Alpha Dog

by admin@ 24fps

Story:
Johnny Truelove ఒక డ్రగ్ డీలర్ .తన స్నేహితులైన Frankie, Elvis ల తో కలిసి రోజంతా టివి చూస్తూ, గంజాయి లాంటి మత్తు పధార్ధాలు సేవిస్తూ, తోటి వయసు వారికి డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బులతో రాజభోగాలు అనుభవిస్తూంటారు.చాలామంది అమెరికన్ యువకులలాగే Jake Mazursky డ్రగ్స్ కి అలవాటు పడ్ద ఒక సాదాసీదా మధ్యతరగతి యువకుడు. Johnny Truelove తో Jake Mazursky జరిగిన ఒక డ్రగ్స్ డీల్ లో వచ్చిన అంతరాలు తీవ్రస్థాయి కి చేరుతాయి. Jake తనకు బాకీ పడ్డ డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలా అని ఆలోచిస్తున్న Johny కి అనుకోకుండా Jake తమ్ముడైన Zach తారసపడ్తాడు.Zach ని కిడ్నాప్ చేయడం ద్వారా తనకు రావలసిన సొమ్మును Jake నుండి రాబట్టుకోవాలన్న Johnny ఆలోచన ఎలా బెడిసికొడ్తుందో, ఆ ప్లాన్ తమ జీవితాలను ఎవరూ ఊహించని విధంగా మార్చేస్తుందో అన్నది ఈ సినిమా యొక్క మిగిలిన కథ.

Analysis:
గతంలో ‘John Q’ మరియు ‘The Notebook’ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ప్రశంశలు పొందలేక పోయిన Nick Cassavetes దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ‘Alpha Dog’ ద్వారా సఫలం కాగలిగాడని చెప్పొచ్చు.

ఏడేళ్ళ క్రితం కాలిఫోర్నియా లో జరిగిన యధార్ధసంఘటన లపై ఆధారపడి ఈ సినిమా నిర్మింపబడింది.

2000 లో తన అన్న స్నేహితులచే కిడ్నాప్ కాబడి, వారి చేతిలోనే చివరికి ఘోరమైన మరణాన్ని చవిచూసిన పదిహేనేళ్ళ Nicholas Markowitz జీవితాన్ని ఆధారంగా నిర్మింపబడ్డ ఈ సినిమా కాసేపు నిజజీవితానికి ప్రతిరూపంగాను, మరి కాసేపు నిజజీవితానికి అత్యంత దూరంగాను ఉండటం చేత ప్రేక్షకుల ఆధరణ అంతగా పొందలేక పొయిందన్నది నిజం.

సినిమా లోని మొదటి 30 నిమిషాలు ఎంతో కొంత కొత్తదనాన్ని,నవ కల్పనను ప్రదర్శించినప్పటికీ, సినిమాలోని తర్వాత భాగం, కథనంలో పట్టుకోల్పోయిన కారణంగా పేలవంగా మారి బోరు కొట్టిస్తుంది.

దర్శకత్వ పరంగా Nick Cassavetes తన వ్రత్తి ధర్మానికి దాదాపు న్యాయం చేసినప్పటికీ, తన శైలి, ప్రతిభను మెరుగుపర్చుకోడానికి అవకాశంచాలా ఉంది.

అలనాటి అత్యుత్తమ దర్శకుడైన, John Cassavetes కుమారుడైన Nick దర్శకత్వ శైలి లో కొత్తదనం కనిపించినప్పటికీ, యధార్ధసంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో కొన్ని పాత్రలు, కొన్ని సన్నివేశాలు నిజజీవితానికి చాలా దూరంగా ఉండటం మూలాన, అతని ప్రతిభను పూర్తిగా అంచనావేయడం కుదరదు. కానీ కొన్ని సన్నివేశాలలో Nick చూపించిన దర్శ కత్వ ప్రతిభ,John, Frankie,Jake, Zach పాత్రధారుల నటనా సామర్ధ్యం కోసమైనా ఈ సినిమాను ఒక సారి తప్పక చూడవచ్చు.

Conclusion:
అమెరికా లో నానాటికి తరుగుతున్న మానవత విలువలకు, పెరిగిపోతున్న యువతరపు ఉక్రోషాలకు, పేట్రేగిపోతున్న హింసాత్మకతకు నిలువెత్తు అద్దంపట్టడానిక చేసిన ఒక ప్రయత్నం, alpha dog.