Shadow kill
by admin@ 24fps

నిళల్ క్కుత్తు(shadow kill)-2002-మలయాళం.
దర్శకత్వం:అదూర్ గోపాల కృష్ణన్
ఉపోధ్ఘాతం:
హత్యచేయడం నేరమే!కాని ఒక వ్యక్తిని చంపిన కారణంచేత హంతకుణ్ణి చంపేస్తే, అతన్ని చంపినందుకు ఎవర్ని శిక్షించాలి?
చావుకు చావే సమాధానమా?
ఒక వేళ మరణశిక్ష అమలయ్యాక హంతుకుడు నిర్దోషి అని తెలిస్తే పోయిన ప్రాణాన్ని తిరిగి తేగలమా?
అసలు మరణశిక్ష అవసరమా?
ఇలాంటి ప్రశ్నలు మీ మస్కిష్తంలో ఏప్పుడైనా ఉదయించాయా? అయితే అదూర్ గోపాల కృష్ణన్ దర్శకత్వం వహించిన నిళల్ క్కుత్తు (shadow kill)సినిమా చూడండి.పై ప్రశ్నలన్నంటికీ ఈ సినిమాలో సమాధానం దొరక్కపోవచ్చు గానీ, మనసున్న ఏ మనిషిలోనైన ఇలాంటి ప్రశ్నలను రేపగల సత్తా గల సినిమా నిళల్ క్కుత్తు.కథ:
ఒక దారినపోయే దానయ్య కి అనుమానం వచ్చింది. ‘ఒక హంతకునికి మరణశిక్ష విధించినప్పుడు, ఆ వ్యక్తి మరణానికి బాధ్యత ఎవరు వహిస్తారు? శిక్ష విధించే రాజు గారా? లేక శిక్ష అమలుపరిచే ఉరితీసే వ్యక్తా?’ అని. ఆదే విషయాన్ని మరో దారిన పోయే దానయ్య తో వెలిబుచ్చాడు. అందుకు సమాధానంగా ఆ రెండో వ్యక్తి ఇలా సమాధానం చెప్పాడు. ‘రాజు తెలివిగలవాడు.ఉరిశిక్ష విధించిన వ్యక్తికి చివరి నిమిషంలో క్షమాభిక్ష పెట్టి తన పాపాన్ని తెలివిగా కాలరాసేస్తాడు. కానీ ఈ సమాచారం కారాగారం చేరేలోపే ఉరి అమలైపోయివుంటుంది. ఈ విధంగా రాజు, ఒక వైపు తన పాపమేది లేకుండా చూసుకుంటూనే, మరో వైపు శిక్ష సక్రమంగా అమలయ్యేలా కూడా చూస్తున్నాడు.’మరి అలాంటప్పుడు హంతకుని మరణానికి అమాయకుడైన ఉరితీసే వ్యక్తి పాపం మూట కట్టుకోవాలా? ఇలాంటి భయంతోనే తన జీవితమంతా గడిపిన ఓక ఉరితీసే వ్యక్తి కథే నిళల్ క్కుత్తు.
తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం కలియప్పన్ ఉరితీసే వ్యక్తి గా తన ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. కాని సాటి మనిషి ప్రాణాలని తన చేతుల్తో తీసుకుంటున్నందుకు మనసులో తీవ్రంగా కుంగిపోయి తాగుడుకి బానిసవుతాడు. మరో వైపు కాళీ మాతే తన ద్వారా ఇవన్నీ చేపిస్తుందని నమ్ముతూ కాస్తంత ఊరట చెందుతాడు.
చాలా నాళ్ళగా ఖాళీగా ఉన్న కలియప్పన్ చేతుల్ని మరోసారి రక్తసిక్తం చేయడానికి రాజు దగ్గర నుండి ఆహ్వానం అందుతుంది.అసలే వయసు మీరిన కలియప్పన్ ఈ సారి మరో మరణశిక్షను అమలు పరిచగలడా? ఈ సారి హంతకుడు చేసిన నేరమేమిటి? అతను నిజంగానే దోషా? ఒక వేళ నిర్ధోషి అని తెలిసినా రాజు మాటకు ఎదురు చెప్పగల ధైర్యం కలియప్పన్ లో ఉందా? అని తెలుసుకోవాలని ఉంటే ఈ సినిమా తప్పక చూడవలిసిందే!
