Clarity

by admin@ 24fps

వరుసగా మూడు రోజులు శెలవులు రావడంతో ఇంట్లో తిష్టవేసి ఏ సినిమా చూడాలో, ఏ పుస్తకం చదవాలో , ఎలాంటి సినిమాలు తీయాలో, ఏ వీడియో ఎడిట్ చేయాలో ఆలోచిస్తూనే సగం కాలం గదిచిపోయింది. ఈ రెండు రోజుల్లో ఏదైనా ఉపయోగపడే పనేదైనా చేశానంటే అది కేవల నిన్న లండన్ లో సంగీత కచేరికి హాజరుకావటమే!

అదేదో సినిమాలో MS నారాయణని “మీరేం చేస్తుంటారు” అని అడిగితే “ఏం చెయ్యాలో ఆలోచిస్తుంటాను” అని చెప్పే సమాధానం గుర్తొచ్చింది. ప్రస్తుతం నా పరిస్థితి కూడా “same to same” కావడంతో బెడ్ మీంచి అమాంతం దూకి laptop పై వాలాను.

ఏమీ చేయకపోయినా ఫర్వాలేదు, కనీసం బ్లాగులో నాలుగు ఎంట్రిలయినా పోస్టుచేస్తే మన జీవితానికొక అర్థముంటుందని అని నిర్ణయించుకుని రాయడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీరు చదువుతున్నది అదే!

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే ఈ రోజు నుంచి నా కలానికి, మెదడుకి పదను పెట్టాలని, బాగా రాశే ప్రయత్నం చేయాలని అని చాలా గట్టిగా నిర్ణయించేశాను అందులో భాగంగానే నా దగ్గర ఉన్న వందలకొద్ది పుస్తకాల సమీక్షలు, 600 కి పైగా ఉన్న సినిమాలపై విమర్శ, విశ్లేషణలు మాత్రమే కాకుండా నేను ఎలాంటి రచనలు చేయాలనుకుంటున్నానో, ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నానో లాంటి ఎన్నో విషయాలు ప్రతి రోజు బ్లాగు రూపంలో ప్రచురించెయ్యాలని decide అయిపోయాను. ఎవరో చదవాలన్న కోరిక కన్నా మనసులో ఉన్న ఆలోచనలు అక్షరరూపం దాల్చినప్పుడు మన ఆలోచనలకు ఒక clarity వస్త్రుందని నా నమ్మకం.