Sequel mania
by admin@ 24fps
తెలుగు సినిమా చరిత్రలోని రికార్డులన్ని తిరిగిరాసిన పోకిరి చిత్రానికి రెండో భాగం తీస్తారని ప్రకటించి పూరి జగన్నాధ సంచలనం సృష్టించారు.మన తెలుగు సినిమాల్లో సీక్వేల్స్ తీయడంలో కొత్త కాకపోయినప్పటికి, హిట్టయిన సినిమాకు రెండో భాగం నిర్మించి success సాధించిన సినిమాలేవి లేవనే చెప్పాలి. కాని Hollywood లో ఏనాటి నుంచో సీక్వేల్స్ తీయడమనేది మరో successful సూత్రం.
గత కొద్దిరోజులుగా Spider man-3, Shrek-3,Fantastic four-2, Pirates of the Carribean-3 మాత్రమే కాకుండా, అంతకుముందొచ్చిన 28 days later అన్న సినిమాకు తరువాయి భాగంగా 28 weeks later అన్ సినిమాకూడా త్వరలో మన ముందుకు రాబోతుంది.
ఒక వైపు pirates of the carribean కోస0 ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండగా spider man తనలో తనే పడే మానసిక సంఘర్షణ ను త్వరలో రాబోయే మూడో భాగంలో మనం చూడొచ్చు.
సాదారణ comic strip దగ్గర్నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన spider man క్యారెక్టర్ ఇప్పుడు తనలోని చెడుని, మంచితనం ద్వారా పోరాటం జరపడం ద్వారా ఈ సినిమాకొక ఫిలాసఫిక్ కోణాన్ని చేర్చడం వినూత్నంగానే వుంది కానీ ఈ సినిమాలన్నింటిలో ఏవి హిట్టవుతాయో, ఫట్టవుతాయో వేచి చూడాల్సిందే!
పైన పేర్కొన్న సినిమాలే కాకుండా మొన్నీ మధ్యనే వచ్చిన Rocky కూడా ఒకప్పటి Rocky-series సినిమాలకు సీక్వేలే. ఇదే కాకుండా త్వరలో రిలీజ్ కాబోతున్న Die Hard -4.0 కూడా ఈ కోవలోకే చెరుతుంది.
మొన్న మొన్నటి వరకు పాత సినిమాలను తిరిగి రిమేక్ చేయడంలో మునిగిపోయిన Hollywood ఇప్పుడు సీక్వెల్స్ కి పెద్ద పీట వేసినట్టుంది కదా!
నిజానికి special effects పై ఆధారపడ్డ సినిమాలకే sequels ఎక్కువగా ఎందుకుంటాయో ఆలోచించారా?
Comments
test comment
Ocean’s Thirteen కూడా ఉంది !!
special effects పై ఆధారపడ్డ సినిమాలకే sequels ఎక్కువగా ఎందుకుంటాయో ఆలోచించారా?
మీరే చెప్పండి ఎందుకుంటాయో !!