విశ్లేషణ:
2002వ సంవత్సరం లో విడుదలైన నిళల్ క్కుత్తు (shadow kill),దర్శకత్వపరంగా గానీ, కథాపరంగా గానీ, సాంకేతికంగా గాని, చిత్రానువాదం విషయంలో గాని ఏ మాత్రం రాజీ పడకుండా అంతర్జాతీయ సినిమాలకు ధీటుగా
నిర్మింపబడిందనడంలో అతినయోక్తి లేదు.మరణశిక్ష గురించి చర్చిస్తూ గతంలో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ అందులో ఎక్కువ శాతం మరణశిక్ష విధింపబడ్డ నిందితుని భావోద్వేగాలపై కేంద్రీకరించబడ్దవి. అందుకు విరుధ్ధంగా ఈ సినిమా ద్వారా ఉరితీసే వ్యక్తి హృదయం లోతుల్లోకి మనల్ని తీసుకువెళ్ళి అతని బాధాపేశాల్ని మనకు పరిచయం చేయడంలో అదూర్ సఫలం కాగలిగారు.
ఇలాంటి సినిమాలను ‘art’సినిమాగా వర్గీకరించి, వీటిలో కన్నీళ్ళు, కష్టాలు తప్ప మరేమీ ఉండవని తక్కువ చేసి చూడడం మూలాన, గతంలో ఇలాంటి సినిమాలు మనకు అంతగా అందుబాటులో ఉండేవి కాదన్నది నిజం.కానీ నేడు ఇలాంటి సినిమాలు dvdల ద్వారా మనందరికి అందుబాటులో ఉన్నాయి. కళాతృష్ణ కలిగిన వారెవ్వరైనా తప్పక చూడవలిసిన చిత్రాలలో అదూర్ గోపాల కృష్ణన్ సినిమాలు ముందుంటాయి.ఇలాంటి సినిమాల్లో ఏముంటుందని అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తారని అనుమానం చాలామంది వెళ్ళబుచ్చడం సాధారణంగా వింటుంటాం. ఒక పాటా లేదు, ఒక ఫైటూ లేదు , ఇదేం సినిమా అని చాలా మంది అభిప్రాయం. సంగీతం, సాహిత్యం లాగే సినిమా కూడా ఒక కళ అని నమ్మేవారేవరైనా ఈ సినిమాలో ఏముందో గ్రహించడానికి ఎంతో సమయం పట్టదు. నాకు తెలిసి ఈ సినిమా లో స్క్రీనేప్లే అత్యంత ప్రత్యేకమైనది. ఇంతకుముందు వచ్చిన ఏ సినిమా లోను లేనటువంటి కథాగమనం ఈ సినిమాకు ప్రత్యేకం.
