Sequel to Pokiri

by admin@ 24fps

హాలీవుడ్ లో జాన్ ఫోర్డ్ అనే దర్శకుడు రూపొందించిన వెస్టెర్న్(కౌబాయ్ సినిమాలు) సినిమాల స్పూర్తితో, జపాను కి చెందిన అకిర కురసావ అనే దర్శకుడు ‘యొజింబో’ అన్న చిత్రాన్ని రూపొందించాడు. అదే సినిమాను ఇటలీ లో సెర్జియో లియోనె అనే దర్శకుడు ‘ఏ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డాలర్స్ అనే పేరుతో రీమేక్ చేసి కౌబాయ్ చిత్రాల్లో సంచలనం సృష్టంచాడు. ఆ తర్వాత హాలీవుడ్ లో కూడా ఈ సినిమా ‘లాస్ట్ మాన్ స్టాండింగ్’ పేరు తో రీమేక్ చేయబడింది.

మరి మన పూరి జగన్నాథ్ గారు ఆ మూడు సినిమాల్లో ఎది చూసారో ఏమో గాని, దాదాపుగా అదే కథ, కథనం తో పోకిరి ని రూపొందించారు.మన తెలుగులో హిట్ అని ప్రకటించిన మరుక్షణం తమిళ్ లో రూపొందించడానికి సన్నాహాలు జరిగిపోయాయి. తమిళ్ లో కూడ ఈ సినిమా హిట్ అయిపోవడంతో హిందిలో ఈ చిత్రాన్ని నిర్మించడం కొరకు రీమేక్ రైట్లను పొందడానికి కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారో అర్థం కాదు గాని మొత్తానికి ఎప్పుడొ 1961 లో మొదలయిన ఒక కథ మన దేశాన్ని చేరడానికి 40 ఏళ్ళు పట్టిందన్నమాట.రేపు ఈ సినిమా హిందీలో రిలీజయ్యి పెద్ద హిట్ అయిపోతే హాలీవుడ్ వాళ్ళు మనదగ్గర రైట్స్ కొనుక్కోవలసివస్తుందేమో!

ఏదేమైనప్పటికీ పోకిరి ద్వారా ఒక మంచి సినిమాను తెలుగు వాల్లకు అందించాడూ పూరి జగన్నాథ్. మహేష్ బాబు నటనా చాతుర్యం, ఇలియానా అందాలు అంధ్ర ప్రేక్షకులను ఒక సంవత్సరం పాటుగా సమ్మోహినుతలను చేసింది.పోకిరి 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పూరి జగన్నాథ్ మొన్నీమధ్యనే ఒక పార్టీ ఎర్పాటు చేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్ద్స్ ని బద్దలు కొట్టి, మహేష్ బాబు కి తిరుగులేని హిటిచ్చిన పూరి, పోకిరికి కి సీక్వెల్ తీసే అవకాశం ఉందని ప్రకటించాడు.

పూరి జగన్నాథ్ తెలుసో లేదో కానీ పోకిరి మాతృకైన ‘యొజింబో’ సినిమాకి కూడ ఒక సీక్వెల్ వుంది. ‘సంజురో’ పేరుతో అకిర కురసావ రూపొందించిన ఈ చిత్రం అంతగా ప్రేక్షకాదరణ పొందలేదన్నది మాత్రం జగమెరిగిన సత్యం కావున ‘పోకిరీ సీక్వెల్ కోసం ‘సంజురో’ కథను వాడుకోకుండ మరో మంచి కథకై ప్రయత్నిస్తే మేలని నా అబిప్రాయం.