధన చేయాలని R నిర్ణయించుకొంది. ఆరు నెలలగా UKలో మంచి గురువు కోసం వెతుకుతున్న R కు, ఎడార్లో ఒయాసిస్ లా గురువు-నేస్తం బాలు రూపంలో దొరికినట్లయ్యింది.
If you want to know more about Balu read this.
Comments
మీరన్నది నిజమే తెలుగువాళ్ళకి కళాపోషన తక్కువ.నాలాంటి కొంత మంది కి అమెరికా వచ్చాకనే కాస్త ఇలాంటి వాటి మీద ఆశక్తి పుట్టుకొస్తుంది.ఇన్ని విషయాలు విపులంగా చెప్పారు మరి” R “అంటే ఏమిటో మాత్రం చెప్పలేదు.
చాలా బాగుందండి టపా.
లండన్ లో మన శాస్త్రీయ సంగీతం కచేరీలు జరుగుతాయని తెలిసి సంతోషం.
నేనిప్పుడు లండన్ లో ఉద్యోగం వెతుక్కుంటున్నా..
మీ టపా చదివి motivation పెరిగింది.
చాలా సంతోషం. కష్టభూయిష్టమైన ఈ మానవజన్మలో మనల్ని దైవత్వానికి దగ్గరగా తెచ్చేవి పసిపిల్లలూ, సంగీతమూ – ఈ రెండేనని నేను గాఢంగా నమ్ముతాను. అందులోనూ కర్ణాటక సంగీతం మరీనూ. సౌమ్య ఈ తరపు గాయనీ మణూలలో మంచి విద్వత్తు ఉన్న కళాకారిణి.
పర్లేదండీ వెంకట్ గారూ, తెలుగు వారు కర్ణాటక సంగీతాన్ని బాగానే అభిమానించి పోషిస్తున్నారు, అంత దిగాలు పడనక్కర్లేదు.
r tho velithe anthe antha baaguntundi