‘5 పాటలు,5 ఫైటులు,
ఒక కామెడ ట్రాకు,హీరోయిన వళ్ళు చూపించడానికి ఒక సాకు
ఇంటర్వెల్ బ్యాంగు,వీలయితే ఒక ఐటం సాంగు’ గా ఎవరో ఏప్పుడో సృష్టించిన ఒక నమూనా ప్రకారం వందలకొద్ది సినిమాలను ఓ ప్రతి యేడూ కుప్పలతెప్పలగా తీసేసి కమర్షియల్ ఒరవడి లో కొట్టుకు పోతున్న నావ మన సినిమా పరిశ్రమ. కళకు, కళాకారులుకు ఏ మాత్రం స్థానం లేకుండా పోయిన మన సినిమా పరశ్రమను రక్షించాలంటే ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా కొద్దో గొప్పో కనువిప్పుకలిగే అవకాశం ఉంది.సినిమా అంటే నిజజీవితానికి దూరంగా నిర్మింపబడ్డ ఒక అసత్యప్రపంచం కాదు. మన జీవితాల్లోంచి పుట్టుకొచ్చిందే సినిమా. మన రోజు వారీ జీవితాన్ని యధాతథంగా చిత్రించడం సినిమాలయొక్క ఉద్దేశం కాకపోయినప్పటికి, అర్థం లేని మాటలు , తర్కానికందని కథలు, సహజసిధ్ధ్దమైన స్వభావం లేని పాత్రలతో నిండీ పోయిన నేటి సినిమాలకు దూరంగా జీవితంలోని భావావేశాల్ని మనముందుంచే సినిమాలు మన ఆదరణలేకపోతే రాబోయే కాలానికి సినిమాల ద్వారా మనమిచ్చేది కేవలం బికినీలలో ఉన్న హీరోయిన్ల క్యాబరే డ్యాన్సులు, గొంతుచించుకు అరిచే హీరోల అరుపులు మాత్రమే అని మనం గుర్తుంచుకోవడం సబబు.
అదూర్ గోపాల కృష్ణన్ గురించి:
ఇటాలియన్ సినిమా ‘bicyle theives’ తో మొదలైన ‘neo-realism’, ఫ్రెంచ్ సినిమా ‘À bout de souffle’ ద్వారా మొదలయిన ‘new-wave’ అనే సినిమా ఉద్యమాలచే ప్రేరణ చెంది 1972 లో స్వయంవరం చిత్రం ద్వారా చలనచిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టి ఇప్పటివరకూ తొమ్మిది చలనచిత్రాలు, మరో ఇరవైకి పైగా లఘచిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు సృష్టించి, నాలుగు సారి జాతీయ స్ఠాయి లో అత్యుత్తమ దర్శకునిగాను, మూడు సార్లు అత్యుత్తమ కథారచయితగాను అవార్డులు అందుకున్నఘనత కలిగిన అత్యుత్తమ దర్శకుడు అదూర్ గోపాల కృష్ణన్.
Comments
ఈ సినిమా గురించి 2 సం వ క్రితం ఆంధ్రజ్యోతి లో ఒకావిడ చాలా మంచి రివ్యూ రాసారు !!
చూడాలని చాల అనుకున్నాను కానీ కుదరలేదు !!
మళ్ళీ ఇప్పుడు మీ రివ్యూ చూసాక ఎలా గైనా చూసి తీరలని డిసైడ్ అయ్యా !!
థాంక్స్ !!
Exactly, నేను కూడా ఆ రీవ్యూ గురించే చెప్పబోతున్నా… క్రిష్ గారు చెప్పేసారు. నిజం.. అప్పట్నుంచి ఈ సినిమా చూడాలని చాలా తాపత్రేయం గా ఉంది నాకు. ఇప్పుడు అది మరింత ఎక్కువ అయింది…
hi prasad,
i’ve just seen your blog, it’s good. and i’m filmmaker, i just made a short film called “the accident”. i want to every one see my film at my website http://www.jonathanswork.com and let me know your reviews.
thanks,
Jonathan
@వెంకట్ గారు: క్షమించండి. ఇది మీ టపా గురించి కాదు. జొనాధన్ గారి: “ది ఆక్సిడెంట్” గురించి.
@ జొనాధన్, ఆ 17 mins, షార్ట్ ఫిల్మ్ – ది ఆక్సిడెంట్, జీవితంలో ఇంకొక “ఘటన” న గానే కనబడింది. మిగిలింది.
తప్పు చేసిన కార్తిక్ స్నేహితుడు, అన్నట్టు – “పోయిన వాడు,రాడు”. దానికి “మీ” క్లోజింగ్, రవి కుటుంబానికి ఒక ఉత్తరం ముక్క.
“కధ” మీది. ముగింపు మీరు అనుకున్నది.
ఒక చోట టి వి 9 అన్నారు, మరోక చోట “ఛానల్” అన్నారు, అది అలాగే “ఛానల్”గా ఉంటేనే పొయ్యోదేమో.
ఒకటి, రెండు చోట్ల, unconventional camera angles – lights ని ఫరవాలేదు, బాగానే వాడుకున్నారు. ఇంకా బాగా చేసి ఉండవచ్చు.
నెట్ మీద చూసేటప్పుడు, స్క్రీన్ సైజ్, రంగులు, స్క్రీన్ రెజల్యుషన్ కూడ గమనించాలి.
నేపధ్య సంగీతం పూర్తిగా ఇన్స్టృమెంటల్ ఐతే ఒక యూనిఫార్మిటి ఉండేది.
“The Accident” – like many day to day incidents did not leave any mark. It is just an other accident. You can do better, surely!
@వెంకట్: “5 పాటలు,5 ఫైటులు, ఒక కామెడ ట్రాకు,హీరోయిన వళ్ళు చూపించడానికి ఒక సాకు
ఇంటర్వెల్ బ్యాంగు,వీలయితే ఒక ఐటం సాంగు’లే కాస్త కాలక్షేపానికి అందుబాటులో ఉన్నవి. సాధారణ ప్రేక్షకుడికి, బుర్రకి పని పెట్టే సినిమాలు అనవసరం.
సినిమా ఒక వ్యాపారం. పెట్టుబడికి లాభాలని ఎదురుచూడని నిర్మాతలు ఉండరు. ఆత్మ సంతృప్తికోసం తీసే వారు ఈ కోవలోకి రారు. వారికి డబ్బుంది. భరణి లాగ ఒక “సిరా” తీయగలరు. కాని “కారా” కధ “యజ్ఞం” లాంటివి తీసి చేతులు కాల్చుకోలేరు. రామానాయుడు లాంటి నిర్మాతలు, “అవార్డ్” కోసం సినిమా తీయగలరు. కాని ఆ సినిమాకి పెట్టుబడి ఈ “కళ” లేని సినిమాల ద్వారా వచ్చిన “దుడ్డే” నన్నది మరచిపోరాదు.
కాబట్టి “కమర్షియల్ ఒరవడి లో కొట్టుకు పోతున్న నావ మన సినిమా” అని మనం బాధ పడఖర్లేదు. ఎన్.టీ.ఆర్ కళాకారుడు కాదా, ఎస్.వీ.ఆర్ కళాకారుడు కాదా, జగ్గయ్య కళాకారుడు కాదా? కాంచనమాల, సావిత్రి కళాకారులు కాదా?
సినిమాకి మీరిచ్చే నిర్వచనం “సినిమా అంటే ……..కేవలం బికినీలలో ఉన్న హీరోయిన్ల క్యాబరే డ్యాన్సులు, గొంతుచించుకు అరిచే హీరోల అరుపులు మాత్రమే అని మనం గుర్తుంచుకోవడం సబబు” తో అందరూ ఏకీభవించరు. ఎప్పుడూ ఏడుపేనా? (కళాత్మాక సినిమా)కాస్త రిలాక్స్ అవడానికి ఏదైనా సినిమాకి వెళ్దాం అనుకునే వారే ఎక్కువ.
ఇక “టీ” లు తాగుతు, “పెగ్”లూ వేసుకుంటు,పొగ ఊదుతు, ఇలా బ్లాగుకునే జనాలకు మిగిలేదే “కళ”. వీరే “కలాపోసకులు”. కాటన్ / ఖద్దరు బట్టలేసుకుని, షిక్గా “ఎత్నిక్” అస్సెసరీస్ తగిలించుకుని, భుజాన ఒక సంచి వ్రేలాడదీసుకుని తిరిగే ‘ప్సూడో’ క్రిటిక్స్ వల్ల ఒరిగేదేమి లేదు.
యస్. మంచి సినిమాలు చూడాలి. మంచి సినిమాలని ఆదరించాలి. ఆ నిర్మాతలని, దర్శకులని, ఆ కళాకారులని ప్రోత్సహించాలి.
కాని ఏది మంచి?
ఎవరికి మంచి?